ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమబెంగాల్‌... తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం

प्रविष्टि तिथि: 20 JUN 2026 7:47PM by PIB Hyderabad

జై బాబా తారక్‌నాథ్హర్ హర్ మహాదేవ్!

గవర్నర్ ఆర్.ఎన్.రవిప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారివేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులుబెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్‌నాథ్‌ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్‌ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలుప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉందిబెంగాల్‌ గాలిలో తాజాదనం నిండిందిఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉందిసంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగాబెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోందిసరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమంప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనంప్రజల ముఖాల్లోని వెలుగుప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందంవిశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చానుఒక ఓటుఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్‌లో స‌్పష్టంగా తెలుస్తుంది.

మార్పు మంచి అనుభూతిని ఇస్తోందా?

పశ్చిమబెంగాల్ దివోత్సవ వేడుకల సందర్భంగా బెంగాల్ ప్రజలకుదేశ పౌరులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

మీరు చేపట్టిన "స్వచ్ఛతా సే స్వాగత్కార్యక్రమాన్ని నేను ప్రశంసిస్తున్నానుమనస్ఫూర్తిగా అభినందిస్తున్నానుపరిశుభ్రత మన దైనందిన జీవితంలో అంతర్భాగం కావాలిపరిశుభ్రత ఉన్న చోట అభివృద్ధి మరింత అందంగా విరాజిల్లుతుంది.

మిత్రులారా,

ఈ ఏడాది పశ్చిమబెంగాల్ దినోత్సవం మరింత ప్రత్యేకమైనదిస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం కన్న కలలుబెంగాల్ మహానుభావుల దూరదృష్టి.. ఇవాళ పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున తొలిసారిగా ఆ కలలు నిజమవటాన్ని మనం కళ్లారా చూస్తున్నాంఈ చరిత్రాత్మక రోజు బెంగాల్ అభివృద్ధికి గొప్ప స్ఫూర్తిగా నిలవాలనిమనం సరికొత్తఘనమైన చరిత్రను సృష్టించాలని ఆకాంక్షిస్తున్నానుబీజేపీ-ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఇదే లక్ష్యం కోసం నేడు భారీ అభివృద్ధి ఉద్యమం ప్రారంభమవుతోంది.

మిత్రులారా,

మొదట వామపక్షాలుతర్వాత టీఎంసీ దశాబ్దాలుగా బెంగాల్‌ను కోలుకోలేనంత అగాధంలోకి నెట్టాయిఆ అగాధాన్ని పూడ్చేందుకు ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం శరవేగంతో పనిని ప్రారంభించిందిమెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారునిలిచిపోయిన ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయిఈ క్రమంలోనే ఇవాళ ఇక్కడ వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు జరిగాయిరైల్వేరోడ్డువ్యవసాయంమత్స్య రంగానికి చెందిన ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి నూతనోత్తేజాన్ని అందిస్తాయిఇవి ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయిఈ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా నేను బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాపీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను కూడా ఇవాళ విడుదల చేశాందేశవ్యాప్తంగా కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.19,000 కోట్లు నేరుగా జమ అయ్యాయిలబ్ధిదారులైన రైతు కుటుంబాలన్నింటికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

బానిసత్వ రోజుల్లో బెంగాల్ ఎన్నో బాధలనులెక్కలేనన్ని త్యాగాలనుఎంతో వైరాగ్యాన్ని చూసింది. 1946లో కోల్‌కతాలో జరిగిన హింసాకాండనోయాఖాలీ అల్లర్లలో ఎంతోమంది అమాయక బెంగాలీలతో పాటు మరెన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

సోదరీసోదరులారా,

బెంగాల్.. రక్తపాతాన్ని చవిచూసిందిసొంత ప్రజలను కోల్పోయిందిమాతృభూమి ముక్కలవటాన్ని కళ్లారా చూసిందిఅయినప్పటికీ అస్తిత్వాన్నిఆత్మ స్వరూపాన్ని కోల్పోవటానికి బెంగాల్ అస్సలు అంగీకరించలేదుఫలితంగా బెంగాల్‌ను భారత్ నుంచి వేరు చేసేందుకు కుట్ర జరిగినపుడు ఆ కుతంత్రాలు విజయవంతం కాకుండా పశ్చిమబెంగాల్ ఆవిర్భావం అడ్డుకుందివేల ఏళ్ల నాటి ఇక్కడి నాగరికతసంస్కృతివిశ్వాసాలుసంప్రదాయాలు.. ఎన్నో పోరాటాల తర్వాత సజీవంగా నిలిచాయిఈ రోజు ఆ విలువలూసంప్రదాయాలూ పశ్చిమబెంగాల్‌లో కేవలం భద్రంగా ఉండటమే కాకఎంతో చైతన్యవంతంగాసజీవంగా ఉన్నాయికాబట్టి పశ్చిమబెంగాల్ దినోత్సవాన్ని నిర్వహించటం కేవలం ఒక తేదీని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు.. సంపూర్ణ చరిత్రను స్మరించుకోవటంవేల ఏళ్ల నాటి బెంగాల్‌ వారసత్వానికి మనం అర్పిస్తున్న ఘన నివాళి ఇది.

మిత్రులారా,

పశ్చిమబెంగాల్ దినోత్సవ ప్రాముఖ్యతను నేటి తరానికి గుర్తుచేయటం ఎంతో అవసరంఆ రోజుల్లో ఏం జరిగిందో నేటి యువతకు తప్పనిసరిగా తెలియాలిబెంగాల్ మొత్తాన్ని పాకిస్తాన్‌లో భాగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఆ కుట్రదారుల ముందు మోకరిల్లుతోందిసరిగ్గా అదే సమయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు. 1947 ఏప్రిల్‌లో ఆయన ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారుబెంగాల్ మొత్తం పాకిస్తాన్‌లో భాగం కాదని ఆయన ప్రకటించారుడాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో బెంగాలీ హిందూ హోమ్‌ల్యాండ్ మూవ్‌మెంట్ ప్రారంభమైందిశాస్త్రవేత్త మేఘనాథ్ సాహాచరిత్రకారులు ఆర్‌సీమజుందార్జదునాథ్ సర్కార్భాషా నిపుణుడు సునీతి కుమార్ ఛటర్జీ వంటి ప్రముఖ వ్యక్తులతో పాటు బెంగాల్‌కు చెందిన మరెంతో మంది మేధావులు ఈ ఉద్యమంలో చేరారుజీడీ బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారుమతువా సామాజికవర్గ నాయకుడు పీ.ఆర్ఠాకూర్ దీనికి మద్దతు పలికారువార్తాపత్రికల్లో వ్యాసాలుకథనాలు ప్రచురితమయ్యాయివందేమాతరం నినాదం మళ్లీ మారుమోగిందిమతతత్వ అజెండాల వల్ల అణచివేతకు గురైన బెంగాల్ గళం.. ఈ ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి ఊపందుకుందిఫలితంగా.. బెంగాల్ మొత్తాన్ని భారత్ నుంచి వేరుచేయటం అసాధ్యమని భారత వ్యతిరేక శక్తులు గ్రహించాయిఅలా పశ్చిమబెంగాల్మాతృభూమి భారతదేశంలో ఉండిపోయింది.

మిత్రులారా,

ఏ స్ఫూర్తితో స్వాతంత్ర్య సమయంలో పశ్చిమ బెంగాల్‌ను కాపాడుకున్నామో.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతా అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిందికానీ దురదృష్టవశాత్తూ అందుకు పూర్తి భిన్నంగా జరిగిందిపశ్చిమబెంగాల్ దినోత్సవందాని అసలు అర్థాన్ని ప్రజలు మర్చిపోయేలా చేసే ప్రయత్నం జరిగిందిరాజకీయ అజెండాల కోసం చరిత్రను "కప్పిపుచ్చేప్రయత్నం చేశారు.

సోదరీసోదరులారా,

దేశ విభజన సమయంలో బెంగాల్‌ను కాంగ్రెస్ వదిలించుకోవాలని అనుకుందివిభజన తర్వాత కూడా మిగిలిన పశ్చిమబెంగాల్‌లో ఓటు బ్యాంకు రాజకీయాన్ని మొదలుపెట్టిందిపశ్చిమబెంగాల్‌కు సంబంధించిన చరిత్ర అణచివేతకు గురైందిశ్యామా ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు కావడంతో ఆయన సహకారాన్ని గుర్తించేందుకు నిరాకరించారుఆయన ఏ స్ఫూర్తితోనైతే బెంగాల్ కోసం పోరాడారో.. ఆ స్ఫూర్తినే నిరంతరం లక్ష్యంగా చేసుకుని దాడి చేశారుగురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్బంకించంద్ర ఛటోపాధ్యాయస్వామి వివేకానందనేతాజీ సుభాష్ చంద్రబోస్ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహానుభావులకు జన్మనిచ్చిన ఈ గడ్డపై.. విదేశీ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దారుమొదట కాంగ్రెస్ఆ తర్వాత వామపక్షాలుఅనంతరం టీఎంసీ.. దశాబ్దాల తరబడి పశ్చిమబెంగాల్‌ను పోషించిబలోపేతం చేయటానికి బదులుగా అక్రమ చొరబాటుదారులకు స్థావరంగా బెంగాల్‌ను మార్చారుభారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహించాల్సిన బెంగాల్.. ముందుకు సాగటానికి బదులు వెనకబడిపోయింది.

మిత్రులారా,

పశ్చిమబెంగాల్ దినోత్సవం సందర్భంగా చరిత్రలో జరిగిన ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయటం మన బాధ్యతపశ్చిమబెంగాల్ దినోత్సవ స్ఫూర్తితో సరికొత్త చరిత్ర రూపుదిద్దుకుంటుంది.

మిత్రులారా,

దశాబ్దాల నాటి దుష్పరిపాలన పశ్చిమబెంగాల్‌ను ఎంతో వెనక్కి నెట్టిందిగత ప్రభుత్వాల హయాంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో మీరు చూశారుపెద్ద పరిశ్రమలు పారిపోయాయిచిన్న వ్యాపారాలు కుప్పకూలాయియువత ఉపాధి కోల్పోయిందివనరులను చొరబాటుదారులు ఆక్రమించుకున్నారుఒకప్పుడు అవకాశాల గనిగా విలసిల్లిన బెంగాల్.. వలసల కేంద్రంగా మారిపోయిందిఇలాంటి పరిస్థితుల్లోనే మీరొక శపథానికి పూనుకున్నారుటీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనిమీరు రికార్డు స్థాయి స్థానాలతో బీజేపీని ఆశీర్వదించారుఫలితంగా బెంగాల్ శరవేగంగా ప్రయోజనాలను పొందటాన్ని ఈ రోజు దేశమంతా కళ్లారా చూస్తోందిఏళ్లుగా నిరాకరించిన హక్కులు ఇప్పుడు మీ ఇంటి వద్దకే వస్తున్నాయిఎన్నికల సమయంలో మీకు ఆయుష్మాన్ భారత్ పథకం అందిస్తానని హామీ ఇచ్చానుఇప్పుడు బెంగాల్‌లోని ప్రతి పేదవాడు దీని ద్వారా ప్రయోజనం పొందుతాడుతల్లులుసోదరీమణులు అన్నపూర్ణ యోజన ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నారుప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందేలా చూసేందుకు జల జీవన్ మిషన్ ద్వారా పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికికేంద్ర ప్రభుత్వానికి మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందిఉద్యోగాల్లో వయోపరిమితిని సడలిస్తామని ఎన్నికల సమయంలో బెంగాల్ యువతకు మేము వాగ్దానం చేశాంఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరిందిమహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న హామీని కూడా నెరవేర్చాం.

మిత్రులారా,

రాజకీయ వైషమ్యాల కారణంగా ఏళ్లుగా ఎన్నో పథకాలు నిలిచిపోయాయిఆలస్యమయ్యాయిఈ రోజు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి.. జన కల్యాణ్ శిబిరాల ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోందిదళారులు లేరుఅవరోధాలు లేవు.. కేవలం మీ హక్కులపైబెంగాల్ అభివృద్ధిపైబెంగాల్దేశ రక్షణపై మాత్రమే పూర్తిగా దృష్టి సారిస్తున్నాంసరిహద్దు కంచె నిర్మాణానికి భూమి బదిలీ ప్రక్రియను గత ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి నిలిపివేయటం మీరు చూశారుకానీ నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యాయి.

సోదరీసోదరులారా,

పశ్చిమబెంగాల్‌లో పారిశ్రామిక పురోగతి మళ్లీ ఊపందుకోవటం పట్ల ఎంతో సంతోషిస్తున్నాపురోగతి పునాది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉందిఅవినీతి రహితపారదర్శకమైన పాలన.. చట్టబద్ధమైన పాలనకేవలం పశ్చిమబెంగాల్ మాత్రమే కాదు.. ఇవాళ దేశమంతటా ఈ మార్పును కళ్లారా చూస్తోందిమిమ్మల్ని దోచుకున్నవారే ఇప్పుడు ఆ సొమ్మును స్వయంగా తిరిగి ఇచ్చేస్తున్నారుపెద్ద పెద్ద దోపిడీదారులు జైలు పాలవుతున్నారుసిండికేట్ సభ్యులు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారుటోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసే గూండాలు పారిపోయారుబెంగాల్ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారుకమీషన్ల దందా ముగిసిపనులు ప్రారంభమయ్యాయి.

మిత్రులారా,

ఒకప్పుడు దెబ్బతిన్న రహదారులుశిథిలావస్థకు చేరిన మౌలిక వసతులతో కొట్టుమిట్టాడిన బెంగాల్‌.. ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు అత్యంత వేగంగా ముందుకు సాగడాన్ని చూస్తోందికోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌కు సంబంధించి చింగ్రీఘాటా క్రాసింగ్ వద్ద ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యాయిహౌరాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో డివిజనల్ రైల్వే నూతన ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిందిఇది అత్యవసర సేవలతో పాటు ప్రమాదకర వ్యాధులకు మెరుగైన చికిత్సను అందిస్తుందితూర్పు మేదినీపూర్‌లో హౌర్రాధామోహన్‌పూర్ మధ్య పైవంతెనసంక్రైల్-సంత్రాగచ్చి లింక్ లైన్ వంటి ప్రాజెక్టులు ఇక్కడి ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తాయి.

మిత్రులారా,

ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా కోట్లకు పైగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము నేరుగా జమ అయిందిపశ్చిమబెంగాల్ రైతులకు మరో సంతోషకరమైన వార్తఈ రోజు నుంచి రాష్ట్రంలో పీఎం పంట బీమా పథకం ప్రారంభమవుతోందిఈ పథకం కష్టకాలంలో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందిఒకవేళ పంటలు దెబ్బతిన్నా రైతుపై ఆర్థిక భారం పడదు.

మిత్రులారా,

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో ఇప్పుడు పశ్చిమబెంగాల్ కూడా భాగస్వామ్యం వహిస్తోందిఅగ్రి-స్టాక్ ద్వారా రైతుల సమగ్ర సమాచార రిజిస్టర్‌ను రూపొందించారుదీనిద్వారా గ్రామ పటాలుపంటలకు సంబంధించిన వివరాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయిదీనివల్ల ఎరువుల కొనుగోలురైతు క్రెడిట్ కార్డులుడీబీటీకనీస మద్దతు ధరకు పంటల కొనుగోలు సేవలు మరింత సులభమవుతాయి.

మిత్రులారా,

వ్యవసాయ రంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు పీఎం ధన-ధాన్య కృషి యోజనను ప్రభుత్వం ప్రారంభించిందిపశ్చిమబెంగాల్‌లోని నాలుగు జిల్లాలు.. పురూలియాడార్జిలింగ్అలీపుర్‌ద్వార్ఝార్‌గ్రామ్‌ను ఈ జాబితాలో చేర్చారుఇందులో భాగంగా ఉత్పాదకతను పెంచేందుకునిల్వ వసతుల నిర్మాణానికిరైతులకు సులభంగా రుణాలను అందించే పనులు జరుగుతాయిబెంగాల్‌లో చేపల పెంపకం.. రైతులనుమత్స్యకారులనువ్యాపారులను ఒకచోట చేరుస్తుందిఇందుకోసం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫ్రేజర్‌గంజ్ ఫిషింగ్ హార్బర్ సామర్థ్య విస్తరణ జరిగిందిబీర్‌భూమ్‌లో ఆధునిక చేపల మార్కెట్‌ను కూడా నిర్మించారుఇకపై బెంగాల్ ఆగిపోదుఇక బెంగాల్ వెనకడుగు వేయదు.. చరిత్ర సృష్టిస్తుంది.

మిత్రులారా,

ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతు సోదరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారువారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగవర్నర్లుమంత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారుదేశ నలుమూలన ఉన్న రైతులు ఈ ఉత్సవంలో పాలుపంచుకున్నారుఈ రైతులందరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులేనా రైతు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా ఒక విన్నపం చేయాలనుకుంటున్నానుదయచేసి అందరూ శ్రద్ధగా వినండినేను మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నానుమన పిల్లల కోసం బంజరు భూములను మిగల్చకూడదుపచ్చని సారవంతమైన భూములను అందించాలిభూమాతను మనం కాపాడుకోవాలిభారత ప్రభుత్వం "సేవ్ ది ఫీల్డ్స్ప్రచారాన్ని చేపట్టిందిఇది నేల ఆరోగ్యాన్ని పరిరక్షించటంరసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటంప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేస్తుందిమీరందరూ ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలనిమీ పొలాలను కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ పూనాలనిమీ చుట్టుపక్కనున్న రైతులను కూడా ఈ దిశగా ప్రోత్సహించాలనిమనమందరం కలిసి భూమాతను రక్షించుకోవాలని కోరుతున్నాపుడమి.. మన మాతృమూర్తిరసాయనాలతో భూమాతను చంపే మహా పాపానికి మనం ఒడిగట్టకూడదుభూమాతను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి.

మిత్రులారా,

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాంఈ సంకల్పానికి తూర్పు భారత అభివృద్ధి అత్యంత కీలకమైనదిఇందుకోసం మిషన్ పూర్వోదయపై పని చేస్తున్నాంఈ మిషన్‌లో బెంగాల్ పాత్ర ఎంతో కీలకంబెంగాల్ సాధించే పురోగతే తూర్పు భారతదేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.

సోదరీసోదరులారా,

ఈ అభివృద్ధి ప్రయాణంలో మనం ఇంకొక విషయాన్ని కూడా తప్పక గుర్తుంచుకోవాలిఅభివృద్ధికి మొదటిఅత్యంత ముఖ్యమైన నిబంధన.. శాంతిసామరస్యంసామాజిక స్థిరత్వంఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదుబెంగాల్ సాంస్కృతిక అస్తిత్వాన్నిసామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలిమనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి.

మిత్రులారా,

దేశంతో పాటు ప్రపంచమంతా రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుందిఈసారి నేను బెంగాల్ గడ్డపై యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానుస్వామి వివేకానందమహర్షి అరబిందో వంటి గొప్ప యోగులకు జన్మనిచ్చిన ఈ పుణ్యభూమియావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేలా గొప్ప సందేశాన్ని అందిస్తుందిబెంగాల్‌లోని ప్రతి మూలనప్రతి ప్రాంతంలోనూ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నామీరందరూ యోగాభ్యాసం చేయాలిఈ యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలిఈ విన్నపంతో పాటు ఈ అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాఇవాళ మనం పశ్చిమబెంగాల్ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగాఆనందంగా జరుపుకుంటున్న తరుణంలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నానుమీ మొబైల్ ఫోన్లు బయటకు తీసిఫ్లాష్ లైట్ ఆన్ చేయండిఅందరం కలిసి ఈ బెంగాల్ దినోత్సవ వేడుకను జరుపుకుందాంమొబైల్ లైట్లన్నీ వెలగాలినాతో కలిసి గట్టిగా చెప్పండిభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జై.

వందేమాతరంవందేమాతరంవందేమాతరం.

వందేమాతరంవందేమాతరంవందేమాతరం.

వందేమాతరం.

ధన్యవాదాలు.

***


(रिलीज़ आईडी: 2276409) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Malayalam