ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

రూ.10,998.32 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో ఉత్తరప్రదేశ్‌లోని వరుణ నది ఒడ్డున ఎక్కి- దిగే మార్గాలు, వృత్తాకార మార్గాలతో కూడిన 6, 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

प्रविष्टि तिथि: 15 JUL 2026 3:04PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వరుణ నది వెంబడి ఉన్న ఎన్‌హెచ్-31, వారణాసి రింగ్ రోడ్డును కలుపుతూ 43.218 కిలోమీటర్ల పొడవైన అనుసంధాన కారిడార్ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏఆమోదం తెలిపిందిఈ ప్రాజెక్టు ద్వారా ప్రధాన రహదారివంతెనలువృత్తాకార మార్గాలుఎక్కి-దిగే మార్గాలుసర్వీసు రోడ్లతో 6,4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతారుఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎంపద్ధతిలో భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్ఏఐనిర్మించనుందిప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.10,998.32 కోట్లు కాగా.. సివిల్ నిర్మాణ పనులకు రూ.4,565.33 కోట్లుభూసేకరణకు రూ.934.91 కోట్లు కేటాయించారు.

వారణాసిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో ఈ కారిడార్ కీలక భాగంఇది ఎన్‌హెచ్-31, కాశీ రైల్వేస్టేషన్ మధ్య అంతరాయం లేని అనుసంధానాన్ని కల్పిస్తుందిఇది వారణాసి రింగ్ రోడ్వారణాసి విమానాశ్రయంకాశీ రైల్వేస్టేషన్వారణాసి సిటీ రైల్వేస్టేషన్వారణాసి జంక్షన్దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్రాంనగర్ పోర్టుసంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంవారణాసి ఘాట్లుపరిసర ప్రాంతమైన చందౌలీకి రవాణా సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

గంటకు 80-100 కి.మీ వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్‌హెచ్-31 నుంచి కాశీ రైల్వేస్టేషన్ మధ్య ప్రయాణ సమయం సుమారు 40 నిమిషాల నుంచి 20 నిమిషాలకు తగ్గుతుందిఅంటే దాదాపు 50 శాతం సమయం తగ్గుతుందిఇది నగరంలోని రహదారులపై రద్దీని తగ్గించటమే కాకరహదారి భద్రతను మెరుగుపరుస్తుందివాహన నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందిప్రయాణికులుసరకురవాణా వాహనాలు వేగంగాఅంతరాయం లేకుండా రాకపోకలు సాగించేందుకు సహకరిస్తుంది.

ఆర్థిక కేంద్రం (చందౌలీ సామాజిక ఆర్థిక మండలి), సామాజిక కేంద్రం (చందౌలీ), ఆరు ప్రధాన లాజిస్టిక్స్ కేంద్రాలకు ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడటంతో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతుందితద్వారా పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్రణాళికకు అనుగుణంగా బహుళ విధాన రవాణా అనుసంధానం పెరుగుతుందిఇది వ్యవసాయ ఉత్పత్తులుపారిశ్రామిక వస్తువులునిర్మాణ సామాగ్రిఖనిజాల సమర్థవంతమైన రవాణాకు దోహదపడుతుందిరవాణా సామర్థ్యం మెరుగవుతుందితూర్పు ఉత్తరప్రదేశ్‌లో సుస్థిర ఆర్థికాభివృద్ధికి ఇది సహకరిస్తుంది.

మొత్తంగా ఈ ప్రాజెక్టు వారణాసికి వచ్చే సందర్శకులఅక్కడి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందిఈ ప్రాజెక్టు ద్వారా అనుసంధానాన్ని పెంపొందిస్తూవివిధ రవాణా వ్యవస్థలను కలుపుతూ.. పర్యాటకంఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఆధునికనియంత్రణ పద్ధతిలో ప్రవేశాన్ని కల్పించే పట్టణ రవాణా కారిడార్‌ను నిర్మిస్తారు.

కారిడార్ మ్యాప్:

image.png

***


(रिलीज़ आईडी: 2284909) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada