రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారి భద్రతను పెంపొందించటానికి జాతీయ రహదారులపై ఆక్రమణలు, అనధికార పార్కింగ్‌లపై చర్యలను వేగవంతం చేసిన ఎన్‌హెచ్ఏఐ

प्रविष्टि तिथि: 24 JUN 2026 4:02PM by PIB Hyderabad

రహదారి భద్రతను బలోపేతం చేసేందుకుజాతీయ రహదారులపై అంతరాయం లేని ప్రయాణాన్ని కల్పించటమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐభారీ కార్యక్రమాన్ని చేపట్టిందిఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల వెంబడి అనధికార పార్కింగ్‌లనుఆక్రమణలను అరికట్టేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసిందిసుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారుప్రయాణికులకు మరింత సురక్షితమైనసమర్థవంతమైనసౌకర్యవంతమైన జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను అందించేందుకు ఎన్‌హెచ్ఏఐ నిరంతరం చూపే నిబద్ధతలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది.

జాతీయ రహదారులపై అనుమతి లేకుండా వాహనాలను పార్కింగ్ చేయటంరోడ్డు పక్కన ఆక్రమణలుచట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రమాదాలను కలిగిస్తాయిట్రాఫిక్‌ నియంత్రణనుభద్రతను దెబ్బతీస్తాయిఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ రాష్ట్రాల్లో అనధికారికంగా వాహనాలు నిలిపే 595 సమస్యాత్మక ప్రాంతాలను (లాంగిట్యూడ్లాటిట్యూడ్ వివరాలతో సహాఎన్‌హెచ్ఏఐ గుర్తించిందిజాతీయ రహదారుల నుంచి ఈ అనధికారిక పార్కింగ్‌లను తొలగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలుజిల్లా పాలనా విభాగం ఎన్‌హెచ్ఏఐ సమన్వయంతో పని చేస్తున్నాయి.

జాతీయ రహదారుల నియంత్రణ (భూమిట్రాఫిక్చట్టం-2002 నిబంధనల ప్రకారం జాతీయ రహదారుల పరిధిలోని ఆక్రమణలను తొలగించేందుకు ఎన్‌హెచ్ఏఐ ఉమ్మడి ప్రయత్నాలను చేపట్టిందివివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా రహదారి భద్రతా బలగాల ఏర్పాటుకునిబంధనల అమలును పర్యవేక్షిస్తూ వివిధ సంస్థల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించేందుకు నోడల్ అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఎన్‌హెచ్ఏఐ పని చేస్తోందిసకాలంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకుజాతీయ రహదారుల వ్యవస్థలో భద్రతకు సంబంధించిన సమస్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థలు సహకరిస్తాయి.

ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక వ్యవస్థల (ఏటీఎంఎస్ఏర్పాట్లను వెంటనే తనిఖీ చేయాలని క్షేత్ర స్థాయి కార్యాలయాలను ఎన్‌హెచ్ఏఐ ఆదేశించిందిఇందులో భాగంగా ట్రాఫిక్ మానిటరింగ్ కెమెరాలుప్రమాదాలను గుర్తించే వీడియో వ్యవస్థలువాహనాల వేగాన్ని నిర్దారించే పరికరాలుసమాచారాన్ని తెలియజేసే బోర్డులుఅత్యవసర కాల్ బాక్సుల వంటివన్నీ పూర్తిగా పని చేసేలా చూడాలని స్పష్టం చేసిందిదేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించటంప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా స్పందించటంచట్టాలను మరింత కఠినంగా అమలు చేయటానికి కొన్ని కీలక చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నారుఅందులో భాగంగా అంబులెన్స్‌లురికవరీ వాహనాలను అందుబాటులో ఉంచటంహైవే పెట్రోలింగ్‌ను పెంచటంఏటీఎంఎస్ హెచ్చరికలను చట్టపరమైన చర్యలు తీసుకునే సంస్థలతో అనుసంధానించటంభద్రతా మౌలిక సదుపాయాల ముందస్తు నిర్వహణను చేపట్టటం వంటి పనులను ముమ్మరం చేశారు.

***


(रिलीज़ आईडी: 2277677) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam