|
పార్లమెంటరీ వ్యవహారాలు
కేంద్రీయ విద్యాలయాలకు నిర్వహించిన ‘36వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ.. 2025-26’ బహుమతుల ప్రదానోత్సవం
प्रविष्टि तिथि:
24 JUN 2026 10:32AM by PIB Hyderabad
కేంద్రీయ విద్యాలయాలకు నిర్వహించిన ‘36వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ.. 2025-26’ బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని న్యూఢిల్లీ పార్లమెంట్ భవన సముదాయం, పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో భాగంగా ఉన్న జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధ్యక్షత వహించడంతో పాటు, పోటీలో విశిష్ట ప్రదర్శనను కనబరిచి బహుమతులను గెలుచుకున్న విద్యార్థులకు, విద్యాలయాలకు బహుమతులను అందిస్తారు. బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా.. కేంద్రీయ విద్యాలయాలకు నిర్వహించిన ‘36వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ.. 2025-26’లో ప్రథమ స్థానంలో నిలిచిన ‘‘డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ, ప్రెసిడెంట్ ఎస్టేట్, న్యూఢిల్లీ (ఢిల్లీ రీజియన్, నార్త్ జోన్)’’ విద్యార్థులు తమ యువజన పార్లమెంటు సమావేశాల సన్నివేశాన్ని మరో సారి ప్రదర్శించనున్నారు.
గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాలకు యువజన పార్లమెంటు పోటీలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. కేంద్రీయ విద్యాలయాలకు జాతీయ యువజన పార్లమెంటు పోటీ పథకంలో భాగంగా, ఈ వరుసలో 36వ పోటీని 2025-26 లో నిర్వహించారు. దీనిలో దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో విస్తరించిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు చెందిన 200 విద్యాలయాలు పాల్గొన్నాయి.
యువజనులలో స్వీయ క్రమశిక్షణ, వివిధ రకాలైన అభిప్రాయాలను మన్నించడం, ఆలోచనలను నిష్పక్షపాతంగా తెలియజేయడం, ప్రజాస్వామిక జీవన శైలితో ముడిపడిన ఇతర గుణాలను అలవరచడమే యువజన పార్లమెంటు పథకం ధ్యేయం. దీనికి తోడు, ఈ పథకం చట్టసభల విధివిధానాలు, ప్రక్రియలు, చర్చలకు సంబంధించిన మెలకువలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ సామర్థ్యాన్ని, ప్రభావవంతమైన వాగ్ధాటిని నేర్పుతుంది.
పోటీలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని గెలిచినందుకు ‘‘డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ, ప్రెసిడెంట్ ఎస్టేట్, న్యూఢిల్లీ (ఢిల్లీ రీజియన్, నార్త్ జోన్)’’కు ‘‘సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ రన్నింగ్ పార్లమెంటరీ షీల్డు’’తో పాటు ట్రోఫీని అందిస్తారు. దీనికి అదనంగా, జోన్ల స్థాయిలో ప్రథమ స్థానాన్ని గెలిచిన ఈ కింద పేర్కొన్న 4 కేంద్రీయ విద్యాలయాలకు జోనల్ విజేత ట్రోఫీలను కూడా ప్రదానం చేస్తారు:-
|
వరుస
సంఖ్య
|
కేంద్రీయ విద్యాలయ పేరు
|
జోన్
|
|
1.
|
- కేంద్రీయ విద్యాలయ, మథుర కంటోన్మెంట్, మథుర, ఉత్తరప్రదేశ్ ఎఫ్‌క్యూఏ రీజియన్
|
పశ్చిమ
|
|
2.
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.1, మదురై, తమిళనాడు (చెన్నై రీజియన్)
|
దక్షిణ
|
|
3.
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.2, శివాజీ నగర్, భోపాల్, మధ్యప్రదేశ్ (భోపాల్ రీజియన్)
|
మధ్య
|
|
4.
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బోర్‌జర్ గువాహాటీ, అస్సామ్ (గువాహాటీ రీజియన్)
|
తూర్పు
|
దీనికి అదనంగా, మంత్రి.. పోటీలో ప్రాంతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని గెలిచిన ఈ కింద ప్రస్తావించిన 20 కేంద్రీయ విద్యాలయాలకు ప్రాంతీయ విజేతలకు ఇచ్చే ట్రాఫీలను ప్రదానం చేయనున్నారు:
|
వరుస సంఖ్య
|
కేంద్రీయ విద్యాలయ పేరు
|
రీజియన్
|
|
1
|
కేంద్రీయ విద్యాలయ నెం.2,అఖ్‌నూర్, జమ్మూ
|
జమ్మూ
|
|
2
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, కపూర్‌థలా కంటోన్మెంట్, పంజాబ్
|
చండీగఢ్
|
|
3
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, సోలన్, హిమాచల్ ప్రదేశ్
|
గుర్గావ్
|
|
4
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, పిథోరాగఢ్, ఉత్తరాఖండ్
|
డెహ్రాడూన్
|
|
5
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, సబర్మతి, గుజరాత్
|
అహ్మదాబాద్
|
|
6
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సూరత్‌గఢ్, రాజస్థాన్
|
జైపూర్
|
|
7
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పుణే, మహారాష్ట్ర
|
ముంబయి
|
|
8
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, టాటా నగర్, తూర్పు సింగ్‌భూమ్, జార్ఖండ్
|
రాంచీ
|
|
9
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.1, సత్నా, మధ్యప్రదేశ్
|
జబల్పూర్
|
|
10
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్, పల్లిపురమ్, తిరువనంతపురమ్, కేరళ
|
ఎర్నాకుళమ్
|
|
11
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
|
హైదరాబాద్
|
|
12
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సాంబ్రా, కర్నాటక
|
బెంగళూరు
|
|
13
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.1, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చకేరీ, కాన్పూర్, ఉత్తరప్రదేశ్
|
లక్నో
|
|
14
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, దానాపూర్ కంటోన్మెంట్, పాట్నా, బీహార్
|
పాట్నా
|
|
15
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నెం.2, ఎన్‌టీపీసీ, కోర్బా, ఛత్తీస్‌గఢ్
|
రాయ్‌పూర్
|
|
16
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బీహెచ్‌యూ క్యాంపస్ (ఎఫ్ఎస్), వారణాసి, ఉత్తరప్రదేశ్
|
వారణాసి
|
|
17
|
కేంద్రీయ విద్యాలయ నెం.1, ఇంఫాల్, మణిపూర్
|
తిన్‌సుకియా
|
|
18
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బాలీగంజ్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
|
కోల్‌కతా
|
|
19
|
కేంద్రీయ విద్యాలయ ఓఎన్‌జీసీ, శ్రీకోనా, అస్సామ్
|
సిల్చార్
|
|
20
|
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, బర్‌గఢ్, భువనేశ్వర్, ఒడిశా
|
భువనేశ్వర్
|
***
(रिलीज़ आईडी: 2277381)
|