హోం మంత్రిత్వ శాఖ
‘పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్’ ప్రయోగాత్మక ప్రాజెక్టును
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా..
పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా
దీర్ఘకాలిక విధానాలను రూపొందించడమే కాక వాటిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ,
క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా అమలుచేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
సర్వతోముఖ, సమ్మిళిత అభివృద్ధికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ప్రధాని
జనన, మరణాల నమోదు డేటాతో ముడిపడిన పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్ తో ప్రతి పాపాయికీ విశిష్ట గుర్తింపు
ప్రభుత్వ పథకాల లబ్ధి దానంతట అదే సకాలంలో అందుతుంది
లబ్ధిదారు గుర్తింపు, ప్రభుత్వ అందుబాటు ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు
ఇందులో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించనున్న పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్
ఏకీకృత పర్యవేక్షక వ్యవస్థతో, ఆపన్నులకు పథకాలు పక్కాగా చేరేలా చూడనున్న పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్
ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ పద్ధతిలో పేదలకు పారదర్శక, ప్రభావశీల సంక్షేమాన్ని
అందించడానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేసిన మోదీ ప్రభుత్వం
పేద కుటుంబాలు తరాల తరబడి ఎదుర్కొంటూ వచ్చిన అనేక సమస్యలను
కేవలం 12 సంవత్సరాల్లో పరిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
28 JUN 2026 9:51PM by PIB Hyderabad
‘పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్’ ప్రయోగాత్మక ప్రాజెక్టును కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర హోం కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్‌తో పాటు అనేక మంది ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగిస్తూ స్వాతంత్య్రం వచ్చిన తరువాతి భారత్ 100 సంవత్సరాల చరిత్రను ఎవరైనా రాస్తే, ఆ చరిత్ర రెండు భాగాలుగా ఉంటుందన్నారు. ఒకటో భాగం 2014కు ముందు భారత్ గురించీ, రెండో భాగం 2014కు తరువాత భారత్ గురించీ ఉంటుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో భారతదేశ ప్రజానీకం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. 2014 తరువాత, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, దేశంలోని ప్రతి రంగంలోనూ భారీ మార్పు చోటు చేసుకొందన్నారు. దేశ సమగ్ర, సర్వతోముఖ అభివృద్ధికి ప్రధాని శ్రీ మోదీ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారని శ్రీ షా అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతి రంగంలో దీర్ఘకాలిక విధానాలను రూపొందించడమే కాకుండా, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చేటట్లు చూసిందని శ్రీ షా అన్నారు. దేశ భద్రతను బలోపేతం చేయడానికీ, దేశ సంస్కృతిని పరిరక్షించడానికీ, విద్యా విధానాన్ని అమలుపరచడానికీ, స్వయంసమృద్ధి దిశగా పురోగమించడానికీ, ప్రతి రంగంలో విధానాల రూపకల్పనతో పాటు వాటిలో సమయానుసారంగా సంస్కరణలను తీసుకువస్తున్నారని శ్రీ షా అన్నారు.
భారత్‌లో కోట్లాది మంది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సమగ్ర ప్రయత్నాలు సాగాయని శ్రీ అమిత్ షా వివరించారు. ప్రస్తుతం దేశంలో బీదలకు ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు పంపుతున్న మొత్తం ఎంతయినా సరే, పూర్తిగా వారి చెంతకే చేరుతోందన్నారు. ప్రయోజనాల నేరు బదిలీ (డీబీటీ) పద్ధతిని ప్రవేశపెట్టి నిరుపేదల సంక్షేమంలో ఒక కొత్త యుగాన్ని మోదీ ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు. ఇళ్లు, విద్యుత్తు, నల్లా నీరు, మరుగుదొడ్లు, గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలు, ఉచితంగా రూ.5 లక్షల వరకూ వైద్య చికిత్సతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది పేద ప్రజలకు 90 శాతం చౌక మందులను కేవలం 12 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేసిందన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి స్వేచ్ఛా భారతావనిలో తమకు రావలసినవి పొందడానికి పాట్లు పడవలసివస్తున్న కోట్ల కొద్దీ ప్రజలకు న్యాయంగా వారికి దక్కవలసిన వాటాను నరేంద్ర మోదీ వారికి ఇచ్చిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. దేశంలో కోట్ల మందికి తరాల తరబడి ఎడతెగక వస్తున్న సమస్యల్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ 12 సంవత్సరాల్లోనే పరిష్కరించారని కూడా శ్రీ షా అన్నారు.
ప్రతి ఒక్కరికీ అందుతున్న పాలన ఫలితాలను ఆరా తీసే ఒక వ్యవస్థను ఈ రోజు ఇక్కడ పక్కాగా ప్రారంభించామని శ్రీ అమిత్ షా అన్నారు. ఇవాళ, బాలలకు పోలియో డోసులు వేయించారు. పోషణ కిట్లను కూడా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పూర్తి డేటాబేసును ఏకీకరించి, దానిని జనన మరణ డేటాతో ముడిపెట్టి పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకర్ సాయంతో ప్రతి ఒక్క బిడ్డకూ ఒక ఐడీనీ, ఒక విశిష్ట సంఖ్యనీ సమకూరుస్తారని వెల్లడించారు. ఈ వేదికతో, ప్రభుత్వ పథకాలన్నింటి ప్రయోజనాల్నీ అందిస్తారన్నారు. పీఎమ్ ఫ్యామిలీ ట్రాకర్ ఒక ఏకీకృత పర్యవేక్షక వ్యవస్థను తీసుకువస్తుందనీ, దాన్లో భాగంగా అవసరమైన వారిని గుర్తించి, వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనీ శ్రీ షా అన్నారు.
దేశ ఆరోగ్య రంగంలో ఒక పెను మార్పును ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు తీసుకు వచ్చారని కేంద్ర హోం మంత్రి అన్నారు. దేశ ఆరోగ్యసంరక్షణ రంగ అవసరాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారనీ, వాటిలో.. వైద్యుల లభ్యత, కోట్లాది పౌరులకు రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్స సౌకర్యం, మందులను తక్కువ ధరల్లో అందేటట్లు చూడడం, ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ఆయుష్ ద్వారా భారత సాంప్రదాయిక స్వాస్థ్య సంరక్షణ వ్యవస్థల్ని పునరుత్తేజితం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి పీఎమ్ ఫ్యామిలీ కేర్ ట్రాకరును ఈ రోజు ప్రారంభించినట్లు శ్రీ షా తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2278926)
आगंतुक पटल : 14