ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 JUN 2026 10:11PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను నిజమైన ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

యోగా ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను పరస్పర సంక్షేమం, సంపూర్ణ ఆరోగ్యం అనే ఉమ్మడి లక్ష్యం దిశగా ఒకతాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మరింత మంది ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకునేలా ఈ రోజు (యోగా దినోత్సవం) స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రపంచవ్యాప్తంగా ఒక చిరస్మరణీయ యోగా దినోత్సవం! అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను నిజమైన ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రపంచవ్యాప్తంగా  ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. పరస్పర సంక్షేమ, సంపూర్ణ ఆరోగ్యం అనే ఉమ్మడి లక్ష్యం దిశగా యోగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఒకతాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకునేలా ఈ రోజు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను”  అని ప్రధానమంత్రి సామాజిక  మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2276400) సందర్శకుల సూచీ సంఖ్య : : 38