పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ20 పెట్రోల్‌లో తేమ, క్లోరైడ్‌ ఉనికిని పరీక్షించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు): 500 పీపీఎం క్లోరైడ్, తేమ ఉందన్నది అవాస్తవం

प्रविष्टि तिथि: 08 AUG 2026 11:20AM by PIB Hyderabad

ఈబీఎంఎస్ (20 పెట్రోల్‌)లో తేమక్లోరైడ్ ఉన్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయిఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈబీఎంఎస్ సరఫరా వ్యవస్థలో ఓఎంసీలు సమగ్ర పరీక్షలు నిర్వహించాయిఇంధన నాణ్యత నిర్దేశించిన విధంగానే ఉన్నట్లు ఫలితాల్లో వెల్లడైందిశాస్త్రీయ పద్ధతిలో విస్తృతంగా నిర్వహించిన పరీక్షల్లో... మీడియాలో వచ్చిన ఆరోపణలకు విరుద్ధంగాఇంధన కాలుష్యంపై ఆందోళన అవసరం లేదని రుజువైనట్లు ఓఎంసీలు తెలిపాయి.

ఇంధన నాణ్యత అత్యంత ప్రాధాన్యత గల అంశమని ఓఎంసీలు తెలిపాయివాహనాల పనితీరుపై లేదా వినియోగదారుల విశ్వాసంపై ప్రభావం చూపే ఏ సమస్యనైనా శాస్త్రీయ పద్ధతిలో విచారించివెంటనే దిద్దుబాటు చర్యలు చేపడతామని గౌరవ వినియోగదారులందరికీ హామీ ఇస్తున్నట్లు వెల్లడించాయి.

పెట్రోల్ బ్లెండింగ్‌లో ఉపయోగించే ఇథనాల్ కోసం భారత ప్రభుత్వం కఠినమైన క్లోరైడ్ ప్రమాణాలను నిర్దేశించిందిసరఫరా వ్యవస్థ వ్యాప్తంగా నిబంధనలను పాటించేలా చేసేందుకు అత్యంత నాణ్యతా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేసిందిరిఫైనరీలుడిస్టిలరీలుడిపోలుటెర్మినళ్లుదేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ కేంద్రాలతో సహా సరఫరా వ్యవస్థలోని అనేక ప్రదేశాల్లో క్లోరైడ్ పర్యవేక్షణ జరుగుతోందిదీనిద్వారా సరఫరా వ్యవస్థలో నాణ్యత స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నాణ్యతా ప్రమాణాలతో పాటు ప్రతీ రిటైల్ కేంద్రాల్లో రోజుకు 8 నుంచి 12సార్లు తేమసాంద్రత పరీక్షలను నిర్వహించటం ద్వారా ఓఎంసీలు నిఘాను కఠినతరం చేశాయిఅత్యున్నత నాణ్యతా ప్రమాణాల నిర్ధారణకుసొంత ఇంధన ప్రయోగశాలల పరీక్షా ఫలితాలను ధ్రువీకరిస్తూ... వివిధ ప్రాంతాల్లో సంచార ఇంధన పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి.

సరఫరా వ్యవస్థ అంతటా అమలైన ఈ బహుళ, పటిష్టమైన పరీక్షా విధానాలు.. ఇంధన నాణ్యతా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు నిరూపించాయి.

1. రిఫైనరీ నుంచి ఎమ్ఎస్పెట్రోల్‌లో వాస్తవ క్లోరైడ్ స్థాయిలు పీపీఎం కన్నా తక్కువ...

వివిధ రిఫైనరీల నుంచి ఎంపిక చేసిన 100కి పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. క్లోరైడ్ పరిమాణం తక్కువగా ఉన్నట్లు తెేలిందిపరీక్షించిన నమూనాలన్నింటిలోనూ క్లోరైడ్ స్థాయి పీపీఎం లేదా అంతకన్నా తక్కువగా ఉందిఇది భారతదేశ బలమైన రిఫైనింగ్సరఫరా ప్రక్రియలో నాణ్యతా తనిఖీల నిరంతర ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.

2. స్వచ్ఛమైన ఇథనాల్ ఇఎక్స్ డిస్టిలరీ:

మిశ్రమం తయారీలో ప్రధానమైన డిస్టిలరీలు సరఫరా చేసే ఇథనాల్‌లో క్లోరైడ్ స్థాయిలు ఎల్లప్పుడూ నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. ఇది ఉత్పత్తి దశలో పటిష్టమైన నాణ్యతా నియంత్రణ విధానాలు అమల్లో ఉన్నట్లు తెలియజేస్తుంది.

గత 10 రోజుల్లో దేశవ్యాప్తంగా 80 డిస్టిలరీల నుంచి ఇథనాల్ నమూనాలను సేకరించి.. ఓఎంసీలుసీహెచ్‌టీ సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పరిశీలించిందిపరీక్షించిన అన్ని నమూనాల్లోనూ క్లోరైడ్ పరిమాణం పీపీఎం కన్నా తక్కువగా ఉన్నట్లు తేలింది.

3. ఓఎంసీల మార్కెటింగ్ మౌలిక సదుపాయాల ద్వారా పంపిణీ అయ్యే ఇథనాల్ బ్లెండెడ్ ఎంఎస్ (ఈ20):

డిపోలుట్యాంకు లారీలు: డిపోలుటెర్మినళ్లలో పరీక్షించిన ఇథనాల్20 నమూనాల్లో క్లోరైడ్ స్థాయిలు పరిమితులకు లోబడి ఉన్నట్లు తేలిందిక్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఇంధనం నిల్వపంపిణీ వ్యవస్థలో నాణ్యత దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారుదేశవ్యాప్తంగా వివిధ ఓఎంసీ టెర్మినళ్ల నుంచి సేకరించిన 80కి పైగా నమూనాల్లో క్లోరైడ్ పరిమాణం పీపీఎం కన్నా తక్కువగా ఉన్నట్లు నిర్దారణ అయింది.

రిటైల్‌ కేంద్రాలు (ఆర్‌ఓ): నిఘా కార్యక్రమంలో భాగంగా వెయ్యికి పైగా నమూనాలను సేకరించగాక్లోరైడ్ పరిమాణానికి సంబంధించి ఇప్పటివరకు 160 పరీక్షా నివేదికలను విశ్లేషించారుగత కొన్ని రోజులుగా క్లోరైడ్ స్థాయిలు సున్నా నుంచి పీపీఎం పరిధిలోనే ఉన్నట్లు తేలిందిఇది వందల కొద్ది పీపీఎం ఉందన్న పలువురి వాదనలకు విరుద్ధంగా ఉందికేవలం నాలుగు వేర్వేరు సందర్భాల్లో మాత్రమే క్లోరైడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు పర్యవేక్షణ వ్యవస్థ గుర్తించిందివాటి సరఫరాను వెంటనే నిలిపివేసిపరిస్థితిని విశ్లేషించిదిద్దుబాటు చర్యలు చేపట్టిన తర్వాతే తిరిగి సరఫరాను పునరుద్ధరించారు.

4. తేమ పరీక్ష:

భూగర్భ ట్యాంకుల్లో నిల్వల తనిఖీ, పర్యవేక్షణను తప్పనిసరి చేస్తూ దాదాపు 90,000 రిటైల్ కేంద్రాల్లో (ఆర్ఓఈ ప్రక్రియ ప్రారంభమైందిఈ ఆర్‌ఓల్లోని భూగర్భ ట్యాంకులను రోజూ 8-12 సార్లు తనిఖీ చేస్తుండగా... తేమ ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

ఈ పరీక్షలకు సంబంధించిన వివరాలు పట్టిక రూపంలో సీహెచ్‌టీ అధికారిక వెబ్‌సైట్‌ www.cht.gov.in. లో అందుబాటులో ఉందిమరిన్ని పరీక్షా ఫలితాలు అందుబాటులోకి వచ్చినప్పుడు అది అప్‌డేట్‌ అవుతుంది.

ఇంధన నాణ్యతే అత్యంత ప్రధానమైన అంశమని వినియోగదారులకు చమురు మార్కెట్ కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. సరఫరా వ్యవస్థ అంతటా నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూనే ఉంటామనిలోపాలు తలెత్తితే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.

ఎలాంటి సందేహాలు లేకుండా వినియోగదారులు ఈ20 పెట్రోలును ఉపయోగించవచ్చనిఓఎంసీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీలు స్పష్టం చేశాయివినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు పటిష్టమైన నాణ్యతపర్యవేక్షణ వ్యవస్థలు అమలవుతున్నట్లు తెలిపాయి.

 

***


(रिलीज़ आईडी: 2296526) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam