ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2026 1:59PM by PIB Hyderabad

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ మరో పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుగ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి రజత పతకం గెలిచినందుకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

అతని విజయం ప్రతి భారతీయుడు సంతోషపడేలాగర్వించేలా చేసిందని.. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ నరేంద్ర మోదీ కాంక్షించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పంచుకున్నారు.

"వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం!

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 65 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన రాజా ముత్తుపాండికి శుభాకాంక్షలుఅతని విజయం భారతీయులందరికీ ఆనందాన్ని పంచిందిభవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని నా ఆకాంక్ష.

***


(రిలీజ్ ఐడి: 2289987) సందర్శకుల సూచీ సంఖ్య : : 46