ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరమ పవిత్రులు దలై లామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 06 JUL 2026 12:53PM by PIB Hyderabad

పరమ పవిత్రులు దలై లామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్రులు అందించిన శాంతి, సద్భావనల సందేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పరమ పవిత్రులు దలై లామాకు ఇవే స్నేహ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అందించిన శాంతి, సద్భావనల సందేశం ప్రపంచమంతటా ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆయన నైతిక, ఆధ్యాత్మిక శక్తి, ప్రపంచ హితం పట్ల ఆయన చాటే నిబద్ధత ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం ప్రాప్తించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2281580) సందర్శకుల సూచీ సంఖ్య : : 52