ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ ఇంధన భవిష్యత్తులో గ్లోబల్ సౌత్ కీలక పాత్ర పోషించాలని భారత్ ఆకాంక్షిస్తుందని తెలిపే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 JUN 2026 1:27PM by PIB Hyderabad

కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సురక్షితమైన, దృఢమైన, సమాననమై, స్థిరమైన ప్రపంచ ఇంధన భవిష్యత్తుకు గ్లోబల్ సౌత్ దేశాలు కీలక పాత్ర పోషించేలా భారత్ చేస్తున్న ప్రయత్నాలపై ఈ కథనాన్ని రాశారు. "బలమైన ఇంధన వ్యవస్థలు కేవలం పటిష్టమైన దేశీయ విధానాల ద్వారా మాత్రమే కాక... మరింత బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కూడా నిర్మితమవుతాయనే భారత్ విశ్వాసాన్ని ఈ కథనంలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్ చక్కగా వివరించారు" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

2026లో బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనున్న నేపథ్యంలో సురక్షితమైన, దృఢమైన, సమాననమై, స్థిరమైన ప్రపంచ ఇంధన భవిష్యత్తుకు గ్లోబల్ సౌత్ దేశాలు కేంద్రంగా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు.

స్థిరమైన ఇంధన వ్యవస్థలు కేవలం పటిష్టమైన దేశీయ విధానాల ద్వారానే కాక, మరింత బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కూడా ఏర్పడతాయన్న భారత్ విశ్వాసాన్ని ఆయన స్పష్టం చేశారు.


(రిలీజ్ ఐడి: 2278529) సందర్శకుల సూచీ సంఖ్య : : 56