మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూలై 8 నుంచి 9, 2026 వరకు కొచ్చిలో బ్రిక్స్ దేశాల మహిళా మంత్రివర్గ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్


భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు నిర్వహణ నేపథ్యంలో మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లనున్న బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు

प्रविष्टि तिथि: 07 JUL 2026 10:17AM by PIB Hyderabad

భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు-2026 నిర్వహణ నేపథ్యంలో జూలై నుంచి 9, 2026 వరకు కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ దేశాల మహిళా మంత్రివర్గ సమావేశం జరుగుతుందిపరస్పర సహకారాన్ని బలోపేతం చేయటంమహిళా సాధికారతను పెంపొందించటం.. సమ్మిళితమైనపటిష్ఠమైనస్థిరమైన అభివృద్ధి పట్ల ఉమ్మడి నిబద్ధతను స్పష్టం చేసేందుకు బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులుప్రతినిధుల బృందాలు ఒకచోట సమావేశం అవుతారు.

భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు నాలుగు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉందిదృఢత్వంఆవిష్కరణసహకారంసుస్థిరతప్రతి రంగంలోనూ మహిళల సాధికారతను పెంపొందించే విధంగా బ్రిక్స్ మహిళా విభాగాన్ని రూపొందించారు.

జూలై నుంచి 7, 2026వ తేదీ వరకు బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారుసీనియర్ అధికారులు ఈ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ పరిధిలోని ప్రాధాన్యతా రంగాలపై విస్తృత చర్చలు జరిపారుఉమెన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన బలమైన పునాదుల ఆధారంగా బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి ప్రతిపాదిత ఫలితాలపై మంత్రులు చర్చించివ్యూహాత్మక దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ.. మానవత్వమే పరమావధిగా సాగే విధానాన్ని ప్రతిబింబించేలా భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సు "పటిష్టతఆవిష్కరణలుసహకారంసుస్థిరత కోసం నిర్మాణంఇతివృత్తంతో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుందిమహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించటంఆర్థిక అవకాశాలను విస్తరించటండిజిటల్ ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయటంవ్యవస్థాపకతను పెంపొందించటంవాతావరణ చర్యలుఆహార భద్రతపోషకాహార రంగాల్లో మహిళల సహకారాన్ని గుర్తించటం వంటి అంశాలపై ఉన్నత స్థాయి చర్చలకు ఈ సమావేశం వేదికగా నిలుస్తుందిలింగ సమానత్వం దిశగా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించేందుకు పురోగతిని వేగవంతం చేయటానికి బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షను ఈ చర్చలు ప్రతిబింబిస్తాయి.

గ్రామీణాభివృద్ధిస్టెమ్పోషకాహారంవిద్యమరిన్ని విభిన్న రంగాల్లో మహిళల నేతృత్వంలోని అభివృద్ధిలో భారత్ సాధించిన విజయాలను తెలియజేసే ప్రదర్శనలు ఈ మంత్రిత్వ స్థాయి సమావేశానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయిఈ కార్యక్రమంలో భాగంగా ఒక ప్లీనరీ సెషన్ప్రముఖ నిపుణులువిధాన నిర్ణేతలునిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలుంటాయిఇవి అనుభవాలను పంచుకునేందుకువినూత్న విధానాలను మార్పిడి చేసుకునేందుకుమహిళా సాధికారతకు భాగస్వామ్యాలను పెంపొందించుకునేందుకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2281916) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam