రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సైనికదళాల ప్రధానాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేఠ్

प्रविष्टि तिथि: 30 JUN 2026 2:37PM by PIB Hyderabad

సైనికదళాల ప్రధానాధికారి (సీఓఎఎస్)గా జనరల్ ధీరజ్ సేఠ్పీవీఎస్ఎమ్యూవైఎస్ఎమ్ఏవీఎస్ఎమ్ పదవీ బాధ్యతలు స్వీకరించారుఆయన జనరల్ ఉపేంద్ర ద్వివేదిపీవీఎస్ఎమ్ఏవీఎస్ఎమ్ వద్ద నుంచి బాధ్యతలు స్వీకరించారుజనరల్ ఉపేంద్ర ద్వివేది దేశ ప్రజలకు నాలుగు దశాబ్దాల కన్నా ఎక్కువ కాలం పాటు విశిష్ట సేవలను అందించిన తరువాత 2026 జూన్ 30న పదవీ విరమణ చేశారు.

జనరల్ ధీరజ్ సేఠ్ ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆయనను 1986 డిసెంబర్లో ఆర్మర్డ్ కార్జ్‌లో నియుక్తుడయ్యారుసుమారు నాలుగు దశాబ్దాల విశిష్ట సేనా సంబంధి ఉద్యోగ జీవన క్రమంలో ఆయన (యుద్ధ నిర్వహణ కేంద్రకార్యకలాపాలువ్యూహాత్మకసామర్థ్యాల వికాసంసంస్థాగత రంగాల్లో విస్తృత అనుభవాన్ని సంపాదించారుఅలా భారతీయ సైన్య యుద్ధ దక్షతదీర్ఘకాలిక పరివర్తనల్లో కీలక తోడ్పాటును అందించగలిగారు.

జనరల్ ఆఫీసర్ వివిధ సేనా ఉద్యమాల్లో ప్రతి ఒక్క స్థాయిలోనూ పగ్గాలను చేపట్టారుఆయన కమాండ్ అసైన్‌మెంట్లలో.. ఎడారి సెక్టర్లో సాయుధ పటాలంపశ్చిమ యుద్దభూమిలో సాయుధ వాహినిజమ్మూ కాశ్మీర్లో ఓ తిరుగుబాటుదారుల వ్యతిరేక దళం వంటివి భాగమయ్యాయిలెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఆయన సుదర్శన చక్ర కోర్ పగ్గాలు స్వీకరించారుఇది భారతీయ సైన్యంలో ప్రధాన స్ట్రయిక్ ఫార్మేషన్లలో ఒకటితరువాత ఆయన ఢిల్లీ ఏరియాలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ హోదాలో పనిచేశారుఅక్కడ కీలక జాతీయఅంతర్జాతీయ సైనిక ఉద్యమాల్లోనూసాంప్రదాయిక బాధ్యతలను పర్యవేక్షించారు.

సేనా కమాండర్ హోదాపదోన్నతి లభించిన మీదట ఈ అధికారి దక్షిణ పశ్చిమ కమాండుతో పాటు సదరన్ కమాండుకూ సారథ్యం వహించారురెండు సేనా కమాండ్లను సంబాళించడంతో పాటు రెండున్నర సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం ముఖ్య రణరంగాలలో వ్యూహాత్మక పర్యవేక్షణను అందించిన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారుఅనేక ముఖ్య సేనా సంబంధివ్యూహాత్మక పదవుల్లో ఆయన పనిచేశారుఈ క్రమంలో నిర్వహణ సంబంధ ప్రణాళికలూదళ నిర్వహణతో పాటు సామర్థ్య వికాసంపైనా ఎనలేని ప్రభావాన్ని చూపించారు.

సేన ఆధునికీకరణకు అందించిన తోడ్పాటుకు గాను విస్తృత స్థాయిలో గౌరవాన్ని పొందిన జనరల్ ఆఫీసరు ఆయనసేన ప్రధాన కేంద్రానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళిక రచనసామర్థ్యాల పెంపు విభాగాల్లో కీలక పదవులను నిర్వహించారుఫలితంగా ఆధునికీకరణ దిశసామర్థ్యాలతో ముడిపడిన మార్గసూచీదీర్ఘకాలిక ప్రాతిపదికన సైన్య స్వరూపానికి సంబంధించిన కార్యక్రమాలకు రూపురేఖలను తీర్చిదిద్దడంలో ఆయన తన వంతు పాత్రను పోషించినట్లయిందిసరికొత్తగా ఉనికిలోకి వస్తున్న సాంకేతికతలతో పాటు నిర్వహణపరమైన ఆవశ్యకతలను సమతౌల్యపరచడంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైంది.

జనరల్ ధీరజ్ సేఠ్ ఒక సమర్థ సైన్య వృత్తినిపుణుడువృత్తిపరమైన సైన్య శిక్షణలో ఆయన నిరంతరం శ్రేష్ఠ పనితీరును కనబరిచారుబోధన కోర్సుల్లో అగ్రగామి స్థానాలను అందుకున్నారుహయ్యర్ కమాండ్ కోర్సులోనూనేషనల్ డిఫెన్స్ కాలేజీలోనూ పట్టభద్రుడయ్యారుప్యారిస్‌లో ప్రతిష్ఠాత్మక కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సుకూ హాజరయ్యారుఇది సమకాలీన సైన్య వ్యవహారాల పట్ల ఆయనకు ఉన్న విస్తృత వ్యూహాత్మక దృక్పథాన్నీఅవగాహననీ చాటుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2279400) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam