ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 కామన్వెల్త్ గేమ్స్: రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 JUL 2026 2:07PM by PIB Hyderabad

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 79 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన వల్లూరి అజయ్ బాబుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో స్నాచ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడం ద్వారా వల్లూరి అజయ్ బాబు ఎనలేని ఖ్యాతిని సంపాదించడని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అతని భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం అవ్వాలని శ్రీ నరేంద్ర మోదీ కాంక్షించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో ఘనత!

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల విభాగంలో వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించటం సంతోషకరంస్నాచ్ విభాగంలో సీడబ్ల్యూజీ రికార్డును నెలకొల్పడం ద్వారా తిరుగులేని ఖ్యాతిని ఆర్జించాడుఅతనికి శుభాకాంక్షలుభవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా"

 

***


(रिलीज़ आईडी: 2290456) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil