ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీమతి విజయ మెహతా జీ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JUL 2026 11:41AM by PIB Hyderabad

శ్రీమతి విజయ మెహతా జీ మృతికి ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. శ్రీమతి విజయ మెహతా గారు ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరనీ, సృజనాత్మకతకీ, కళాకౌశలానికీ మరో పేరనీ శ్రీ మోదీ ప్రశంసించారు. ఆమె నాటకాలూ, సినిమాలూ వివిధ తరాల నటులపైనా, దర్శకులపైనా, రంగస్థల ప్రేమికులపైనా ప్రభావాన్ని చూపాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘
శ్రీమతి విజయ మెహతా గారు ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డాను. సాంస్కృతిక రంగంతో పాటు చలనచిత్ర రంగంలోనూ మహామహుల్లో ఒకరిగా ఆమెను స్మరించుకుంటూ ఉంటాం.

ఆధునిక మరాఠీ నాటక రంగ మార్గదర్శకుల్లో ఒకరైన శ్రీమతి విజయ మెహతా గారు సృజనాత్మకతకీ, కళా కౌశలానికీ ప్రసిద్ధి పొందారు. ఆమె నాటకాలూ, చలనచిత్రాలూ వివిధ తరాలకు చెందిన నటులకూ, దర్శకులకూ, రంగస్థల ప్రేమికులకూ స్ఫూర్తిని ఇచ్చాయి.
ఆమె కుటుంబానికీ, అభిమానులకీ, కళాకారులందరికీ ఈ విషాద వేళలో నేను సంతాపాన్ని తెలుపుతున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2279704) సందర్శకుల సూచీ సంఖ్య : : 73