ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JUL 2026 12:50PM by PIB Hyderabad

చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం ఈ రోజు. దీనిని పురస్కరించుకొని చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్లు చాలా కాలం నుంచీ భారత ఆర్థిక పయనంలో విశ్వసనీయ భాగస్వాములుగా ఉంటున్నారని శ్రీ మోదీ కొనియాడారు. పారదర్శకతకీ, వృత్తికౌశలానికీ చార్టర్డ్ అకౌంటెంట్లు నిబద్ధులై దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారనీ, వాణిజ్య వ్యవస్థకు మద్దతునిస్తున్నారనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారనీ, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మేల్కొలిపారనీ ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ శుభాకాంక్షలు. వారు భారత ఆర్థిక పయనంలో విశ్వసనీయ భాగస్వాములుగా ఉన్నారు. పారదర్శకతకీ, వృత్తికౌశలానికీ చార్టర్డ్ అకౌంటెంట్లు నిబద్ధులై దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, వాణిజ్య వ్యవస్థకు మద్దతునిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని మేల్కొలుపుతున్నారు. వారి ప్రావీణ్యం ఆర్థిక వృద్ధిలో, దేశ నిర్మాణంలో గొప్ప తోడ్పాటును అందిస్తోంది. వికసిత్ భారత్ దిశగా మనం ముందుకు సాగుతున్న క్రమంలో వాణిజ్య వ్యవస్థ వర్ధిల్లే, అందరికీ అవకాశాలు పెరిగే వాతావరణాన్ని ఏర్పరచడంలో వారి ప్రయత్నాలు సహకారాన్ని అందిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2279806) సందర్శకుల సూచీ సంఖ్య : : 58