యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ క్రీడా బోర్డులో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం


జాతీయ క్రీడా సంస్థలకు బోర్డు గుర్తింపును మంజూరు చేయటానికి.. పాలన, ఆర్థిక, నైతిక ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చూసేందుకు కేంద్ర ప్రాధికార సంస్థగా వ్యవహరించనున్న జాతీయ క్రీడా బోర్డు

प्रविष्टि तिथि: 23 JUN 2026 1:00PM by PIB Hyderabad

జాతీయ క్రీడా బోర్డులో ఛైర్‌పర్సన్ఇద్దరు సభ్యుల ఎంపిక కోసం యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది.

జాతీయ క్రీడా పరిపాలన చట్టం-2025, జాతీయ క్రీడా పరిపాలన నిబంధనలు (జాతీయ క్రీడల బోర్డు)-2026 ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

జాతీయ క్రీడా బోర్డులో ఛైర్‌పర్సన్ఇద్దరు సభ్యుల నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుందిజాతీయ క్రీడా బోర్డు (సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీనిబంధనలు-2026లోని రూల్ 3(3) ప్రకారం ఏర్పాటైన సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకం జరుగుతుందిప్రజా పరిపాలనక్రీడా పాలనక్రీడా చట్టం ఇతర సంబంధిత రంగాల్లో పరిజ్ఞానంఆచరణాత్మక అనుభవం ఉండి సమర్థతచిత్తశుద్ధిసమాజంలో మంచి గుర్తింపున్న వ్యక్తుల నుంచి వీరిని ఎంపిక చేస్తారు.

జాతీయ క్రీడా బోర్డు ఛైర్‌పర్సన్సభ్యుల జీతభత్యాలుఇతర నిబంధనలు జాతీయ క్రీడా పరిపాలన నిబంధనలు-2026 ప్రకారం వర్తిస్తాయి.

జాతీయ క్రీడా సంస్థలకు బోర్డు గుర్తింపును మంజూరు చేయటానికి.. పరిపాలనఆర్థికనైతిక ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చూసేందుకు కేంద్ర ప్రాధికార సంస్థగా జాతీయ క్రీడా బోర్డు వ్యవహరిస్తుంది.

అర్హులైన అభ్యర్థులు https://sports.yas.gov.in/application_app. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చుదరఖాస్తులు సమర్పించేందుకు జూలై 22, 2026 చివరి తేదీ.

 

***


(रिलीज़ आईडी: 2277073) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Kannada