ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌‌‌లో తన ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 JUL 2026 9:33PM by PIB Hyderabad

మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌‌ ప్రసంగం ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
మన దేశాన్ని రక్షించడంతో పాటు మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్న వారందరికీ ప్రణామాలు.
నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అనే సందేశాన్ని‘‘క్యాచ్ ద రెయిన్’’ ప్రచార ఉద్యమం మనకు అందిస్తోందిఈ విషయంలో మధ్యప్రదేశ్మహారాష్ట్రఆంధ్రప్రదేశ్ఛత్తీస్‌గఢ్ఒడిశాలు చేస్తున్న ప్రయత్నాల్ని ప్రస్తావించాను.
‘‘
కష్టపడి సాధించుకున్న విజయం ప్రత్యేకమైందిఅయితే అది ఏదైనా ఒక ప్రతిష్ఠాత్మక వేదిక మీద లభించిందంటే అప్పుడు అది అందించే సంతోషం మరింత పెద్దదిగా మారిపోతుంది.
లార్డ్‌స్‌లో మన మహిళా క్రికెట్ జట్టు గెలిచినప్పుడు సరిగ్గా ఇలాంటి అనుభూతే కలిగిందిజట్టుకు అభినందనలురాబోయే కాలంలో కూడా వారు రాణించాలని కోరుకుంటున్నాను.’’  
‘‘
కేరళంలోని ఎర్నాకుళంలో ఒక అద్వితీయ ప్రయత్నం.. 

అక్కడ ఫుట్‌బాల్సంస్కృత భాషల మధ్య ఓ సుందర సమన్వయం చోటుచేసుకుంది.’’
‘‘
కిందటి నెల సైన్సుఅంతరిక్ష రంగాల్లో గొప్పగా చెప్పుకోదగిన నెలవిక్రమ్-1 విజయవంతం కావడం దేశ కల్పనాశక్తికీఉత్సాహానికీ ఒక కొత్త జోరును అందించిందిదీంతో పాటువివిధ ఒలింపియాడ్లలో అందిన విజయాలు కూడా ఖచ్చితంగా మరింత మంది యువజనులకు సైన్స్ రంగంలో అత్యుత్తమంగా రాణించడానికి స్ఫూర్తిని అందించేవే’’.  
జమ్మూకాశ్మీర్‌లో ‘వాగూ’ను పునరుద్ధరించిప్రజాదరణ లభించేటట్లు చూసే దిశగా సాగుతున్న ప్రయత్నాల్ని చూసి ఆనందిస్తున్నానుమీరంతా మీ ఇళ్లలో ఒకటి తప్పక పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను’’.
‘‘
గుజరాత్‌లోనూఉత్తరప్రదేశ్‌లోనూ చేపట్టిన ప్రశంసనీయ ప్రయత్నాలు ప్రకృతికి  మనం ఎంతటి ప్రాధాన్యాన్నిస్తామో చాటుతున్నాయి’’
.
‘‘
గొప్ప విజయాలను సాధించిన తరువాత కూడా మనుషులు వారి మూలాలను మరచిపోరని డాక్టర్ రొనాల్డో లైశ్‌రామ్ నిరూపించారు’’.
‘‘
గత 12 సంవత్సరాల్లో ఖాదీ విక్రయాలు బాగా పెరిగాయిఇది దీనికి లభిస్తున్న ప్రజాదరణకు ప్రతీకగాస్థానిక వాణిజ్య సంస్థలకు దన్నుగా నిలుస్తోందిఎంతో మంది చేతి వృత్తి కళాకారులకు అవకాశాలను కూడా అందిస్తోందిరానున్న పండుగల కాలంలో కనీసం ఒక్క ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేసి ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల వైపే మొగ్గు చూపుదాంప్రచార ఉద్యమానికి మద్దతిద్దాం.. రండి’’.
‘‘ ‘
చోంగ్‌ప్రెంగ్’ ప్రజాదరణకు నోచుకొనే దిశగా త్రిపురకు చెందిన శ్రీ సుర్జా కుమార్ దేబ్‌బర్మ గారు చేసిన ప్రయత్నం ప్రశంసనీయంఇది మన సంగీత సంప్రదాయాలు అనేక సంవత్సరాలుగా ఆదరణకు నోచుకుంటున్నాయన్న సంగతిని కూడా చాటిచెబుతోంది’’.
‘‘
ఉత్తరప్రదేశ్‌.. బిజ్‌నౌర్ జిల్లా‌లో స్వయంసహాయ బృందాల మహిళలు ‘స్వదేశీ హెర్బల్ టీ’ని తయారు చేశారుఇది చాలా మంది తల్లులుఅక్కచెల్లెళ్ల జీవితంలో స్వయంసమృద్ధిని సాధించిందిదీనికి ఉన్న గొప్ప రుచి కారణంగా ఈ హెర్బల్ టీకి తక్కువ కాలంలోనే గుర్తింపును తెచ్చుకుంది’’.

 

‘‘బీహార్‌.. సీతామఢీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆకర్షణీయమన్నికైన బెంచీలను తయారు చేస్తున్నారుచెత్త నుంచి సంపదను సృష్టించే ఈ అరుదైన ప్రయత్నం ‘రెడ్యూస్రీయూజ్రీసైకిల్’ ఓ నినాదంగా మాత్రమే మిగిలిపోకుండాజీవితంలో ఓ భాగంగా మారుతోందని తెలియజేస్తోంది’’.

‘‘గణేశ్ ఉత్సవం సందర్భంగా మట్టి ప్రతిమలను తయారు చేయాలన్న నా మనవికి దేశ ప్రజలు చాలా సానుకూలంగా ప్రతిస్పందించడం చూసి నేను ఎంతో సంతోషించానువాళ్లు నాకు పంపిన సందేశాలతో గణపతి మీద భక్తితో పాటు ప్రకృతిపట్ల వారికి ఉన్న అంకిత భావం తెలుస్తోంది’’.

***


(रिलीज़ आईडी: 2289977) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam