ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పశ్చిమ బంగ దివస్’ వేడుకల సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 JUN 2026 10:15PM by PIB Hyderabad

   పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో నిన్నటి ‘పశ్చిమ బంగ దివస్’ వేడుకల సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

“పశ్చిమ బెంగాల్‌ సందర్శన నాకు సదా ఆనందదాయకమే! ఈ నేపథ్యంలో తారకేశ్వర్‌ కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలివిగో...”pic.twitter.com/CnyrudUIbH

-      నరేంద్ర మోదీ, 2026 జూన్‌ 20

“దేశంలోని రైతుల సంక్షేమం, సాధికారతకు మేం కట్టుబడి ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి ‘పీఎం-కిసాన్‌’ పథకం కింద 23వ విడత నిధులను విడుదల చేసే అవకాశం నాకు లభించింది. ఇది లక్షలాది రైతు కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడటమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది.”

pic.twitter.com/l2pfJaFZPL

-నరేంద్ర మోదీ, 2026 జూన్‌ 20.

“భారత్‌ పురోగమనానికి సారథ్యం వహించగలిగే సామర్థ్యం గల బెంగాల్ రాష్ట్రం లోగడ దశాబ్దాల పాటు సాగిన కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీల దుష్పరిపాలన వల్ల ఎంతో వెనుకబడింది. ఈ నేపథ్యంలో నేడు ‘పశ్చిమ బంగ దివస్’ సందర్భంగా ఆ చారిత్రక తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుందామని ప్రతినబూనుదాం.”

pic.twitter.com/ZUDPvBBIpu

-నరేంద్ర మోదీ, 2026 జూన్‌ 20.

“పశ్చిమ బెంగాల్‌లోని నా కుటుంబ సభ్యులు తమ ఆశీర్వాదాల జల్లుతో రికార్డు స్థాయిలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా బీజేపీకి తోడ్పడ్డారు. ఫలితంగా ఏళ్ల తరబడి దక్కని తమ హక్కులను ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎలా పొందుతున్నారో నేడు యావద్దేశం గమనిస్తోంది.”

pic.twitter.com/dWNIKNjmZa

-నరేంద్ర మోదీ, 2026 జూన్‌ 20.

“మన భూమాతను, మన కమతాలను కాపాడుకుందాం... దేశంలోని నా రైతు సోదరీసోదరులకు ఇదే నా హృదయపూర్వక విన్నపం...”

pic.twitter.com/2XzKEvowc0

-నరేంద్ర మోదీ, 2026 జూన్‌ 20.

***


(रिलीज़ आईडी: 2276065) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Gujarati , Malayalam