మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా శ్రీ ప్రహ్లాద్ జోషి బాధ్యతల స్వీకారం


ఆ శాఖలోని ఉన్నతాధికారులతో సమావేశం

प्रविष्टि तिथि: 26 JUL 2026 2:00PM by PIB Hyderabad

  కేంద్ర విద్యాశాఖ మంత్రిగా శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ రోజు కర్తవ్య భవన్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు-ఆహార-ప్రజా పంపిణీ శాఖతోపాటు నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించగానే ఆ శాఖ ఉన్నతాధికారులతో శ్రీ జోషి తన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి కూడా ఇందులో పాల్గొన్నారు.

 

అలాగే, ఉన్నత విద్యా విభాగం కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ టి.కె.అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

***


(रिलीज़ आईडी: 2289623) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam