రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పీబీజీ సోల్జర్‌థాన్‌ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 02 AUG 2026 1:56PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలోమిజోరాం గవర్నర్ జనరల్ డాక్టర్ వి.కెసింగ్ (రిటైర్డ్సమక్షంలో పీబీజీ (ప్రెసిడెంట్స్ బాడీగార్డ్స్సోల్జర్‌థాన్‌ను వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించారుఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె ప్రత్యేక పోస్టల్ కవర్‌నూ విడుదల చేశారుఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ పోటీ జరిగింది.

'సైనికుల కోసం పరుగెత్తండిసైనికులతో కలిసి పరుగెత్తండిఅనే దార్శనికతతో... పౌరులకుసాయుధ దళాలకు మధ్య బంధాన్ని బలోపేతం చేసే ఒక విశిష్ట వేదికగా ఈ సోల్జర్‌థాన్ నిలుస్తుంది. 'నిజమైన వీరులకు మద్దతు – భారత సాయుధ దళాలుఇతివృత్తం ఆధారితమైన ఈ కార్యక్రమం... మన సైనికుల అంకితభావంధైర్యంత్యాగాలకు నివాళులర్పిస్తూచురుకైన భాగస్వామ్యం ద్వారా వారికి సంఘీభావాన్ని ప్రకటించేలా పౌరులను ప్రోత్సహిస్తుంది.

సోల్జర్‌థాన్ రేసులను కిలోమీటర్లుకిలోమీటర్లు10 కిలోమీటర్లతో మూడు విభాగాల్లో నిర్వహిస్తారుసోల్జర్‌థాన్ ద్వారా సమకూరే ఆదాయాన్ని ప్లారాప్లెజిక్ సైనికులకు చికిత్సనందించే పునరావాస కేంద్రంయుద్ధంలో గాయపడిన సైనికుల పిల్లల సంక్షేమం మొదలైన సహాయక కార్యక్రమాల కోసం వినియోగిస్తారుపీబీజీ సోల్జరథాన్ ముఖ్యోద్దేశం పీబీజీకి చెందిన గుర్రాలకుదళాలకు అవసరమైన సహాయం అందించడం.

 

***


(रिलीज़ आईडी: 2293538) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam