ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండోనేషియాలో భారతీయ ప్రవాసుల సదస్సులో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 07 JUL 2026 11:47PM by PIB Hyderabad

గౌరవనీయ అధ్యక్షుడు ప్రభోవో,

ప్రియ మిత్రులూ,

సోదరీ సోదరులారా...

సెలమత్ మలాం!

నమస్కారం!

వణక్కం!

సత్ శ్రీ అకాల్!

జై ఝూలే లాల్!

కేమ్-ఛో?

నేడు ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఇండోనేషియాలోనూ ఫుట్‌బాల్‌కు విశేషమైన ఆదరణ ఉంది. అదే ఉత్సాహంతో, అదే శక్తితో మీరంతా ఇక్కడికి వచ్చారు.

మీలో కొందరు గమనించే ఉంటారు - కాకతాళీయమే కావచ్చు గానీ, అది నాకు ప్రత్యేకంగా కనిపిస్తోంది. నేను ఇండోనేషియాకు వచ్చిన ప్రతిసారీ ‘ఫిఫా’ ప్రపంచకప్ జోరుగా సాగుతోంది. మొదటిసారి 2018లో మనం జకార్తాలో కలుసుకున్నాం. ఆ తర్వాత 2022లో బాలీలో కలిశాం. ఇప్పుడు 2026లో మరోసారి జకార్తాలోనే సమావేశమయ్యాం. ఈ మూడు సందర్భాల్లోనూ ఫుట్‌బాల్ ఉత్సాహంతో ఇండోనేషియాలో కోలాహలం నెలకొన్నది.

అయితే మిత్రులారా,

ఈ మూడు సందర్భాలలోనూ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’లు మీరే.. ఇండోనేషియాలో నివసిస్తున్న మీరంతా! మీలో ప్రతి ఒక్కరూ నిజమైన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’లే.

ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరంతా భారతీయ చేతనకు ప్రతినిధులు. ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో మీరంతా ఇక్కడ సమావేశమవడం నిజంగా ఎంతో సంతోషదాయకం. మిత్రులారా.. ఈసారి ఇక్కడికి నేనొక్కడినే రాలేదు. నా ఆప్తమిత్రుడు, అధ్యక్షుడు ప్రబోవో కూడా ఈ రోజు నాతో పాటు వచ్చారు.

నా ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు.. ఆదరాభిమానాలతో ఆత్మీయ ఆహ్వానాన్ని అందించిన అధ్యక్షుడు ప్రబోవోకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గౌరవ అధ్యక్షా,

మీరు భారత్‌కు నిజమైన మిత్రుడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు ధన్యవాదాలు.

మిత్రులారా,

ఇండోనేషియా ఆకాశ మార్గంలోకి మా విమానం ప్రవేశించి, నేనిక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే.. ఈ దేశ ప్రజలు ఆదరాభిమానాలు, ఆప్యాయతతో ముంచెత్తారు. ఇంతటి ప్రేమపూర్వక ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలడం లేదు. విమానాశ్రయంలో స్వయంగా అధ్యక్షుడు ప్రబోవోనే వచ్చి, తన కేబినెట్ సహచరులతో కలిసి నాకు స్వాగతం పలకడం నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన అనుభూతి.

ఈ రోజు అధ్యక్ష భవనంలో నేనొక చిత్రాన్ని చూశాను. ఇండోనేషియాలో భారతీయ సంస్కృతి పట్ల ఉన్న ప్రేమ, అభిమానం ఆ దృశ్యంలో ప్రతిబింబించాయి. ఇక్కడి ప్రజల ఉత్సాహం, పిల్లల చిరునవ్వులు, యువతలోని శక్తి... ఇవన్నీ నిజంగా మాటలకందని అద్భుతం. నేను ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా.. ప్రతి ఒక్కరి ముఖంలో భారత్ పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, ఆత్మీయత నాకు స్పష్టంగా కనిపించాయి.

 

ప్రస్తుతం ప్రపంచ వృద్ధిని ముందుకు నడపడంలో భారత ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచం కోవిడ్ విపత్తు గుప్పిట్లో చిక్కుకున్న తరుణంలోనూ భారత ఆర్థిక ప్రగతి ఆగిపోలేదు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ సమయాల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ మందగించలేదు. నిజానికి, మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మన వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైంది.

 

నేడు జకార్తా నుంచి ముంబయికీ, అలాగే బాలి నుంచి ఢిల్లీ, బెంగళూరు నగరాలకూ నేరుగా చాలా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దీంతో భారత్‌కు రాకపోకలు సాగించడం చాలా సులభమైంది.

మిత్రులారా,

ఇక్కడున్న భారతీయ సమాజానికి చెందిన యువతరానికి, ముఖ్యంగా యువతకు భారత్ గురించి మనం మరింతగా తెలియజేయాలి. ఇండోనేషియాలోని భారతీయ సంతతి పిల్లల కోసం ‘భారత్ కో జానో క్విజ్’ను ప్రారంభించాం. ఇక్కడి పిల్లలు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ పోటీల సన్నాహక వేడుకలో కూడా మీ ఉత్సాహాన్ని నేను స్వయంగా చూశాను.

ఈ క్విజ్ ఆరో ఎడిషన్‌లో.. పాత కాలపు పరీక్ష విధానం నుంచి పూర్తిగా పక్కకు జరిగి, మొత్తం పోటీని ఆటల రూపంలో సాగే ఒక వినూత్న అనుభవంగా తీర్చిదిద్దాం. ఇక్కడున్న యువత అంతా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, మీ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా నాతో పంచుకోవాలని కోరుతున్నాను.

మిత్రులారా,

చరిత్ర మాత్రమే కాదు.. ఉమ్మడి భవిత కూడా భారత్, ఇండోనేషియాలను అనుసంధానిస్తుంది. మనకు ఉమ్మడి అవకాశాలున్నాయి. మనం సవాళ్లనూ సమష్టిగా ఎదుర్కోవాల్సి ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమయంలో మనం కలిసి యోగా చేస్తాం. సునామీ వంటి సంక్షోభమే వచ్చినా, మనం కలిసి నిలబడి ఎదుర్కొంటాం.

మన రెండు దేశాల నడుమ విశ్వాసమే మనకు గొప్ప బలం. మనం సమష్టిగా దానిని మరింత బలోపేతం చేసుకోవాలి.

భారత్, ఇండోనేషియాల సుసంపన్న భవితలో మీరంతా కీలక వారధులు. మీరు మరింత బలంగా, విస్తృతంగా ఈ పాత్రను పోషించాలి.

నా ప్రియ మిత్రుడు, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవోకు, ఈ దేశ ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు. మీ అందరికీ నా శుభాకాంక్షలు.

భారత్, ఇండోనేషియా ఎప్పటికీ శాశ్వత మిత్ర దేశాలు.

ధన్యవాదాలు.

అధ్యక్షులవారితో కలిసి పవిత్ర ఆలయాన్ని రేపు నేను సందర్శించబోతున్నాను. రేపు ఎన్నో తేదీమన అనుబంధం ఎంత బలమైనదో అదే తేటతెల్లం చేస్తోంది. అధ్యక్షుడు ప్రభోవోతో భారత్ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి నేను మాట్లాడాను. వాటిలో దేనిపైనా కాపీరైట్ హక్కులు లేవని నేను హామీ ఇస్తున్నా. కాపీరైట్ లేదుఎలాంటి రాయల్టీకి హక్కు కూడా లేదు. ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్ మాకు మార్గదర్శక మంత్రం.

ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి స్వేచ్ఛానువాదమిది. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.  

 

***

 

(रिलीज़ आईडी: 2285968) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam