యు పి ఎస్ సి
కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్ష-2025
प्रविष्टि तिथि:
15 JUL 2026 8:56AM by PIB Hyderabad
కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్ష-2025 ఫలితాలను 2025 అక్టోబరు 29 తేదీతో కూడిన పత్రికా ప్రకటనలో ప్రకటించారు. నియామకం కోసం యోగ్యత క్రమాన్ని అనుసరిస్తూ 80 మంది అభ్యర్థులను సిఫార్సు చేశారు.
కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్ష-2025 నియమం 16 ((iv) & (v)లకు అనుగుణంగా కమిషన్ తన సిఫార్సుల్లో చివరి అభ్యర్థి ప్రస్తావనకు దిగువన, యోగ్యతా క్రమంలో ఓ సంఘటిత రిజర్వు జాబితాను కూడా పొందుపరిచింది.
గనుల మంత్రిత్వ శాఖ అభ్యర్థించిన ప్రకారం.. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ పరీక్ష-2025ను దృష్టిలో పెట్టుకొని రిజర్వు జాబితాలో నుంచి 16 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేస్తోంది.
వారిలో సైంటిస్టు ‘బి’ (హైడ్రోజియాలజీ) , గ్రూప్ ‘ఎ’/అసిస్టెంట్ హైడ్రోజియోలజిస్టు, గ్రూప్ ‘బి’ ఉద్యోగాలకు 13 మంది అభ్యర్థులు (జనరల్ కేటగిరీలో నలుగురు, ఓబీసీ కేటగిరీలో ఏడుగురు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒకరు, ఎస్సీ ఒకరు) ఉండగా,
జియోఫిజిసిస్టు, గ్రూప్ ‘ఎ’/ సైంటిస్టు ‘బి’ (జియోఫిజిక్స్), గ్రూప్ ‘ఎ’/ అసిస్టెంట్ జియోఫిజిసిస్టు, గ్రూప్ ‘బి’ ఉద్యోగాలకు ముగ్గురు అభ్యర్థులు (జనరల్ కేటగిరీలో ఇద్దరు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒకరు) ఉన్నారు.
అభ్యర్థుల జాబితాను ప్రకటనకు జతపరిచారు.
సిఫారసు చేసిన ఈ అభ్యర్థులను గనుల శాఖ నేరుగా సంప్రదిస్తుంది.
ఈ కింద ప్రస్తావించిన ముగ్గురు అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలిక ప్రాతిపదికన/షరతులకు లోబడి ఉంటుంది:-
షరతులతో కూడుకొన్నది:-0390013
తాత్కాలిక ప్రాతిపదికన:-1090492 తో పాటు 0290224
ఫలితాలు ఇక్కడ:
Click here to see result:
***
(रिलीज़ आईडी: 2284744)
आगंतुक पटल : 5