ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ ఈవెంట్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 JUL 2026 7:31AM by PIB Hyderabad

మెల్‌బోర్న్‌లో జూలై 9, 2026న జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓల ఫోరమ్ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ సమావేశాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవ ఆంథోనీ అల్బనీస్ ప్రసంగించారుఈ రెండు కార్యక్రమాల్లో భారత్ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలుప్రముఖ పారిశ్రామికవేత్తలుఆస్ట్రేలియన్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ ప్రతినిధులుఅక్కడి ప్రముఖ విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్లు పాల్గొన్నారు.

సీఈఓల ఫోరమ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశంలోని బలమైన ఆర్థిక వృద్ధివిధానపరమైన సంస్కరణలుడిజిటల్ మార్పులువిస్తరిస్తున్న ఆవిష్కరణలుఆస్ట్రేలియా భాగస్వాములకు నూతన వాణిజ్య అవకాశాలను కల్పిస్తాయని అన్నారుభారత్ఆస్ట్రేలియా వ్యవస్థల మధ్య పరస్పర అనుకూలతలను ఆయన ప్రస్తావించారుభారత్ లో తయారీ రంగంస్వచ్ఛ ఇంధనంఅరుదైన ఖనిజాలుగనుల తవ్వకంమౌలిక సదుపాయాలుపట్టణాభివృద్ధివిమానయానంరవాణాఅధునాతన సాంకేతికతలుకృత్రిమ మేధఫిన్‌టెక్ఆహార శుద్ధిడిజిటల్ ఆర్థిక రంగాల్లోని విస్తృతమైన అవకాశాల గురించి ప్రధానమంత్రి వివరించారుభారతదేశ విస్తృతమైన మార్కెట్‌కు ఆస్ట్రేలియా నైపుణ్యం తోడైతే ఇరుదేశాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకున్న అవకాశాలను వినియోగించుకోవాలని ఆస్ట్రేలియా పెట్టుబడిదారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారుభారతదేశంలో ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెరుగుతుండటాన్ని స్వాగతించారుఉన్నత విద్యపరిశోధనలుఆవిష్కరణలునైపుణ్యాభివృద్ధిలో ఇరుదేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కావటం వల్ల ఇరుదేశాల యువత భవిష్యత్తు మెరుగవడమే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహాయపడుతుందని స్పష్టం చేశారు.

సీఈఓల ఫోరమ్ తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎకనామిక్ రోడ్‌మ్యాప్ కార్యక్రమంలో ప్రసంగించారుఈ కార్యక్రమంలో ఇరుదేశాలకు చెందిన 200 మందికి పైగా సీఈఓలుప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారుభారత్ఆస్ట్రేలియా మధ్య ఉన్న సహజ అనుబంధం గురించి మాట్లాడుతూ ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలుఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల ఏకాభిప్రాయంఇరుదేశాల ప్రజల మధ్య ఆత్మీయ సంబంధాలుబలమైన రాజకీయ అవగాహన వంటివి రెండు దేశాల వాణిజ్య భాగస్వామ్యం కలిసికట్టుగా ఎదగటానికిఅభివృద్ధి చెందటానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని చెప్పారు. 2022 నాటి ఆర్థిక సహకారంవాణిజ్య ఒప్పందం (ఈసీటీఏఆధారంగా వాణిజ్యపెట్టుబడి సంబంధాలు వృద్ధి చెందటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారుఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారుఇరుదేశాలు పరస్పర బలాలను వినియోగించుకుంటూ అరుదైన ఖనిజాలులిథియంబ్యాటరీలుఎలక్ట్రానిక్స్ఈవీలుసెమీ కండక్టర్లుఏఐరక్షణ రంగ సరఫరా వ్యవస్థలో అంతర్జాతీయ పరిష్కారాలను రూపొందించాలని వాణిజ్య రంగ ప్రముఖులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారుద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు తదుపరి స్థాయికి చేరుకోవాలంటే భారతదేశంలోని రాష్ట్రాలుఆస్ట్రేలియా ప్రావిన్సుల ప్రధాన సామర్థ్యాల ఆధారంగా క్రియాశీల ఆర్థిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవటం ముఖ్యమని సూచించారురెండు కార్యక్రమాల్లో జరిగిన చర్చల ద్వారా వచ్చిన సానుకూలఅర్థవంతమైన ఆలోచనలను ప్రస్తావిస్తూ.. భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సంబంధాలు మరింత వృద్ధి చెందుతాయనే విశ్వాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

***

 

(रिलीज़ आईडी: 2282720) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam