మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాలు-2026’కు దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం

प्रविष्टि तिथि: 25 JUN 2026 1:30PM by PIB Hyderabad
‘జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాలు-2026’కు ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు నామినేషన్లను కేంద్ర విద్య మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆహ్వానించింది.
 

పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడం, విద్యార్థులు అన్ని విధాలుగా రాణించేటట్లు ప్రశంసనీయ సేవలను అందజేసిన ఉపాధ్యాయులను సత్కరించాలనే ఉద్దేశంతో ఈ పురస్కారాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత పాలన యంత్రాంగాలు నిర్వహిస్తున్న పాఠశాలలు, స్థానిక సంస్థలు, గుర్తింపు కల బోర్డులతో అనుబంధం కలిగి ఉన్న ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాల్లో పనిచేస్తున్న గురువులు ఆయా మార్గదర్శక సూత్రాలు, నియమ నిబంధనలకు లోబడి అర్హత ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

దరఖాస్తులను, నామినేషన్లను 2026 జులై 10 లోపల దాఖలు చేయాలి. సమగ్ర మార్గదర్శకాలు, అర్హత ప్రాతిపదికలు, మూల్యాంకన ప్రక్రియ, కాలరేఖలను పోర్టల్‌లో తెలుసుకోవచ్చు.

 


శ్రేష్ఠత్వాన్ని, నూతన ఆవిష్కరణలని, పాఠశాల విద్య రంగంలో నిబద్ధతని కనబరిచిన గురువులను సత్కరించడానికి జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను  ఏటా  అందిస్తున్నారు.
దరఖాస్తుదారులు  https://nationalawardstoteachers.education.gov.in/Login.aspx అనే వెబ్ చిరునామాలో మరిన్ని వివరాలు పొందవచ్చు : 

వరుస సంఖ్య

వివిధ దశలు

గడువు

  1.  

ఆన్‌లైన్‌లో  ఉపాధ్యాయుల స్వీయ నామినేషన్లను ఆహ్వానిస్తూ వెబ్ పోర్టల్‌ను తెరిచి ఉంచే కాలం

2026 జూన్ 15 నుంచి జులై 10 వరకు

  1.  

టీచర్లు స్వీయ నామినేషన్లను  ఎంత కాలం లోపు దాఖలు చేయవచ్చంటే..

2026 జులై 11 – 13 లోపు

  1.  

స్వతంత్ర జాతీయ న్యాయనిర్ణేతల బృందాన్ని ఏర్పాటు చేసేది ఎప్పుడంటే..

2026 జులై నెల మధ్యలో

  1.  

తుది నిర్ణయం కోసం జిల్లా, ప్రాంతీయ ఎంపిక సంఘాలు తాత్కాలిక ఎంపికను చేపట్టేది ఎప్పుడంటే ..

2026 జులై 14, 21 మధ్య

  1.  

తుది నిర్ణయం కోసం రాష్ట్రం లేదా, సంస్థ ఎంపిక సంఘాలు అభ్యర్థుల తాత్కాలిక ఎంపికను పూర్తి చేసేది ఎప్పుడంటే..

2026 జులై 22, 29 మధ్య

  1.  

తుది నిర్ణయం కోసం తాత్కాలికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు జ్యూరీతో సమావేశం అవ్వాల్సిందిగా  కబురు అందించేది ఎప్పుడంటే..

2026 జులై 30, 31 తేదీలలో

  1.  

ఎంపిక ప్రక్రియను స్వతంత్ర న్యాయనిర్ణేతల బృందం ఎప్పుడు చేపడుతుందంటే..

2026 ఆగస్టు 3, 7 తేదీల మధ్య

  1.  

సిఫార్సులను న్యాయనిర్ణేతల  బృందం ఖరారు చేసేది ఎప్పుడంటే..

2026 ఆగస్టు 8న

  1.  

విద్య శాఖ మంత్రి ఆమోదం తెలిపిన తరువాత ఎంపిక చేసిన పురస్కార విజేతలకు ఆ సమాచారాన్ని అందించేది ఎప్పుడంటే..

2026 ఆగస్టు 10, 20 మధ్య

  1.  

రిహార్సల్, పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఎప్పుడంటే..

2026 సెప్టెంబరు 4, 5 తేదీలలో

 

***


(रिलीज़ आईडी: 2277776) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , English , Urdu , हिन्दी , Gujarati , Tamil