రైల్వే మంత్రిత్వ శాఖ
రైలుమార్గ విద్యుదీకరణలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా భారత్... దేశంలో 99.6 శాతం బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తి... స్విట్జర్లాండ్ తరువాత రెండో స్థానం ఇండియాదే
రైలు రవాణాలో డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్లు ఉండగా 2024-25లో అది 108 కోట్లకు పరిమితం... దీంతో విదేశీ మారక ద్రవ్యంలో ఆదాతో పాటు కర్బన ఉద్గారాల్లోనూ తగ్గుదల
భారతీయ రైల్వేలు చేపట్టిన విద్యుదీకరణ ఉద్యమంతో స్వచ్ఛ రవాణాకు ప్రోత్సాహం... రోడ్డు రవాణా కన్నా రైలు రవాణాలో కర్బన ఉద్గారాలు దాదాపు 89 శాతం తక్కువ
భారతీయ రైల్వేల్లో తక్కువ స్థాయి కర్బన ఉద్గారాలకు దన్నుగా నిలవడానికి 1,260 మెగావాట్లకు పైగా సౌర, పవన విద్యుత్తు సామర్థ్యం జోడింపు
प्रविष्टि तिथि:
22 JUL 2026 1:01PM by PIB Hyderabad
భారతీయ రైల్వేల (ఐఆర్)లో రైలు మార్గ నెట్‌వర్కు విద్యుదీకరణ పనులను ఉద్యమ తరహాలో కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బ్రాడ్ గేజ్ (బీజీ) నెట్‌వర్కులో 99.6 శాతం విద్యుదీకరణను పూర్తి చేశారు. నెట్‌వర్కులో మిగిలిన భాగాన్ని విద్యుదీకరించే పనులు జరుగుతున్నాయి. 2014కు పూర్వమూ, 2014 నుంచి 2026 మధ్య కాలంలోనూ విద్యుదీకరణ తీరుతెన్నులు ఈ కింది విధంగా ఉన్నాయి:
|
కాలం
|
విద్యుదీకరణ పూర్తి అయిన మార్గం ఎన్ని కిలోమీటర్లంటే
|
|
2014కు పూర్వం (దాదాపు 60 సంవత్సరాలు)
|
21,801
|
|
2014 నుంచి ఇప్పటి వరకు
|
48,072
|
దీనికి అదనంగా అన్ని కొత్త మార్గాలు, బహుళ మార్గాలతో కూడిన ప్రాజెక్టులకు విద్యుదీకరణ ప్రాతిపదికనే ఆమోదం తెలుపుతున్నారు. సంబంధిత పనులను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.
భారతీయ రైల్వేలు చేపట్టిన రైలు మార్గ విద్యుదీకరణ కార్యక్రమం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా పురోగమిస్తున్న ఈ కోవకు చెందిన కార్యక్రమాల్లో ఒకటి. చాలా దేశాలు తమ అత్యంత రద్దీగా ఉండే ప్రయాణికుల, సరుకు రవాణా కారిడార్ల విద్యుదీకరణకు మాత్రమే ప్రాధాన్యాన్ని ఇస్తున్న నేపథ్యంలో, భారత్ తన పూర్తి బ్రాడ్ గేజ్ నెట్‌వర్కును విద్యుదీకరించడానికి నడుం కట్టడం విశేషం. రైల్వే విద్యుదీకరణలో భారతీయ రైల్వేలు సాధించిన విజయం అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గది. 2025 జూన్‌లో వెలువడిన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (యూఐసీ) తాజా నివేదికలో పేర్కొన్న ప్రకారం, ప్రధాన రైల్వే వ్యవస్థల్లో రైల్వే విద్యుదీకరణ స్థితి ఇలా ఉంది:
|
దేశం
|
రైలుమార్గ విద్యుదీకరణ (శాతంలో)
|
|
స్విట్జర్లాండ్
|
100 %
|
|
భారత్
|
99.6 %
|
|
చైనా
|
82 %
|
|
స్పెయిన్
|
67 %
|
|
జపాన్
|
64 %
|
|
ఫ్రాన్స్
|
60 %
|
|
బ్రిటన్
|
39 %
|
నెట్‌వర్క్ కవరేజీని బట్టి చూస్తే, ప్రస్తుతం ప్రపంచంలో అన్నింటి కన్న విస్తృతంగా విద్యుదీకరణ పూర్తి అయిన ప్రధాన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వేలు ఒకటి . భారతీయ రైల్వేలు (ఐఆర్) తన బ్రాడ్ గేజ్ నెట్‌వర్కులో 99.6 శాతం మేరకు విద్యుదీకరణను పూర్తి చేసింది. దీంతో పదేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు, మౌలిక సదుపాయాల్లో అతి భారీ స్థాయిలో మార్పునకు సంబంధించిన కార్యక్రమం వేగంగా పూర్తి అయినట్లు చెప్పవచ్చు.
