|
క్ర. సం.
|
నిర్ణయం
|
వివరణ
|
|
1
|
ఆర్థిక భద్రత విషయంలో భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
|
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని 'ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0' స్పష్టంగా తెలియజేస్తుంది.
|
|
2
|
కృత్రిమ మేధస్సు రంగంలో సహకారంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
|
ఇది ఏఐ రంగంలో భారత్-జపాన్ సంబంధాలను వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తుంది. 'భారత్-జపాన్ ఏఐ ఇనిషియేటివ్' ఆధారంగా రూపొందించిన ఈ ఉమ్మడి ప్రకటన.. సురక్షితమైన, నమ్మకమైన, అందరికీ అందుబాటులో ఉండే మానవ కేంద్రిత ఏఐ అనే ఉమ్మడి లక్ష్య సాధన కోసం సంపూర్ణ ఏఐ సాంకేతిక స్టాక్‌లో (ఏఐ టెక్నాలజీ స్టాక్) మరింత విస్తృతమైన సహకారానికి ఒక రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.
|
|
3
|
ఇంధన దృఢత్వంపై సంయుక్త ప్రకటన (సహజవాయువు-పెట్రోలియం శాఖ, జపాన్‌కు చెందిన ఎంఈఐటీ మధ్య)
|
ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల వ్యూహాత్మక నిల్వలు, రిజర్వ్ వ్యవస్థలలో సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. సముద్ర ఇంధన రవాణా విలువ గొలుసు విషయంలో ఉమ్మడి పెట్టుబడుల దిశగా సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
|
|
4
|
భారత్-జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించటం
|
దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2027 సంవత్సరాన్ని 'భారత్-జపాన్ ఇయర్ ఆఫ్ షేర్డ్ హోరైజన్స్'గా నిర్వహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల ప్రణాళికను ఇది తెలియజేస్తుంది.
|
|
5
|
భారత్-జపాన్ సహకార బయోగ్యాస్ వృద్ధి (సీబీజీ) కార్యక్రమం కోసం సహకార అవగాహన ఒప్పందం
|
పాల సహకార సంఘాల విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ భారతదేశమంతటా 1,000 బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల కేంద్రాలను నిర్మించే లక్ష్యం దిశగా సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
|
|
6
|
బ్యాటరీల రంగంలో సహకార ఒప్పందం
|
నమ్మకమైన, దృఢత్వం కలిగిన సుస్థిర బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించే లక్ష్యంతో బ్యాటరీ ఆధారిత ప్రాజెక్టుల్లో సహకారాన్ని పెంపొందించడానికి, వ్యాపార అవకాశాలను విస్తరించడానికి ఇది తోడ్పడుతుంది.
|
|
7
|
ఔషధాలు, వైద్య పరికరాల రంగంలో సహకార ఒప్పందం
|
ద్వైపాక్షిక పెట్టుబడులు, వ్యాపార అనుసంధానాలు, సాంకేతిక సహకారం, పరిశ్రమ-విద్యాసంస్థల ఉమ్మడి భాగస్వామ్యాల ప్రోత్సాహం ద్వారా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్‌తో (కేఎస్ఎం) కూడిన ఫార్మా సరఫరా గొలుసులను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
|
|
8
|
భూగర్భ శాస్త్రం, ఖనిజ అన్వేషణ రంగంలో సహకార ఒప్పందం
|
సాంకేతిక నైపుణ్యాల మార్పిడి ద్వారా అప్‌స్ట్రీమ్ కీలక ఖనిజాల అన్వేషణలో సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.
|
|
9
|
ఇండియా ఏఐ మిషన్, జపాన్ ఆర్థిక- వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీ) మధ్య సహకార అవగాహన ఒప్పందం
|
భారత దేశపు'ఇండియా ఏఐ మిషన్', జపాన్ దేశపు 'జీనియాక్' కార్యక్రమాల మధ్య సంస్థాగత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. వ్యాపార అనుసంధానం, ఏఐ విధానాలు, సవాళ్లపై వెబ్‌నార్లు, కంప్యూటింగ్ వనరుల సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఉమ్మడి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం వంటి మార్గాలతో ఈ సహకారం కొనసాగనుంది.
