సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాత్రికేయులకు సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ, అక్రిడేషన్ మద్దతు... పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం
प्रविष्टि तिथि:
05 AUG 2026 5:00PM by PIB Hyderabad
జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, వారి కుటుంబాలకు అత్యవసర ప్రాదిపదికన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు జర్నలిస్టు సంక్షేమ పథకం (జేడబ్ల్యూఎస్)ను ప్రభుత్వం అమలు చేస్తోంది. మరణం, శాశ్వత వైకల్యం, తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఆస్పత్రిలో చేరటం వంటి క్లిష్ట పరిస్థితుల్లోసాయపడడమే ఈ పథకం లక్ష్యం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రాష్ట్ర, యూటీ ప్రభుత్వాల గుర్తింపు పొందిన జర్నలిస్టులతో పాటు, గుర్తింపు పొందని జర్నలిస్టులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
జేడబ్ల్యూఎస్ పథకం ద్వారా 2014-15 నుంచి 2025-26 వరకు ప్రభుత్వం 456 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబాలకు రూ. 19.41 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా గుర్తింపు పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) సౌకర్యాలను దేశ వ్యాప్తంగా ఎక్కడైనా పొందవచ్చు. ఇందులో ప్రభుత్వ, సీజీహెచ్‌ఎస్ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో... సీజీహెచ్‌ఎస్ రేట్ల ప్రకారం చికిత్స పొందవచ్చు.
దేశ రాజధాని ప్రాంతంలో జర్నలిస్టులకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గుర్తింపును జారీ చేస్తుంది. ఈ రోజు వరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా గుర్తింపు పొందిన జర్నలిస్టుల సంఖ్య 1,786.
శ్రీ దామోదర్ అగర్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా... సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని రాతపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2295372)
आगंतुक पटल : 6