ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఉత్తర ప్రదేశ్‌లో రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో ఎన్‌హెచ్-34 కాన్పూర్- కబ్రాయ్ 4/6 లైన్ల యాక్సెస్- కంట్రోల్డ్ రహదారి నిర్మాణం


బీఓటీ (టోల్) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం

प्रविष्टि तिथि: 01 JUL 2026 3:09PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్-కబ్రాయ్ యాక్సెస్కంట్రోల్డ్ నూతన రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏఆమోదం తెలిపిందిజాతీయ రహదారుల కార్యక్రమం ద్వారా రూపుదిద్దుకుంటున్న భోపాల్-కాన్పూర్ ఎకనామిక్ కారిడార్‌లో ఈ రహదారి కీలకం కానుందిప్రస్తుతం ఇది లైన్ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్‌గా నిర్మితమతున్నప్పటికీభవిష్యత్తులో దీనిని లైన్లుగా విస్తరించడానికి వీలుగా దీనికి రూపకల్పన చేశారుమొత్తం రూ.7,145.14 కోట్ల మూలధన వ్యయంతో వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), బీఓటీ టోల్ పద్ధతిలో అమలు చేయనుందిఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త రహదారి నిర్మాణంతో పాటు ప్రస్తుత ఎన్‌హెచ్-34 లోని కాన్పూర్-కబ్రాయ్ విభాగం నిర్వహణపర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎన్‌హెచ్ఏఐ చూసుకుంటుంది.

ఈ ప్రాజెక్టు కాన్పూర్కబ్రాయ్ నగరాల మధ్య నిరంతరఅధిక వేగంతో కూడిన అనుసంధానాన్ని అందించడమే కాకుండామధ్యప్రదేశ్‌లోని సాగర్భోపాల్ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మరింత బలోపేతం చేస్తుందితద్వారా ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామికవాణిజ్య కేంద్రాలను.. మధ్యప్రదేశ్‌లోని ఖనిజ సంపదఉత్పాదకవ్యవసాయ ప్రాంతాలతో అనుసంధానించే ఒక ఆధునిక ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాజెక్టు నిలవనుంది.

గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రూపొందించిన ఈ కారిడార్ వల్ల కాన్పూర్-కబ్రాయ్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 3.5 గంటల నుంచి కేవలం 1.5 గంటలకు (58 శాతంతగ్గిపోనుందిఇది రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటువాహనాల నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందిప్రయాణికులసరుకు రవాణా వాహనాల రాకపోకలను మరింత వేగవంతం చేస్తుందిఈ ప్రాజెక్టు జాతీయ రహదారులు ఎన్‌హెచ్-34, ఎన్‌హెచ్-35లతో పాటు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకాన్పూర్ రింగ్ రోడ్డురాష్ట్ర రహదారులైన ఎస్‌హెచ్-46, ఎస్‌హెచ్-91, ఎస్‌హెచ్-10బీఎస్‌హెచ్-42లతో వ్యూహాత్మక అనుసంధానాన్ని కలిగి ఉంటుందిదీనివల్ల ప్రాంతీయ రహదారి వ్యవస్థ మరింత బలోపేతమవుతుందిముఖ్యంగా కబ్రాయ్ గనుల ప్రాంతానికి అనుసంధానత పెరగడం వల్ల ఖనిజాలుపారిశ్రామిక వస్తువులునిర్మాణ సామగ్రివ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఎంతో సులువవుతుందిఇది సరుకు సామర్థ్యాన్ని పెంచిసరఫరా వ్యవస్థ స్థిరత్వానికిప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది.

పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఈ కాన్పూర్-కబ్రాయ్ రహదారి ప్రాజెక్టును రూపకల్పన చేశారుఈ కారిడార్ ద్వారా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని 16 ఆర్థిక కేంద్రాలకు రవాణా సౌకర్యం ఎంతగానో మెరుగుపడనుందిఇందులో భాగంగా ఉన్నావోబంథర్పంఖీరానియాజైన్‌పూర్రూమాచాకేరిసుమేర్‌పూర్భూరాగఢ్ పారిశ్రామిక ప్రాంతాలతోపాటు ట్రాన్స్ గంగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్గ్రోత్ సెంటర్ జైపూర్కాన్పూర్ నగర్ నోడ్బెంగాల్ రసాయనాలుఔషధాల సంస్థ వంటి కీలక పారిశ్రామిక రంగాలు నేరుగా లబ్ధి పొందనున్నాయిపారిశ్రామిక రంగంతో పాటు ఈ ప్రాంతంలోని సామాజికపర్యాటకఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా ఈ రహదారి ద్వారా అనుసంధానత మెరుగవనుందివాటిలో ఫతేపూర్మహోబాకాన్పూర్ జూలాజికల్ పార్క్బుద్ధ పార్క్జేకే టెంపుల్-గార్డెన్రాధాకృష్ణ ఆలయంసిద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయంగోపేశ్వర్ మందిర్మహోబా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయిసరుకు రవాణా రంగాన్ని వేగవంతం చేసేందుకు 10 లాజిస్టిక్స్ కేంద్రాలను ఈ కారిడార్ అనుసంధానిస్తుందికాన్పూర్ఘటంపూర్హమీర్‌పూర్మహోబాకబ్రాయ్భర్వా సుమేర్‌పూర్బందా రైల్వే స్టేషన్లతో పాటు కాన్పూర్చకేరిఖజురహో విమానాశ్రయాలకు ఈ కారిడార్ ద్వారా అత్యుత్తమ రవాణా సౌకర్యం లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లోని వెనుకబడిన బుందేల్‌ఖండ్దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధిలాజిస్టిక్స్ పోటీతత్వంఆర్థిక వృద్ధి ఊపందుకోనున్నాయికేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం గతిశక్తి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ కారిడార్ ఎంతగానో దోహదపడనుంది.

 

ఈ భారీ ప్రాజెక్ట్ దేశంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయనుందినిర్మాణ సమయంలో ప్రతి లైన్ప్రతి కిలోమీటరుకు సుమారు 11,188 మందికి నేరుగా మరో 13,985 మందికి పరోక్ష పనిదినాల ఉపాధి లభిస్తుందిమొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు దాదాపు 1.2 కోట్ల పనిదినాల ప్రత్యక్షపరోక్ష ఉపాధి లభించనుందని అంచనాఆర్థికరవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ రహదారిపై రాబోయే ఆర్థిక సంవత్సరం 2028 నాటికి ప్రతిరోజూ సగటున ట్రాఫిక్ సుమారు 18,069 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్లురాకపోకలు సాగిస్తాయని భావిస్తున్నారుఇది ఈ ప్రాంతపు దీర్ఘకాలిక ఆర్థికరవాణా రంగానికి ఎంతో మేలు చేస్తుంది

***


(रिलीज़ आईडी: 2279910) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Odia , English , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam