ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

प्रविष्टि तिथि: 07 JUL 2026 12:37PM by PIB Hyderabad

గౌరవనీయులుఅధ్యక్షుడు ప్రబోవో,

ఇరుదేశాల విశిష్ట ప్రతినిధులు,

మీడియా మిత్రులకు,

నమస్కారం!

శుభ మధ్యాహ్నం!

నాకు ఎంతో ఆత్మీయమైన, గౌరవప్రదమైన స్వాగతం పలికిన నా మిత్రుడుఅధ్యక్షుడు ప్రబోవోకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

గతేడాది భారత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధ్యక్షుడు ప్రబోవోను ముఖ్య అతిథిగా స్వాగతించే గౌరవం దక్కింది. ఇవాళ ఆయన అందించిన ఆత్మీయసాదర స్వాగతం మేరకు నేను ఇండోనేషియాలో పర్యటించటం నాకు ఎంతో సంతోషంగా ఉంది.

ఇవాళ ఉదయం ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆత్మీయతతో, గౌరవంతో అందుకోవటం నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తున్నానుఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు చెందుతుందిఇండోనేషియా ప్రజల సద్భావాన్ని ప్రతిబింబిస్తూ.. భారత్ఇండోనేషియా మధ్య చరిత్రాత్మకశాశ్వతమైన స్నేహ బంధాలకు గుర్తుగా ఇది నిలుస్తుందిఈ విశిష్టమైన గౌరవానికి గానూ అధ్యక్షుడు ప్రబోవోకిఇండోనేషియా ప్రభుత్వానికిప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

ఇటీవల సంవత్సరాల్లో భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలు నూతనోత్తేజాన్నిమరింత ఆత్మవిశ్వాసాన్నివ్యూహాత్మక విస్తృతిని సంతరించుకున్నాయి.

 మన మధ్య 2018లో  ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోందిఅభివృద్ధిభద్రతసాంకేతికతసంస్కృతివిద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

భారత్-ఇండోనేషియా భాగస్వామ్యంలో నేడు సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నానుఈ నూతన అధ్యాయం 21వ శతాబ్దపు ప్రపంచంమానవాళిపై అపారమైనసానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

మిత్రులారా,

రెండు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర నమ్మకం.. రక్షణభద్రతసముద్రయాన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోందిరక్షణ రంగంలో పరస్పర వినిమయంవిపత్తు నిర్వహణపారిశ్రామిక సహకారంలో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇవాళ మేం నిర్ణయించాం.

హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రత, రక్షణను మెరుగుపరిచేందుకు ఇరుదేశాల తీర రక్షక దళాలు ఇకపై కలిసి పనిచేస్తాయిరెండు సన్నిహిత సముద్ర తీర దేశాలుగాబ్లూ ఎకానమీఓడరేవుల అభివృద్ధిసముద్ర వాణిజ్యంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం.

మిత్రులారా,

పేదరిక నిర్మూలన, ప్రతి పౌరునికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా అందించటం భారత్ఇండోనేషియాకు అత్యంత ప్రాధాన్యతా అంశాలుగా ఉన్నాయిమధ్యాహ్న భోజన పథకంప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మాకున్న అనుభవాలనుపరిష్కారాలను మేం ఇప్పటికే ఇండోనేషియాతో పంచుకున్నాంఈ సహకారాన్ని మేం తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నాం.

ఆరోగ్య రంగంలో మా పరస్పర సహకారం ఇరుదేశాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటంలో గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ కుదిరిన ఒప్పందం వల్ల భారతదేశంలో నాణ్యతతోసరసమైన ధరల్లో లభించే మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.

ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య నిపుణుల నైపుణ్యాభివృద్ధికి కూడా మా వంతు సహకారాన్ని అందిస్తాంభారతదేశంలో అభివృద్ధి చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందివీటితో పాటు స్థిరమైన వ్యవసాయంవ్యవసాయ-సాంకేతికత రంగాల్లో అత్యుత్తమ విధానాలను మేం పరస్పరం పంచుకుంటాం.

మిత్రులారా,

ఇరవై ఒకటో శతాబ్దం... సాంకేతికత ఆధారంగా నడుస్తోందిభారత్ఇండోనేషియా../ యువత శక్తితో నడుస్తున్న దేశాలుమన యువతకు సాంకేతికత పట్ల సహజమైన ఆసక్తి ఉంది.

కృత్రిమ మేధటెలికమ్యూనికేషన్స్డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో మన యువత మధ్య సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇవాళ ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాంరెండు దేశాల అంకుర సంస్థల వ్యవస్థ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మేం నిర్ణయించాం.

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంబెంగళూరుకు సంబంధించిన విదేశీ క్యాంపస్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయనున్నాంఇది ఆసియాన్ ప్రాంతంలోని యువతకు ఎంతో మేలు చేస్తుంది.

అంతరిక్ష రంగంలో మన సహకారం దశాబ్దాల నమ్మకం, భాగస్వామ్యంపై ఏర్పాటైందిదీని ఆధారంగా అంతరిక్ష రంగంలో ఉమ్మడి పరిశోధనసాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవటంసామర్థ్య పెంపుదలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం.

మిత్రులారా,

నేటి ప్రపంచంలో సాంకేతికతలో "సరఫరా వ్యవస్థ స్థిరత్వంకీలకంగా మారిందికీలక ఖనిజాలుఉక్కు రంగాల్లో సరఫరా వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాంఇరుదేశాల కంపెనీలు స్టెయిన్‌లెస్ స్టీల్రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రంగాల్లోని భాగస్వామ్యాల్లో నూతన దశను ప్రారంభిస్తున్నాయి.

మిత్రులారా,

ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలే మనకు అతిపెద్ద బలం. భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐత్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానం కానుండటం సంతోషకరంఇది రెండు దేశాల మధ్య వాణిజ్య నిర్వహణనుప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.

మిత్రులారా,

రేపు ప్రంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి పాల్గొనే గొప్ప అవకాశం నాకు లభించింది. వెయ్యేళ్లకు పైగా పురాతనమైన ప్రంబనన్ ఆలయం.. భారత్ఇండోనేషియాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియా చరిత్రాత్మక పర్యటన శతాబ్ది ఉత్సవాలను ఇరుదేశాలు ఎంతో ఉత్సాహంతో జరుపుకోనున్నాయి. ఇండోనేషియా దేశ నిర్మాణంలో ఆ దేశ మొదటి విద్యాశాఖ మంత్రిదూరదృష్టి గల విద్యావేత్త కి హజార్ దేవంతరా కీలక పాత్ర పోషించారుఆయన విద్యా విధానంపై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనల ప్రభావం ఎంతో ఉందిఈ ఉమ్మడి మేధసాంస్కృతిక వారసత్వానికి గుర్తింపుగా ఈ శతాబ్ది ఉత్సవాలను "ఠాగూర్-దేవంతరా సాంస్కృతికవిద్యా దౌత్య సంవత్సరం"గా భారత్ఇండోనేషియా జరుపుకుంటాయి.

మిత్రులారా,

ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ఇండోనేషియాకు ఉమ్మడి బలాలుఈ రోజు ఇరుదేశాల ఎన్నికల సంఘాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రజాస్వామ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

అంతర్జాతీయ సమస్యలపై కూడా భారత్, ఇండోనేషియా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే ఉన్నాయిఇండో-పసిఫిక్ ప్రాంతంపై పరస్పర దృక్పథాల్లో బలమైన సమన్వయం ఉందిఆసియాన్ కూటమికి భారతదేశం ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఇస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో చర్చలు, దౌత్యాల పాత్ర మునుపెన్నడూ లేనంతగా కీలకమైనవని భారతదేశం విశ్వసిస్తోందిపాలస్తీనా సమస్యపై రెండు దేశాల పరిష్కారానికిశాశ్వత శాంతి సాధనకు మేం మద్దతును కొనసాగిస్తున్నాం.

మిత్రులారా,

ఇరుదేశాలకు సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది.

మన చరిత్ర ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉంది.

పరస్పర నమ్మకంతో వర్తమానం పెనవేసుకుంది.

ఉమ్మడి అభివృద్ధిలోనే మన భవిష్యత్ ఉంది.

ఇండోనేషియా "ఎమాస్”భారతదేశ "వికసిత్ భారత్కలలను మనం ఉమ్మడిగా సాకారం చేసుకుంటామనే విశ్వాసం నాకుంది.

ధన్యవాదాలు.

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.


(रिलीज़ आईडी: 2282216) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Gujarati , Odia , Kannada , Malayalam