ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ నెల 22 నుంచి 24 వరకు చండీగఢ్‌లో 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని నిర్వహించనున్న భారత్

మూడు రోజుల పాటు జరిగే బ్రిక్స్ ఆరోగ్య కార్యక్రమంలో సీనియర్ అధికారుల, ఆరోగ్య మంత్రుల సమావేశాలతో పాటు డిజిటల్ హెల్త్, కృత్రిమ మేధపై ప్రత్యేక చర్చలు

16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి

ప్రతికూల నిరోధక సామర్ధ్యం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలే భారత్‌ బ్రిక్స్‌ నాయకత్వానికి మార్గదర్శక సూత్రాలు

భారత్ అధ్యక్షతన తొమ్మిది ప్రాధాన్యతా రంగాల ఆధారంగా బ్రిక్స్ ఆరోగ్య సహకారం

ప్రపంచ ఆరోగ్య భద్రత పట్ల బ్రిక్స్ దేశాల నిబద్ధతను మరింత బలపరిచే విధంగా ఆరోగ్య మంత్రిత్వ స్థాయి డిక్లరేషన్

प्रविष्टि तिथि: 21 JUL 2026 7:18PM by PIB Hyderabad

భారత 2026 బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగాజూలై 22 నుంచి  24 వరకు చండీగఢ్‌లో 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయిఆరోగ్య భద్రతడిజిటల్ హెల్త్మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతమెరుగైన వైద్య సంరక్షణను అందరికీ సమానంగా అందుబాటులోకి తెచ్చే అంశాలపై సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు బ్రిక్స్ సభ్యదేశాల ఆరోగ్య మంత్రులుసీనియర్ ఆరోగ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచా ఈ రోజు చండీగఢ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఏర్పాట్లుఅజెండా ఆశిస్తున్న ఫలితాల గురించి వివరించారు.

ప్రతికూల పరిస్థితుల ప్రతిఘటనా సామర్థ్యంఆవిష్కరణలుసహకారంసుస్థిరత సూత్రాల ఆధారంగా కీలకమైన ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లేందుకు 2026 బ్రిక్స్ అధ్యక్షతన భారత్ నిబద్ధతకు ఈ సమావేశం నిదర్శనమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్నారుఆరోగ్య భద్రతమహమ్మారులను ఎదుర్కొనే సంసిద్ధతడిజిటల్ హెల్త్ఆవిష్కరణలునాణ్యమైన మందులు చౌకగా లభ్యమయ్యేలా చూడటంసాంప్రదాయఅనుబంధసమగ్ర వైద్య విధానాలుక్షయ వ్యాధి నివారణఆరోగ్యకరమైన జీవనశైలిమానసిక ఆరోగ్యం,  పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని ఆమె చెప్పారుఅందరికీ ఆరోగ్య సంరక్షణ  అందించడంతో పాటు బ్రిక్స్ దేశాలవ్యాప్తంగా ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ కొనసాగుతుందని వివరించారుబ్రిక్స్ దేశాల మధ్య సహకారంవిజ్ఞాన మార్పిడిని మరింత పెంచడం ద్వారా అభివృద్ధి చెందుతున్నపేద దేశాల ఆరోగ్య ప్రాధాన్యతలకు ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని కూడా ఆమె పేర్కొన్నారు.

 

 

గతంలో 2012, 2016, 2021 తరువాత భారత్ నాలుగో సారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. . సామర్థ్యంఆవిష్కరణసహకారంసుస్థిరత సూత్రాల ఆధారంగా భారత్‌తన బ్రిక్స్‌ కార్యాచరణలో ఆరోగ్య రంగ సహకారాన్ని కీలక అంశాల్లో ఒకటిగా చేర్చిందిప్రజాకేంద్రితసమ్మిళిత ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి భారత్ కట్టుబాటును ఈ నిర్ణయం ప్రతిబింబిస్తోంది.

ఈ సమావేశం సందర్భంగా పదకొండు బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్రష్యాఇండియాచైనాదక్షిణాఫ్రికాఈజిప్ట్ఇథియోపియాఇరాన్సౌదీ అరేబియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఇండోనేషియా నుంచి ఆరోగ్య శాఖ మంత్రులుసీనియర్ ప్రభుత్వ అధికారులుసాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రానున్నారుఈ దేశాలన్నీ కలిసి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికీప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 40 శాతానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయిఇది అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించడంలో పెరుగుతున్న బ్రిక్స్ పాత్రను స్పష్టంగా సూచిస్తోంది.

అధికారిక కార్యక్రమం జూలై 22న జరిగే సీనియర్ అధికారుల సమావేశంతో ప్రారంభమవుతుందిఈ సమావేశంలో సీనియర్ ఆరోగ్య అధికారులు ‘బ్రిక్స్ ఆరోగ్య సంభాషణ‘  కింద ప్రాధాన్యతా రంగాలపై సుదీర్ఘంగా చర్చించిఆరోగ్య శాఖ మంత్రుల డిక్లరేషన్ ముసాయిదాను ఖరారు చేస్తారు.

జూలై 23న 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం జరగనుందికేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలోసభ్యదేశాల ఆరోగ్య శాఖ మంత్రులు అంతర్జాతీయప్రాంతీయ ప్రజారోగ్య ప్రాధాన్యతలపై సమగ్రంగా చర్చించి, 16వ బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల డిక్లరేషన్ ఆమోదిస్తారు

జూలై 24న "బ్రిక్స్ సంభాషణడిజిటల్ ఆరోగ్య రికార్డుల నుంచి ఏఐ ఆధారిత వైద్య సంరక్షణ వరకు పరస్పరం అనుసంధానించదగిన డేటా మౌలిక వసతులు,  బాధ్యతాయుతమైన ఏఐ ద్వారా నిరంతర ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంఅనే అంశంపై ఉన్నత స్థాయి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తారుబ్రిక్స్ వ్యాప్తంగా నిరంతర వైద్య సంరక్షణను పటిష్టం చేయడానికీభవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే సమర్థవంతమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడానికీ పరస్పరం అనుసంధానించదగిన డిజిటల్ హెల్త్ మౌలిక సదుపాయాలుబాధ్యతాయుతమైన ఏఐలను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

బ్రిక్స్ గత అధ్యక్షతల కాలంలో చేపట్టిన పనులను మరింత ముందుకు తీసుకెళ్తూపాత ప్రాధాన్యతలను కొనసాగించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం బ్రిక్స్ మిషన్,  మానసిక ఆరోగ్య వికాసాన్ని ప్రోత్సహించే రెండు కొత్త ప్రాధాన్యతా రంగాలను ప్రవేశపెట్టడం ద్వారా నివారణ,  ఆరోగ్య అభివృద్ధి వైద్య విధానాలపై తనక పటిష్టమైన కట్టుబాటును భారత్ పునరుద్ఘాటించింది.

బ్రిక్స్ అధ్యక్షత 2026 కింద భారత్  తన ఆరోగ్య విభాగాన్ని ఈ క్రింది తొమ్మిది ప్రాధాన్యత రంగాల ప్రాతిపదికన రూపొందించింది.

  1. బ్రిక్స్ క్షయ పరిశోధనా వ్యవస్థ

  2. బ్రిక్స్ వైద్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థల మధ్య సహకారం

  3. సామూహిక అంటువ్యాధులనివారణ ప్రతిస్పందన కోసం బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ 

  4. ఆరోగ్య సంరక్షణమారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను అందించడంతో సహా డిజిటల్ హెల్త్ వ్యవస్థ 

  5. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం బ్రిక్స్ మిషన్

  6. మానసిక ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహించడం

  7. సాంప్రదాయఅనుబంధసమగ్ర వైద్య పద్ధతులు 

  8. సామాజిక పరిస్థితుల వల్ల వచ్చే వ్యాధులపై పోరాటం 

  9. బ్రిక్స్ జాతీయ ప్రజారోగ్య సంస్థల వ్యవస్థ 

ఈ ప్రాధాన్య అంశాలు బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయిసుస్థిర ఆరోగ్య వ్యవస్థల బలోపేతంఆరోగ్య రంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహంమహమ్మారుల సంసిద్ధతను పెంపొందించడంఅంటువ్యాధులుఇతర వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవడంనాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడంసార్వత్రిక ఆరోగ్య సేవల  లక్ష్య సాధనను వేగవంతం చేయడం వంటి అంశాల పట్ల బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇవి చాటుతున్నాయి.

2026 ఏప్రిల్‌ 15 నుంచి భారత్‌ ఈ ప్రాధాన్య రంగాలకు సంబంధించిన 26 సాంకేతిక సమావేశాలునిపుణుల సంప్రదింపులను నిర్వహించిందిబ్రిక్స్‌ సభ్య దేశాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిఆరోగ్య రంగంలోని కీలక అంశాలపై ఏకాభిప్రాయం ఏర్పడేలా కృషి చేసింది.

16వ బ్రిక్స్‌ ఆరోగ్య మంత్రుల సమావేశం ఆరోగ్య భద్రతమహమ్మారులను ఎదుర్కొనే సంసిద్ధతడిజిటల్‌ ఆరోగ్యంఆరోగ్య రంగంలో ఆవిష్కరణలుఅందుబాటు ధరల్లో ఔషధాల లభ్యతసుస్థిర ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాల్లో బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయనుందిఅభివృద్ధి చెందుతున్న ఆరోగ్య ప్రాధాన్యాలకు ఊతమివ్వడంతో పాటుసార్వత్రిక ఆరోగ్య సేవల లక్ష్య సాధనఆరోగ్యానికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం ఓ కీలక వేదికగా నిలవనుంది.

 

***


(रिलीज़ आईडी: 2287521) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati