ప్రధాన మంత్రి కార్యాలయం
మున్షీ ప్రేమ్‌చంద్ జయంతి.. నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
31 JUL 2026 1:48PM by PIB Hyderabad
ప్రముఖ సాహితీవేత్త మున్షీ ప్రేమ్‌చంద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన తన రచనల ద్వారా మున్షీ ప్రేమ్‌చంద్ మానవ భావోద్వేగాలకు అద్దం పట్టారనీ, ఆయన రచనలు ఈనాటికీ సందర్భశుద్ధిని కలిగి ఉన్నాయనీ ప్రధానమంత్రి అన్నారు. ప్రేమ్‌చంద్ తన జన్మస్థలమైన కాశీ సాహితీ వారసత్వానికి ప్రపంచ గుర్తింపును తీసుకురావడంలో అమూల్య తోడ్పాటును అందించారని ప్రధానమంత్రి అన్నారు.
వాస్తవికతనీ, సామాజిక సమానత్వాన్నీ చాటే మున్షీ ప్రేమ్‌చంద్ శాశ్వత సాహిత్యం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ మున్షీ ప్రేమ్‌చంద్ గారు గొప్ప కథారచయిత.. ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. కాలాన్ని జయించిన తన రచనలతో మానవీయ భావోద్వేగాలను ప్రభావవంతంగా ఆయన చిత్రించిన తీరు ఈనాటికీ సందర్భశుద్ధిని కలిగి ఉంది. తన జన్మభూమీ, కర్మభూమీ అయిన కాశీ సాహిత్య వారసత్వానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపును తీసుకురావడంలో ప్రేమ్‌చంద్ గారు అమూల్య తోడ్పాటును అందించారు. యథార్థానికీ, సామాజిక సమానత్వానికీ ప్రాధాన్యాన్ని ఇచ్చిన ఆయన అమర సాహిత్యం దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2292591)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam