ప్రధాన మంత్రి కార్యాలయం
జపాన్ ఓపెన్-2026 టైటిల్ గెలిచిన పి.వి. సింధును అభినందించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 JUL 2026 7:13PM by PIB Hyderabad
జపాన్ ఓపెన్-2026 టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. టోర్నమెంట్ ఆసాంతం సింధు పట్టుదల, అసాధారణ నైపుణ్యాలు ప్రస్ఫుటంగా కనిపించాయన్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది యువ క్రీడాకారులు ఈ క్రీడలో పాల్గొని, మెరుగ్గా రాణించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రాత్మక విజయం!
జపాన్ ఓపెన్-2026లో విజయం సాధించిన పి.వి. సింధుకు అభినందనలు. టోర్నమెంట్ ఆసాంతం ఆమె పట్టుదల, అసాధారణ నైపుణ్యాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు సాధించిన ఈ ఘనత మరింత ప్రత్యేకమైనది. దేశవ్యాప్తంగా అనేక మంది యువ క్రీడాకారులు ఈ క్రీడలో పాల్గొనడానికి, మెరుగ్గా రాణించడానికి ఈ విజయం స్ఫూర్తినిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2286428)
సందర్శకుల సూచీ సంఖ్య : : 62
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada