సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం - 2023, ఐటీ నిబంధనల ద్వారా పైరసీ నిరోధానికి పటిష్టమైన చర్యలు
4,996 టెలిగ్రామ్ ఛానెళ్లు, 1,263 వెబ్‌సైట్లతోసహా 7,393 వెబ్ సైటు చిరునామాల తొలగింపు
प्रविष्टि तिथि:
05 AUG 2026 4:38PM by PIB Hyderabad
టెలిగ్రామ్ వంటి మధ్యవర్తి వేదికల (ఇంటర్మీడియరీ వేదికలు) ద్వారా చట్టవిరుద్ధంగా సినిమాలను పంపిణీ చేయడంతో సహా సినిమాల ఆన్‌లైన్ చౌర్యాన్ని (పైరసీ) అరికట్టడానికి ప్రభుత్వం చట్టపరమైన, సంస్థాగత వ్యవస్ధను బలోపేతం చేసింది. సినిమాలను అనుమతి లేకుండా రికార్డు చేయడాన్ని, ప్రదర్శించడాన్ని నిరోధించడానికి నిర్దిష్ట నిబంధనలను తీసుకువస్తూ సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం, 2023 ద్వారా సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952ను సవరించారు. కొత్తగా చేర్చిన సెక్షన్ 7(1బీ)(ii) ద్వారా సమాచార సాంకేతికత చట్టం, 2000 లోని సెక్షన్ 79(3) ప్రకారం, పైరేటెడ్ కంటెంట్‌ను ప్రసారం చేసే మధ్యవర్తి వేదికలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లభించింది.
సమాచార సాంకేతిక చట్టం - 2000లోని సెక్షన్ 79(3)(బి) ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించేందుకు లేదా దాని లభ్యతను నిలిపివేసేందుకు సంబంధిత ప్రభుత్వాలు ఇంటర్మీడియరీలకు నోటీసులు జారీ చేసే అధికారం కలిగి ఉన్నాయి. ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ చట్టాన్ని అయినా ఉల్లంఘించే కంటెంట్ గురించి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినా, లేదా సంబంధిత ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధీకృతసంస్థ నుంచి నోటీసు అందినా ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించడం లేదా దానికి లభ్యతను నిలిపివేయడం ఇంటర్మీడియరీలకు తప్పనిసరి.
సినిమాల పైరసీపై ఫిర్యాదులు అందిన వెంటనే, కాపీరైట్‌ను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించేందుకు లేదా దానికి లభ్యతను ప్రాప్యతను నిలిపి వేసేందుకు సంబంధిత డిజిటల్ వేదికలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. ఐటీ నిబంధనలు–2021, సినిమాటోగ్రాఫ్ చట్టం - 1952 ప్రకారం, డిజిటల్ వేదికలకు కంటెంట్ తొలగింపు నోటీసులు జారీ చేసే అధికారాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని సంయుక్త కార్యదర్శి (ఫిల్మ్స్) కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సినిమాల పైరేటెడ్ కాపీలపై కాపీరైట్ హక్కుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, అలాంటి కంటెంట్ ను నిలిపి వేసేలా సంబంధిత డిజిటల్ వేదికలకు నోటీసులు జారీ చేసేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
పైరసీ నిరోధక చర్యలు
చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా, సినిమాల పైరసీకి పాల్పడుతున్న 7,393 యూఆర్ఎల్‌లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత డిజిటల్ వేదికలకు ఆదేశాలు జారీ చేశారు. వీటిలో 1,263 వెబ్‌సైట్లు, 4,996 టెలిగ్రామ్ ఛానళ్లు ఉన్నాయి. మిగిలినవి ఇతర డిజిటల్ వేదికలకు చెందిన యూఆర్ఎల్‌లు.
సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రోజు లోక్‌సభలో బాలశౌరి వల్లభనేని ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2295047)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam