పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన అంశాలపై ప్రజాభిప్రాయానికి ఆహ్వానం... సూచనలను కోరిన సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ
प्रविष्टि तिथि:
21 JUL 2026 11:07AM by PIB Hyderabad
సంబంధిత వర్గాలు/ప్రజలందరికీ తెలియజేయునదేమనగా - ఆరావళి పర్వత శ్రేణులు, సంబంధిత అనుబంధ అంశాలను పరిశీలించడం కోసం సుమోటో రిట్ పిటిషన్ (సివిల్) నం. 10/2025లో.. సుప్రీంకోర్టు 2026 మే 25 నాటి ఉత్తర్వుల ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని (హెచ్‌పీసీ) ఏర్పాటు చేసింది. 2026 ఆగస్టు 31లోపు ఈ కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ లేదా తదితర రాష్ట్రాలకు చెందిన విభిన్న వర్గాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, ప్రకృతి పరిరక్షకులు, లాభాపేక్ష లేని సంస్థలు, మైనింగ్ లీజుదారులు, ప్రాజెక్టు ప్రతిపాదకులు, గ్రామస్తులు, రైతులు, గని కార్మికులు, ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యంతో తమ జీవనోపాధి, సంక్షేమం అంతర్గతంగా ముడిపడి ఉన్న స్థానిక సమూహాలు, అలాగే పరిశీలనలో ఉన్న అంశాల ద్వారా ప్రభావితమయ్యే లేదా వాటిపై చట్టబద్ధమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు/సంస్థల నుంచి వినతులు, సలహాలు, సూచనలను హెచ్‌పీసీ ఆహ్వానించింది.
వీలైనంత వరకు డాక్యుమెంటరీ ఆధారాలతో లేదా ధ్రువీకరించదగిన ఇతర సమాచారంతో కూడిన అంశాలతో.. సంబంధిత భాగస్వాములందరూ తమ అభిప్రాయాలు లేదా ప్రతిపాదనలను ఈ నోటీసును ప్రచురించిన తేదీ నుంచి 21 రోజులలోపు సమర్పించాలి. ఇ-మెయిల్ (mshpcaravalli[at]gmail[dot]com) ద్వారా లేదా ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్ ఫారమ్ (లింక్: https://forms.gle/FpWwXBES5Gfr9bn16) ద్వారా వారు అభిప్రాయాలు లేదా ప్రతిపాదనలను సమర్పించాలి.
***
(रिलीज़ आईडी: 2287129)
आगंतुक पटल : 13