ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒకేసారి ఐఎన్‌ఎస్ అగ్రే, ఐఎన్‌ఎస్ దూనగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్ అనే మూడు నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన కార్యక్రమంలో తన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 21 JUN 2026 10:05PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించిన ‘ఐఎన్‌ఎస్ అగ్రే, ఐఎన్‌ఎస్ దూనగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్’ అనే మూడు నౌకలను నావికాదళంలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగానికి సంబంధించిన విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"ఏ దేశపు సముద్రయాన సామర్థ్యం ఎంత బలంగా ఉంటుందో ఆ దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కూడా అంతే శక్తిమంతంగా ఉంటుంది. భారత్ దీని కోసం తనను తాను సిద్ధం చేసుకుంటోంది."

"భారతదేశ శక్తికి అసలైన గుర్తింపు ఆత్మనిర్భరతలోనే ఉంది. ఏ రోజున మనం తయారీదారులుగా మారతామో ఆ రోజున మనం నిర్ణేతలుగా కూడా ఎదుగుతాం."

"భారతదేశం నేడు తన పూర్తి సముద్రయాన వ్యవస్థను బలోపేతం చేస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గాయి. పరిశ్రమలకు సరికొత్త వేగం లభించింది. తీరప్రాంతాలలో సరికొత్త అవకాశాలు వస్తున్నాయి."

"2014 నుంచి మేం విధానాల పరంగా కీలకమైన సంస్కరణలను చేపట్టాం. దీని ఫలితంగా రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా పెరగడంతో పాటు మన రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ వేగంతో వృద్ధి చెందాయి."


(రిలీజ్ ఐడి: 2276403) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam