ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన జ్ఞానేశ్వరి యాదవ్‌కు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 27 JUL 2026 8:17PM by PIB Hyderabad

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026 వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజక పతకం సాధించిన జ్ఞానేశ్వరి యాదవ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

ఈ పోటీలో ఆమె తన అత్యుత్తమ వ్యక్తిగత రికార్డును నమోదు చేయడంతో ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని ప్రధాని గుర్తుచేశారు. ఈ విజయం భారతీయ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం గెలుచుకున్న జ్ఞానేశ్వరి యాదవ్‌కు అభినందనలు. ఈ పోటీలో ఆమె తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడం వల్ల ఈ విజయం మరింత విశేషమైనది. ఆమె విజయం భారత యువతకు స్ఫూర్తినివ్వాలి. ఆమె భవిష్యత్తు ప్రయాణంలో నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’.

 

***


(रिलीज़ आईडी: 2290194) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil