ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

‘భారత్ లైఫ్ సైన్సెస్ అవార్డు 2026’ కోసం దరఖాస్తులు ప్రారంభం


పరిశోధన, ఆవిష్కరణ, అంకుర సంస్థలు, శాస్త్రీయ నాయకత్వానికి గుర్తిపుంగా ఆరు అవార్డులు

प्रविष्टि तिथि: 01 JUL 2026 5:22PM by PIB Hyderabad

భారతదేశ జీవ శాస్త్ర రంగంలో శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు, ప్రజారోగ్యంపై చూపే సానుకూల ప్రభావంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారిని గుర్తించేందుకు ‘భారత్ లైఫ్ సైన్సెస్ అవార్డు (బీఎల్ఎస్ఏ) 2026’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వైద్యం,జీవ శాస్త్ర రంగాలను అభివృద్ధి చేస్తున్న  అత్యుత్తమ శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, అంకుర సంస్థలు, వ్యవస్థ నాయకులను గౌరవించేందుకు ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డుల విజేతలకు మొత్తంగా రూ. 7 కోట్ల ఆర్థిక సహాయం సహాయం లభించనుంది. ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ), లిల్లీ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం, ఔషధ విభాగం, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ), ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు పూర్తి మద్దతును అందిస్తున్నాయి.

 

ఈ అవార్డు ప్రక్రియలో మొత్తం 5 విభాగాల కింద 6 పురస్కారాలను అందజేస్తారు. వ్యక్తిగత ప్రతిభ, భాగస్వామ్య ఆవిష్కరణలు, సంస్థాగత ప్రతిభ, వైద్యం, జీవ శాస్త్రాల రంగాల్లోని అంకుర సంస్థలు, శాస్త్రీయ వ్యవస్త అభివృద్ధి వంటి రంగాలు వీటి పరిధిలోకి వస్తాయి. నాలుగు విభాగాల విజేతలకు ఆర్థిక సహాయం అందుతుండగా... మిగిలిన రెండు విభాగాలు ఆవిష్కరణలు, వ్యవస్థ నిర్మాణంలో అత్యుత్తమ సహకారం అందించిన వారిని గౌరవిస్తాయి. ఈ అవార్డుల కోసం వచ్చే దరఖాస్తులను ఒక స్వతంత్ర జ్యూరీ అత్యంత పారదర్శకంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుంది. 

 

ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ 2026 జూలై 1 నుంచి ప్రారంభమై ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. దీని కోసం ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దేశంలోని పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు రంగ ఆవిష్కర్తలు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం అభ్యర్థులు www.bharatlifesciencesawards.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

***


(रिलीज़ आईडी: 2280112) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil