ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఎన్‌హెచ్ (ఓ) పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుయిటీ విధానంలో మొత్తం 8.1 కి.మీ. 6 వరుసల రహదారి సొరంగ నిర్మాణానికి ఆమోదం


ఈ రహదారి సొరంగం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్ 248 బీబీ)ని ఢిల్లీ.. వసంత్ కుంజ్‌లో నెలకొన్న నెల్సన్ మండేలా మార్గ్‌తో కలుపుతుంది

ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.6989.67 కోట్లు

प्रविष्टि तिथि: 01 JUL 2026 3:06PM by PIB Hyderabad

ఎన్‌హెచ్ (పథకంలో భాగంగా హైబ్రిడ్ యాన్యుయిటీ విధానం(హెచ్ఏఎమ్)లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్‌హెచ్ 248 బీబీ)ని ఢిల్లీ.. వసంత్ కుంజ్‌లోని నెల్సన్ మండేలా మార్గ్‌తో కలిపే ఎన్‌హెచ్-148ఏఈలో- 6 వరుసల రహదారి సొరంగ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ రోజు ఆమోదం తెలిపిందిఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 8.1 కిలోమీటర్లుదీనికి మొత్తం మీద రూ.6969.67 కోట్లను ఖర్చు చేస్తారు.
ఈ ప్రాజెక్టు పశ్చిమదక్షిణ ఢిల్లీల మధ్య మెరుగైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుందిదీంతో దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కు  యూఈఆర్ 2/ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే కలుస్తుందిదీనికి అదనంగా గురుగ్రామ్ద్వారకాఐజీఐ విమానాశ్రయంపశ్చిమ ఢిల్లీ నుంచి దక్షిణ ఢిల్లీ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభతరమవుతాయిభూమి లోపల జంట సొరంగాలతో.. ఉపరితలం పైన రాకపోకల వ్యవధి కనీస స్థాయికి తగ్గుతుందిఅంతేకాక దక్షిణ రిడ్జ్ ఫారెస్ట్ (సొరంగానికి చెందిన 1.98 కి.మీభాగం రిడ్జ్ కింది నుంచి వెళ్తుందిసురక్షితంగానూ ఉంటుందిఏఐఐఎమ్ఎస్మహిపాల్‌పూర్‌ల మధ్య ఒక ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని కూడా ఎన్‌హెచ్‌ఏఐ ప్రతిపాదిస్తోందిఈ లింకు.. సొరంగాన్ని బారాపుల్లా ఎలివేటెడ్ రోడ్డుతో అనుసంధానిస్తుందిదీంతో పశ్చిమ ఢిల్లీదక్షిణ ఢిల్లీలు.. తూర్పు ఢిల్లీఘజియాబాద్నోయిడాలతో కలుస్తాయి.
ప్రతిపాదిత సొరంగం రంగ్‌పురి (దక్షిణ ఢిల్లీరిడ్జ్ గుండా వెళ్తుందిదీనిని ఒక ట్విన్ ట్యూబ్ సొరంగం (టన్నెల్ బోరింగ్ మెషీన్ ను ఉపయోగించి నిర్మిస్తారుమాదిరి డిజైన్ చేశారుఇది శివ్‌ మూర్తి ఇంటర్‌చేంజ్ నుంచి మొదలైనెల్సన్ మండేలా మార్గ్మహిపాల్‌పూర్ ఛతర్‌పూర్ రోడ్డు  నాలుగు రోడ్ల కూడలి కన్నా ముందే ముగుస్తుంది.
ఈ  చౌరస్తా లో రద్దీని తగ్గించడానికి నెల్సన్ మండేలా మార్గానికి సమాంతరంగా ఒక ఎలివేటెడ్ రోడ్డును (1.8 కి.మీ.) కూడా ప్రతిపాదించారుఛతర్‌పూర్ నుంచి మహిపాల్‌పూర్ వైపు ఇప్పటికే ఉన్న ఫ్లయ్‌ఓవరుకు సమాంతరంగా ఒక అదనపు ఫ్లయ్‌ఓవరును కూడా ప్రతిపాదించారు.  ఛతర్‌పూర్ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం కుడి వైపు తిరిగే సదుపాయాన్ని కల్పించడానికి ఒక ఎలివేటెడ్ యూ-టర్నునూ ప్రతిపాదించారు.
ప్రధాన క్యారేజ్‌వే పొడవు 6.3 కి.మీ ఉందిమహిపాల్‌పూర్ ఛతర్‌పూర్ రోడ్డులో ప్రతిపాదిత ఫ్లయ్‌ఓవర్ఎలివేటెడ్ యూ-టర్నును లెక్కలోకి తీసుకొంటేప్రాజెక్టు మొత్తం పొడవు 8.100 కి.మీఅవుతుందిదీనిలో 3.140 కి.మీసొరంగం, 0.980 కి.మీసొరంగ అప్రోచ్ ర్యాంపు, 0.554 కి.మీఆర్ఈ గోడతో పాటు అప్రోచ్, 2.556 కి.మీఎలివేటెడ్ భాగం, 0.870 కి.మీ మేర ఎట్-గ్రేడ్ రోడ్డు కలిసి ఉన్నాయి.
జాతీయ రహదారికి చెందిన ప్రతి ఒక్క లేన్ కిలోమీటరును అభివృద్ది చేయడంలో సగటున 264 పనిదినాల ప్రత్యక్ష ఉపాధితో పాటు సగటున 55 పనిదినాల పరోక్ష ఉపాధి లభిస్తుందిఈ లెక్కన ఈ ప్రాజెక్టుతో సుమారు 7.54 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధే కాకుండా 9.80 లక్షల పనిదినాల పాటు పరోక్ష ఉపాధి కూడా లభిస్తుందిప్రతిపాదిత హై-స్పీడ్ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ప్రాజెక్టుతో అదనపు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

 

శివ్ ‌మూర్తి ఇంటర్‌చేంజ్ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు నెల్సన్ మండేలా మార్గ్వసంత్ కుంజ్ ల మధ్య ప్రతిపాదిత సొరంగానికి గాను ప్రాజెక్టు అలైన్‌మెంటు మ్యాప్

 

***


(रिलीज़ आईडी: 2279887) आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam