ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
‘భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’లో సాధించిన పురోగతిని సమీక్షించిన ఇరువురు నేతలు
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్న ఇరు దేశాల నాయకులు
నాడు పోస్టు చేయడమైనది:
06 AUG 2026 7:01PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.
‘భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’లో సాధిస్తున్న నిరంతర పురోగతిని ఇరు దేశాల నేతలు సమీక్షించారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరు దేశాల నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు.
ఉభయ నేతలూ ఒకరికొకరు నిరంతరం అందుబాటులో ఉండేందుకు అంగీకరించారు.
(రిలీజ్ ఐడి: 2295754)
సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam