ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 AUG 2026 4:54PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సందర్భంగా తన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాథ్యమం వేదికగా పంచుకున్నారు.

 ‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీసోదరులకు అభినందనలు.

మన సుసంపన్న చరిత్రలోని స్ఫూర్తిదాయక వ్యక్తుల కృషిని గుర్తించాలనే మా ప్రాధాన్యతకు అనుగుణంగానే ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు.”

“కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రగతి కోసం అద్భుతమైన వేగంతో పనిచేస్తున్నాయి. బ్లూ ఎకానమీ, ఓడరేవుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి ఇంకా మరెన్నో అంశాలపై మేం దృష్టి సారిస్తున్నాం.”

“నా మిత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ, దాని కోసం అత్యంత ఉత్సాహంతో పని చేస్తోంది. సెమీకండక్టర్లు, ఐటీ, ఆవిష్కరణల వంటి రంగాల్లో రాష్ట్రం అద్భుత కృషిని కొనసాగిస్తోంది. దీనివల్ల రాష్ట్ర యువతకూ ప్రయోజనం చేకూరుతోంది.


(रिलीज़ आईडी: 2293350) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam