ఉప రాష్ట్రపతి సచివాలయం
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారం సమర్పించిన ఉపరాష్ట్రపతి
అర్హులైన ఓటర్లందరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి
శక్తిమంతమైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం కచ్చితమైన, నవీకరించిన ఓటర్ల జాబితా అత్యవసరం: ఉపరాష్ట్రపతి
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణకు ప్రజలు సహకరించాలని పిలుపు
నాడు పోస్టు చేయడమైనది:
04 JUL 2026 12:50PM by PIB Hyderabad
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తన వివరాలతో పూరించిన ఎన్యుమరేషన్ ఫారంను ఎన్నికల సిబ్బందికి సమర్పించారు.
ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణలో భాగంగా... ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ అశోక్ కుమార్, ఎన్నికల అధికారులతో కలిసి ఉపరాష్ట్రపతి భవన్‌లో ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా, శక్తిమంతమైన భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కచ్చితమైన, నవీకరించిన ఓటర్ల జాబితాను నిర్వహించడం అత్యవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రత్యేక విస్తృత సవరణ విజయవంతం కావడానికి ఎన్నికల అధికారులకు పౌరులు పూర్తి సహకారం అందించాలని శ్రీ సీ. పీ. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు.
(రిలీజ్ ఐడి: 2281248)
సందర్శకుల సూచీ సంఖ్య : : 31