|
|
10
|
నవతరం మొబిలిటీ భాగస్వామ్యంపై (ఎన్‌జీఎంపీ) సహకార ఒప్పందం
|
2025 ఆగస్ట్‌లో జరిగిన 15వ వార్షిక సదస్సులో ప్రకటించిన 'నవతరం మొబిలిటీ భాగస్వామ్యాన్ని' (ఎన్‌జీఎంపీ) అమలులోకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్‌జీఎంపీ... రైల్వేలు, వాహనాలు, రోడ్డు మౌలిక సదుపాయాలు, విమానయానం, నౌకా నిర్మాణం, ఓడరేవులు, లాజిస్టిక్స్, పట్టణాభివృద్ధి వంటి రవాణా-మొబిలిటీ రంగాల్లో ప్రైవేట్ రంగ నేతృత్వంలోని సహకారాన్ని, పెట్టుబడులను వేగవంతం చేస్తుంది. దీనిద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి వీలుగా భారత్‌ను 'మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్' కేంద్రంగా తీర్చిదిద్దుతుంది.
|
|
11
|
భారత్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్‌ఫామ్స్ (సీ-క్యాంప్), జపాన్‌లోని రికెన్ మధ్య అవగాహన ఒప్పందం
|
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణ రంగాల్లో డీప్-టెక్, జీవ శాస్త్రాల విద్యాసంబంధిత, ట్రాన్స్‌లేషనల్ పరిశోధనలు, అంకుర ఆధారిత ఆవిష్కరణలను పెంపొందించడానికి ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
|
|
12
|
నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, జపాన్‌లోని రికెన్ మధ్య అవగాహన ఒప్పందం
|
రెండు ప్రముఖ పరిశోధనా సంస్థల మధ్య ప్రాథమిక జీవశాస్త్రం, న్యూరోసైన్స్ పరిశోధనలలో సహకారం కోసం ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
|
|
13
|
ఐఐటీ బాంబే, భారత్‌జెన్ టెక్నాలజీ ఫౌండేషన్, జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ మధ్య అవగాహన ఒప్పందం
|
ఉమ్మడి పరిశోధనల మార్పిడి ద్వారా శాస్త్రీయ విశ్లేషణను మెరుగుపరిచే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రంగంలో సహకారాన్ని ఇది మరింత ముందుకు తీసుకెళ్తుంది.
|
|
14
|
ఎల్ఎల్ఎం అభివృద్ధిపై సర్వమ్ఏఐ, ప్రిఫర్డ్ నెట్‌వర్క్ మధ్య అవగాహన ఒప్పందం
|
ఫౌండేషన్ మోడల్స్‌తో సహా సంపూర్ణ ఏఐ సాంకేతిక స్టాక్‌లో సహకారం కోసం ఇది ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
|
|
15
|
నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎక్స్ఐ), జపాన్ నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (జేపీఎన్ఐసీ) మధ్య అవగాహన ఒప్పందం
|
నేషనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ కార్యకలాపాలు, ఐపీవీ6 అమలు, ఇంటర్నెట్ భద్రతా మెరుగుదలలు, సామర్థ్య పెంపు, విద్యార్థులు లేదా నిపుణుల మార్పిడి కార్యక్రమాలు.. ప్రాంతీయ, ప్రపంచ వేదికలపై ఇంటర్నెట్ గవర్నెన్స్ గురించి అభిప్రాయాల మార్పిడి వంటి అంశాల్లో సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
|
|
16
|
అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్ సీఏ), జపాన్ ఆర్థిక సేవల ఏజెన్సీ (జేఎఫ్ఎస్ఏ) మధ్య పత్రాల (లెటర్స్) మార్పిడి
|
ఆర్థిక సేవల అభివృద్ధి, నియంత్రణ- పర్యవేక్షణతో పాటు ముఖ్యంగా ఫిన్‌టెక్, రెగ్‌టెక్ రంగాల్లో ఆర్థిక-మార్కెట్ పోకడలు, ఉత్తమ పద్ధతులపై సమాచార మార్పిడి కోసం ఇది ఒక సహకార ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
|