రైలు మార్గాన్ని విద్యుదీకరించడం అంటే అది ఒక్క పర్యావరణానుకూల చర్య మాత్రమే కాదు. అది ఇంధనాన్ని ఆదా చేసే చర్య కూడా. రోడ్డు మార్గం మీదుగా రవాణా చేయడంతో పోల్చి చూస్తే, రైలు మార్గం గుండా రవాణా చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో లోటు ఈ కింద ప్రస్తావించిన విధంగా ఉంటుంది. (దీనికి ‘‘భారత్‌లో సరుకు రవాణాను వేగవంతంగా ముందుకు తీసుకుపోవడం’’, జూన్ 2021 పేరిట నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే ఆధారం.)
|
రవాణా రీతి
|
ఒక టన్ను బరువును 1 కిలోమీటరు వరకు తీసుకుపోయిన సందర్భంలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారం పరిమాణం
|
|
రోడ్డు
|
101 గ్రాములు
|
|
రైలు
|
11.5 గ్రాములు (సుమారు 89 % తక్కువ)
|
దీనికి అదనంగా, రైలు మార్గాలను విద్యుదీకరించడంతో శిలాజ జనిత ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది. డీజిల్ వినియోగం తగ్గే కారణంగా కర్బన ఉద్గారాలు కూడా పరిమితమవుతాయి. విద్యుదీకరణ వల్ల రైళ్ల సామర్థ్యంతో పాటు వేగం పెరుగుతుంది. ఫలితంగా ప్రయాణానికి పట్టే సమయం కుదించుకుపోవడమే కాకుండాచ సామర్థ్యమూ పెరుగుతుంది.
భారతీయ రైల్వేల డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల మేరకు ఉండగా, 2024-25లో సుమారు 108 కోట్ల లీటర్లుంది. అంటే.. డీజిల్ వినియోగం 185 కోట్ల లీటర్ల మేర తగ్గింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు విదేశీ మారక ద్రవ్యం మిగిలింది. విద్యుదీకరణను చేపట్టినందువల్ల మిగిలిన ఈ డబ్బును, ఆ పనిని చేపట్టకపోయి ఉంటే ఇంధన దిగుమతికి ఖర్చుపెట్టవలసి వచ్చేది.
విద్యుదీకృత రైలు మార్గాలు.. సౌర, పవన, ఇతర పునరుత్పాదక ఇంధనాలను బరువులను లాగడానికి ఉద్దేశించిన (కర్షణ) విద్యుత్తు వ్యవస్థలతో ఏకీకరించడానికి ఉపయుక్తంగా ఉంటాయి. దీంతో అవి పునరుత్పాదక విద్యుత్తును వినియోగించుకోవడంలో అన్నింటి కన్నా సమర్థమైన రవాణా వ్యవస్థలుగా నిలుస్తాయి. వ్యూహాత్మక విద్యుత్తు కొనుగోలు ప్రణాళికను ఆధారంగా చేసుకొని పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం దన్నుతో ‘సంపూర్ణ రైల్వే విద్యుదీకరణ’ లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకుపోతున్న భారతీయ రైల్వేలు తన కార్యకలాపాలను సుస్థిర ప్రాతిపదికన నిర్వహించడానికి కట్టుబడి ఉంది. ఈ పద్ధతిలో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి కూడా తోడ్పాటు లభిస్తోంది.
సౌర విద్యుత్తూ, పవన విద్యుత్తూ, ఈ రెండు విధాల విద్యుత్తూ మేళవించిన హైబ్రిడ్ సిస్టమ్స్ (సౌర, పవన, ఇంధన నిల్వ) రూపేణా పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుంటూ, దశల వారీగా తన విద్యుత్తు ఆధారిత లాగుడు శక్తి (ట్రాక్షన్) అవసరాలను తీర్చుకోవాలన్నదే భారతీయ రైల్వేల ధ్యేయంగా ఉంది. ఇదే నెరవేరితే, భారతీయ రైల్వేల కర్బన ఉద్గారాల స్థాయి తగ్గుతుంది. 2026 జూన్ నాటికి ఇంచుమించు 1161 మెగా వాట్ల సౌర ఇంధన ప్లాంటులతో పాటు (ఇంటి పైకప్పుల మీదా, నేల మీదా ఏర్పాటు చేసినవి కలుపుకొని) సుమారుగా 103 మెగా వాట్ల పవన విద్యుత్తు ప్లాంటులు పనిచేయడం మొదలుపెట్టాయి.
వంద శాతం విద్యుదీకరణ కార్యక్రమం (‘మిషన్ 100 పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్’) అత్యంత సవాళ్లతో నిండిన ప్రాజెక్టు. ఎందుకంటే, దీనిలో ఇప్పటికే పనిచేస్తున్న రైలు మార్గాల విద్యుతీకరణ ఒక భాగంగా ఉంది. కార్యక్రమం అమలు దశలో ఏవైనా అనూహ్య సవాళ్లను ఎదుర్కోవలసిరావచ్చు. రైల్వే విద్యుదీకరణ పనులను వేగవంతంగా కొనసాగించడానికి భారతీయ రైల్వేలు అనేక నిర్ణయాలను తీసుకుంది. వాటిలో.. పనులను మొదలుపెట్టే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రాజెక్టు పర్యవేక్షణ బృందం (ప్రాజెక్ట్ మానిటరంగ్ గ్రూప్.. పీఎంజీ) పోర్టల్‌ను రూపొందించడం, ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రభావవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, తగినంత నిధులను అందుబాటులో ఉంచడం, క్షేత్ర విభాగాలకు ఆర్థిక అధికారాలను పెంపొందించడం వంటి నిర్ణయాలు భాగంగా ఉన్నాయి.
జోన్ వారీ విద్యుదీకరణ స్థితి ఈ కింది విధంగా ఉంది:
|
వరుస సంఖ్య
|
జోన్
|
ఎంత శాతం విద్యుదీకరణ పూర్తయిందంటే..
|
|
1
|
సెంట్రల్ రైల్వే
|
100%
|
|
2
|
తూర్పు కోస్తా రైల్వే
|
100%
|
|
3
|
ఈస్ట్ సెంట్రల్ రైల్వే
|
100%
|
|
4
|
తూర్పు రైల్వే
|
100%
|
|
5
|
కొంకణ్ రైల్వే
|
100%
|
|
6
|
కోల్‌కతా మెట్రో
|
100%
|
|
7
|
ఉత్తర మధ్య రైల్వే
|
100%
|
|
8
|
ఈశాన్య రైల్వే
|
100%
|
|
9
|
ఉత్తర రైల్వే
|
100%
|
|
10
|
దక్షిణ మధ్య రైల్వే
|
100%
|
|
11
|
దక్షిణ కోస్తా రైల్వే
|
100%
|
|
12
|
ఆగ్నేయ మధ్య రైల్వే
|
100%
|
|
13
|
సౌత్ ఈస్టర్న్ రైల్వే
|
100%
|
|
14
|
పశ్చిమ మధ్య రైల్వే
|
100%
|
|
15
|
పశ్చిమ రైల్వే
|
100%
|
|
16
|
నార్త్ వెస్టర్న్ రైల్వే
|
99.8%
|
|
17
|
ఈశాన్య సరిహద్దు రైల్వే
|
98.7%
|
|
18
|
దక్షిణ రైల్వే
|
98.7%
|
|
19
|
నైరుతి రైల్వే
|
96.1%
|
బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం వారీ విద్యుదీకరణ స్థితి ఈ కింది విధంగా ఉంది:
|
వరుస సంఖ్య
|
రాష్ట్రం
|
ఎంత శాతం విద్యుదీకరణ పూర్తయిందంటే
|
వరుస సంఖ్య
|
రాష్ట్రం
|
ఎంత శాతం విద్యుదీకరణ పూర్తయిందంటే..
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
100%
|
16
|
మిజోరం
|
100%
|
|
2
|
అరుణాచల్‌ప్రదేశ్
|
100%
|
17
|
నాగాలాండ్
|
100%
|
|
3
|
బీహార్
|
100%
|
18
|
ఒడిశా
|
100%
|
|
4
|
|
100%
|
19
|
పుదుచ్చేరి
|
100%
|
|
5
|
ఛత్తీస్‌గఢ్
|
100%
|
20
|
పంజాబ్
|
100%
|
|
6
|
ఢిల్లీ
|
100%
|
21
|
తెలంగాణ
|
100%
|
|
7
|
గుజరాత్
|
100%
|
22
|
త్రిపుర
|
100%
|
|
8
|
హర్యానా
|
100%
|
23
|
ఉత్తరప్రదేశ్
|
100%
|
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
100%
|
24
|
ఉత్తరాఖండ్
|
100%
|
|
10
|
జమ్ము, కాశ్మీర్
|
100%
|
25
|
పశ్చిమ బెంగాల్
|
100%
|
|
11
|
జార్ఖండ్
|
100%
|
26
|
రాజస్థాన్
|
99.8%
|
|
12
|
కేరళ
|
100%
|
27
|
తమిళనాడు
|
98.3%
|
|
13
|
మధ్యప్రదేశ్
|
100%
|
28
|
అస్సాం
|
97.9%
|
|
14
|
మహారాష్ట్ర
|
100%
|
29
|
కర్ణాటక
|
96.8%
|
|
15
|
మేఘాలయ
|
100%
|
30
|
గోవా
|
91.4%
|
ఈ సమాచారాన్ని రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2287988)
आगंतुक पटल : 5