ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఛేదించిన డీఆర్ఐ.. .15 కిలోల బంగారం స్వాధీనం, నలుగురు అరెస్ట్

प्रविष्टि तिथि: 30 JUN 2026 5:03PM by PIB Hyderabad

ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారీ బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రట్టు చేశారు. ఒక పెద్ద ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. అంతర్జాతీయ సరిహద్దుల గుండా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఛేదించారు. వారి నుంచి రూ. 21.40 కోట్ల విలువైన 15 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలోని కొరియర్ టెర్మినల్ వద్ద థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ఒక అంతర్జాతీయ కన్సైన్‌మెంట్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఒక విదేశీయుడితో సంబంధం ఉన్న సంస్థ పేరు మీద ఈ కన్సైన్‌మెంట్ వచ్చింది.

 

ఇందులో ‘వాడేసిన గేర్ భాగాలు’ ఉన్నట్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. అయితే వాటిని నిశితంగా పరిశీలించగా గేర్ విడిభాగాల లోపల అత్యంత చాకచక్యంగా దాచి పెట్టిన 8 డిస్క్ ఆకారపు విదేశీ బంగారు ముక్కలను అధికారులు గుర్తించారు. ఇవి ఒక్కొక్కటి 1.5 కిలోల బరువున్నాయి. ఆ కన్సైన్‌మెంట్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న మొత్తం 12 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బంగారాన్ని అందుకోవలసిన వ్యక్తితో పాటు, ఈ స్మగ్లింగ్ సూత్రధారి నివాసాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక్కొక్కటి 1.5 కిలోల బరువున్న మరో రెండు ఇదే తరహా డిస్క్ ఆకారపు విదేశీ బంగారు ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసులో గతంలోనూ నేరచరిత్ర కలిగిన సూత్రధారితో పాటు ఒక విదేశీయుడిని, మొత్తం నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్‌ విషయంలో నిధులను సరిహద్దులు దాటించడానికి క్రిప్టోకరెన్సీని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

 

***


(रिलीज़ आईडी: 2279535) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Punjabi , Tamil