రక్షణ మంత్రిత్వ శాఖ
భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణి ‘కుశ’ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో
प्रविष्टि तिथि:
23 JUL 2026 7:37PM by PIB Hyderabad
భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణి ‘కుశ’ తొలి ప్రయోగ పరీక్షను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) 2026, జులై 23న విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అధిక వేగంతో, ఎక్కువ ఎత్తులో వైమానిక ముప్పును అనుకరించే ఒక ఎలక్ట్రానిక్ లక్ష్యంపై ఈ పరీక్షను నిర్వహించారు. క్షిపణి వ్యవస్థ దానిని విజయవంతంగా అడ్డుకుంది.

యుద్ధ విమానాలు, క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు, భారీ శత్రు విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను విస్తృత దూరం, ఎత్తులో నిర్వీర్యం చేయగల సామర్థ్యాన్ని కుశ క్షిపణి వ్యవస్థకు ఉంది. క్షిపణులు, రాడార్లు, కమాండ్, కంట్రోల్ సెంటర్‌తో సహా ఈ ఆయుధ వ్యవస్థలోని అన్ని పరికరాలను వివిధ డీఆర్‌డీవో ప్రయోగశాలలు, పారిశ్రామిక భాగస్వామ్యులు అభివృద్ధి చేశారు.
‘కుశ’ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ తెలిపారు. ఇది భారత రక్షణ పరిశోధనాభివృద్ధిలో ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుందన్నారు. అలాగే భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని సూచిస్తోందన్నారు. ఈ సామర్థ్యం కొన్ని దేశాలకు మాత్రమే ఉందని తెలిపారు. దీని వల్ల ఇలాంటి వ్యవస్థల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, గగన తల రక్షణ వ్యవస్థ సామర్థ్యంలో సాధించిన భారీ విజయాన్ని సూచిస్తోందని తెలియజేశారు.
రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్ శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ప్రయోగ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ విజయంలో భాగస్వాములైన బృంద సభ్యులను అభినందించారు.
***
(रिलीज़ आईडी: 2288830)
आगंतुक पटल : 4