ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆత్మకు, విశ్వ చైతన్యానికి మధ్య గాఢమైన అలౌకిక సంబంధాన్ని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 JUL 2026 7:50AM by PIB Hyderabad

ఆత్మకు, విశ్వ చైతన్యానికి మధ్య గాఢమైన, అలౌకిక సంబంధం ఉందని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘యశ్చాయమస్మిన్నాకాశే తేజోమయోఅమృతమయః పురుషః సర్వానుభూః

యశ్చాయమస్మిన్నాత్మని తేజోమయోఅమృతమయః పురుషః సర్వానుభూః’’ అని పేర్కొన్నారు.

విశాల ఆకాశం, లేదా అంతరిక్షంలో విరాజిల్లుతున్న శక్తిమంతమైన, శాశ్వత వాస్తవికతయే మన ఆత్మలలోనూ నివాసముంటోంది. ఈ కారణంగానే మనిషి లోపల ప్రతి ఒక్క సూక్ష్మ కణంలో విలసిల్లుతున్నదే యావత్తు విశ్వంలో వ్యాపించివుందని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.


 

***

MJPS/SS/PRK


(రిలీజ్ ఐడి: 2288186) సందర్శకుల సూచీ సంఖ్య : : 46