ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రకృతి పట్ల గౌరవం, పర్యావరణాన్ని సంరక్షించడం ముఖ్యం: ప్రధానమంత్రి


ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 JUL 2026 10:26AM by PIB Hyderabad

ప్రకృతిపర్యావరణంసంపూర్ణ విశ్వం పట్ల గౌరవ భావంతో నడుచుకోవడం మన మనుగడకు మూలాధారమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుదేశాన్ని ఆరోగ్యకరంగాసౌభాగ్యవంతంగాశక్తిమంతంగా రూపొందించడానికి కృతజ్ఞత‌తోనూప్రకృతిపట్ల నిస్వార్థ సేవ భావంతో ముందుకు రావాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘
శం నో ద్యావాపృథివీ పూర్వహూతౌ శమన్తరిక్షం దృశ్యే నో అస్తు
శం న ఓషధీర్వనినో భవన్తు శం నో రజసస్పతిరస్తు జిష్ణుః’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సృష్టి ఆరంభం నుంచే మనం పూజనీయంగా భావిస్తున్న ఆకాశంభూమీ మనకు శుభాలను అందిస్తున్నాయని ఈ సుభాషితం చెబుతోందిభూమికీసూర్యునికీ మధ్య విస్తరించి చోటు మన జీవితాలకు ప్రయోజనాలను అందించడంతో పాటు మనలో జ్ఞానాన్ని కూడా పెంపొందింప చేయుగాకఅన్ని ఔషధ మొక్కలూవన మూలికలూ మనకు ఆరోగ్యాన్నీపోషణనీసంతోషాన్నీ అందించుగాకసర్వవ్యాప్తుడూవిజేతా అయిన దైవం మనకు ఎప్పటికీ సంక్షేమాన్నీశాంతినీసౌభాగ్యాన్నీ ఇస్తూ ఉండు గాక.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
ప్రకృతినీపర్యావరణాన్నీసమస్త సృష్టినీ గౌరవించడం మన మనుగడకు మూలాధారంరండి.. వీటి పట్ల మనం పూర్తి కృతజ్ఞతనీసేవాభావననీ కలిగి ఉంటూ ఆరోగ్యకరసౌభాగ్యవంతశక్తిమంత దేశాన్ని నిర్మించడంలో పాలుపంచుకుందాం.
‘‘
శం నో ద్యావాపృథివీ పూర్వహూతౌ శమన్తరిక్షం దృశ్యే నో అస్తు
శం న ఓషధీర్వనినో భవన్తు శం నో రజసస్పతిరస్తు జిష్ణుః’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2291590) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam