ప్రధాన మంత్రి కార్యాలయం
అణకువ, నిస్వార్థ సేవ వంటి సద్గుణాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 JUL 2026 10:01AM by PIB Hyderabad
అణకువ, నిస్వార్థ సేవలోనే నిజమైన సంక్షేమం ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమం, సమాజ బాగును కాంక్షించినప్పుడే ఆ విజయానికి అర్థం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం-
భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైర్నవాంబుభి ర్దూర్ మిలమ్బినో ఘనాః
అనుద్ధతాః సత్పురుషః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణామ్.
సమృద్ధిగా పండ్లతో ఉన్న చెట్లు, నీటితో బరువెక్కిన మేఘాలు భూమి వైపునకు వాలినట్లుగా... సంపద, కీర్తిని పొందిన సజ్జనులు, ఉత్తమ స్వభావం గలవారు అంతే అణకువతో ఉంటారు. అహంకారానికి లోనవకుండా వారి జీవితాలను సమాజ సంక్షేమానికి అంకితం చేస్తారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"వినయం, పరోపకారం వంటి గుణాల వల్లే అభివృద్ధికి నిజమైన అందం వస్తుంది. సమాజ సంక్షేమానికి ఉపయోగపడినప్పుడే విజయానికి అర్థం ఉంటుంది.
భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైర్నవాంబుభి ర్దూర్ మిలమ్బినో ఘనాః
అనుద్ధతాః సత్పురుషః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణామ్"
(रिलीज़ आईडी: 2281915)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam