ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 18 JUN 2026 11:47PM by PIB Hyderabad

నమస్తే!

నమస్కారం!

అందరూ హాలిడే మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

మిత్రులారా,

కాంతులురంగులతో కూడిన నగరం పారిస్ఇది కళలకుసరికొత్త ఆలోచనలకునూతన ఆవిష్కరణలకు స్ఫూర్తిభారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారుమీరే దీనికి సరికొత్తచైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.

ఇక్కడ తమిళులుపంజాబీలుగుజరాతీలుమరాఠీలుబెంగాలీలున్నారుభారతదేశంలోని ప్రతి ప్రాంత ప్రాతినిధ్యం ఇక్కడ కనిపిస్తుంది.

మిత్రులరా,

జూన్ 14న నేను నీస్ నగరానికి చేరుకునిహాజరైన మొదటి కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్నేడు ఫ్రాన్స్ నుంచి నేను తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కనెక్ట్స్ కార్యక్రమానికి చేరుకున్నట్లు అనిపిస్తోంది.

ఫ్రాన్స్‌లో నివసిస్తున్న మీరంతా 21వ శతాబ్దంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను అనుసంధానించిబలోపేతం చేసిన తీరు మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలకంగా మారిందిమీ అందరి కోసం 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను నేను తీసుకొచ్చానుమీరందించిన హృదయపూర్వకఆత్మీయ స్వాగతానికి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

మా ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో నేడు నేను ఫ్రాన్స్‌కు వచ్చానుఎన్నికైన ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు దేశానికి నిరంతరాయంగా సేవ చేయటం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటిటీ అమ్మే వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవటానికి కారణం.. భారతదేశ ప్రజాస్వామ్య బలం.

మిత్రులారా,

140 కోట్ల మంది భారతీయుల అసాధారణ సామర్థ్యాలకు నిదర్శనంగా గడచిన 12 ఏళ్లు నిలిచాయిఈ సమయంలో భారతదేశ జీడీపీ రెట్టింపు అయిందివిమానాశ్రయాల సంఖ్యవిశ్వవిద్యాలయాల సంఖ్య కూడా రెట్టింపయిందిజాతీయ రహదారుల నిర్మాణ వేగం మూడు రెట్లుమెట్రో వ్యవస్థ నాలుగు రెట్లు విస్తరించింది.

భారత్ ఎంత వేగంతోఏ స్థాయిలో పురోగమిస్తుందో మీకు అర్థమయ్యేలా మరిన్ని వాస్తవాలను చెబుతానుగత 12 ఏళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతులు 35 రెట్లు పెరిగాయి.

మరో ముఖ్యమైన విషయంభారత్‌లో మొబైల్ తయారీ యూనిట్ల సంఖ్య 100 రెట్లు పెరిగిందిప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించిందిఈ వేగంపురోగతి ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.

మిత్రులారా,

నేటి భారత్ కథ కేవలం ఆర్థిక పురోగతికి సంబంధించినది మాత్రమే కాదుఅది అక్కడితోనే ఆగిపోదుఇదొక సామాజిక పరివర్తన కథ.

గడిచిన 12 ఏళ్లలో భారత్‌లో 250 మిలియన్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారుమరో విధంగా చెప్పాలంటే.. ఈ పురోగతి ఫలాలు సమాజంలోని ప్రతీ వ్యక్తికి చేరుతున్నాయి. 12 ఏళ్లలో ఫ్రాన్స్ దేశంలోని మొత్తం ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువగా నిరుపేదల కోసం మేం శాశ్వత గృహాలను నిర్మించాం.

ఎంతటి పేద కుటుంబానికైనా నేడు ఒక బ్యాంకు ఖాతా ఉందిఆర్థిక సమ్మిళితత్వం ఇప్పుడు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోలేదు.. సామాజిక పరివర్తన ఉద్యమంగా మారింది.

మిత్రులారా,

ఈ 12 ఏళ్ల విజయాల్లో ఏ గణాంకాలుసంఖ్యలతోనూ కొలవలేని గొప్ప విజయాలున్నాయిఈ విజయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం.

నేటి భారతదేశంఇవాళ్టి భారత యువత పెద్ద పెద్ద కలలు కంటున్నారుభారతదేశ రైతులు సరికొత్త అవకాశాలతో ముందుకు సాగుతున్నారుదేశ మహిళలు అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నారుఇవి కేవలం 12 ఏళ్ల విజయాలు మాత్రమే కాదు.. భారతదేశ ఆకాంక్షలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన అద్భుతమైన కాలం.

మిత్రులారా,

ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో ఆధునిక వసతుల కల్పన కష్టంగా ఉండేదినేడు అదే గ్రామాల్లో విద్యుత్ఇంటర్నెట్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవల సరికొత్త ప్రపంచమే అందుబాటులోకి వచ్చిందిఈ రోజుల్లో కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఎప్పుడైనాఎక్కడైనా బ్యాంకింగ్ సేవలు సులభంగా పొందవచ్చు.

ప్రస్తుతం మొబైల్ ఫోన్లు భారత పౌరులను రకరకాల సేవలతోఅవకాశాలతో అనుసంధానిస్తున్నాయిమన రైతులుమత్స్యకారులుపాడి రైతులుమహిళలువిద్యార్థులుప్రతి ఒక్కరూ సాంకేతికత ద్వారా సాధికారత సాధిస్తూస్వయంగా నూతన అవకాశాలను సృష్టించుకుంటున్నారు.

మిత్రులారా,

మీరు 1.25 కోట్లకు పైగా ఆధార్ ఐడీల గురించి వినుంటారుభారత్ కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే డిజిటలైజ్ చేయటం లేదుప్రస్తుతం దాదాపు 900 మిలియన్ల భారతీయులకు యూనిక్ డిజిటల్ హెల్త్ ఐడీలు ఉన్నాయిఫలితంగా వైద్య రికార్డులు భద్రపరచటమే కాకఅవసరమైనప్పుడు సులభంగా పొందే వీలుంటుందిఈ ఐడీల ద్వారా మరింత సులభంగాసమర్థవంతంగా ఆరోగ్య సేవలందించవచ్చు.

మిత్రులారా,

ఈ విజయాలన్నింటిలో విశేేషమైన అంశాలున్నాయికొన్నేళ్ల కిందటి వరకు వీటిలో చాలా వరకు ఊహకు కూడా అసాధ్యంగా అనిపించేదిప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరుమారుమూల గ్రామాల్లోనూ క్యూఆర్ కోడ్లు దైనందిన జీవితంలో భాగం అవుతాయని ఎవరైనా ఊహించి ఉంటారాఒక గ్రామీణ మహిళ డ్రోన్‌ సహాయంతో వ్యవసాయ పనులు చేస్తుందని అనుకోవటం ఒకప్పుడు అసాధ్యంగా అనిపించేది.

కానీ నేడు కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ఇదంతా క్రమంగా సాధారణంగా మారిపోతోందిమిత్రులారాదీన్ని చూసి మీరు గర్విస్తారు.. ఎందుకంటే ఇదే నవభారత గుర్తింపుఒకప్పుడు కలగా అనిపించేదే నేడు నిజమైందిఒకప్పుడు అసాధ్యం అనుకున్న విషయం ఇప్పుడు సాధ్యమైందిఇదంతా జరగటం వెనకున్న అతిపెద్ద శక్తేమిటిదీనికి ఎవరు కారణంఇది మోదీ వల్ల జరిగింది కాదు.. ఇది భారత ప్రజాస్వామ్య శక్తిసబ్ కా సాథ్సబ్ కా వికాస్ భావనతో కూడిన భారతదేశ ప్రజాస్వామ్యమే ఇందుకు కారణం.

మిత్రులారా,

యాభైవందేళ్ల తర్వాత భారతదేశ చరిత్రలోని ఈ కాలాన్ని సమీక్షిస్తే.. భారత్‌ ఆకాంక్షలే ఈ యుగాన్ని నడిపించాయని స్పష్టమవుతుందిఇది భారతదేశ ఆకాంక్షల నవయుగం.

విద్యుత్ సరఫరా ఉన్నచోట ప్రజలు కేవలం విద్యుత్‌ను మాత్రమే కోరుకోవటం లేదు.. ఆధునిక జీవనశైలిని ఆశిస్తున్నారురైళ్లు చేరుకున్న చోట ప్రజలు హై-స్పీడ్ అనుసంధానాన్ని కోరుకుంటున్నారురహదారులు నిర్మించిన చోటప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేలను కోరుకుంటున్నారుఇంటర్నెట్ అనుసంధానమైన చోట ఏఐడిజిటల్ ఆవిష్కరణల్లో నాయకత్వాన్ని ఆశిస్తున్నారుచెప్పాలంటే.. నేటి భారతదేశ ప్రజలు జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకోవటమే కాకభారతదేశాన్ని కూడా తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నారుఅదే వారి లక్ష్యంసంకల్పంకల.

మిత్రులారా,

భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని నడిపించే అతిపెద్ద శక్తి ఈ ఆకాంక్షలేభారతదేశ అంతరిక్ష ప్రయాణాన్ని ఉదాహరణతో వివరిస్తానుచంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో చంద్రయాన్-3ని భారత్ విజయవంతంగా ల్యాండ్ చేసిందిఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించారుఅయితేదీన్నే చివరి గమ్యస్థానంగా భారత్ భావించలేదునేడు దేశం గగన్‌యాన్ కోసం సిద్ధమవుతోందిసొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.

ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో బలమైన ముద్ర వేసేందుకు భారతదేశ అంతరిక్ష అంకుర సంస్థలు గొప్ప సంకల్పంతోఆవిష్కరణలతో పనిచేస్తున్నాయి.

మిత్రులారా,

గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ చేస్తున్న కృషిలోనూ ఇవే ఆకాంక్షలు ప్రతిబింబిస్తున్నాయిసౌరశక్తి రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారుస్వచ్ఛమైన ఇంధన రంగంలో తదుపరి దశ వృద్ధిఆవిష్కరణల కోసం భారత్ సిద్ధమవుతోంది.

గ్రీన్ హైడ్రోజన్‌లో భారత్ భారీ పెట్టుబడులు పెడుతోందిఅత్యాధునిక అణుశక్తి రంగంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందిభారతదేశ ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ సాధించిన పురోగతి గురించి మీకు తెలిసే ఉంటుందిఇది భారత శాస్త్రవేత్తలు సాధించిన కీలక విజయంభారతదేశ అణుశక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే సామర్థ్యం దీనికి ఉంది.

మిత్రులారా,

భవిష్యత్తు కోసం బలమైన వ్యవస్థను భారత్ నిర్మిస్తోందిరాబోయే దశాబ్దాల్లో ప్రపంచాన్ని తీర్చిదిద్దేపురోగతిని నడిపించే అన్ని కీలక రంగాల్లో మేం పెట్టుబడులు పెడుతున్నాం.

కొన్నిరోజుల కిందట నీస్ నగరంలో జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ఈవెంట్.. భారతదేశ ఆవిష్కరణలనుడీప్-టెక్ సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిందిఈ కార్యక్రమంలో 120కి పైగా డీప్-టెక్ అంకుర సంస్థలు పాల్గొన్నాయిపరస్పర సహకారానికి కొత్త అవకాశాలను సృష్టిస్తూ దాదాపు 1,400 బీటుబీ సమావేశాలు జరిగాయిపలు అంకుర సంస్థలు పెట్టుబడి నిర్ణయాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లటంతో పాటువాణిజ్య అవకాశాలకు నూతన మార్గాలను తెరిచాయిఫ్రెంచ్యూరోపియన్ విశ్వవిద్యాలయాలతోఇంక్యుబేటర్లతో ఉన్న అనుబంధం మరింత బలోపేతమైంది.

విద్యార్థుల పరస్పర మార్పిడిఉమ్మడి పరిశోధనలుఆవిష్కరణలకు మద్దతిచ్చేందుకు కొత్త అవకాశాలను కూడా ఈ కార్యక్రమం సృష్టించిందిఫలితంగా భారత్ ఇన్నోవేట్స్ కేవలం ఒక సదస్సుగానే మిగిలిపోకుండా.. ఆవిష్కరణల దౌత్యానికి కొత్త నమూనాగా ఆవిర్భవించింది.

పారిస్‌లో జరిగిన వివాటెక్ కార్యక్రమం ద్వారా మనం ఈ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాంనీస్ నగరంలో ఆలోచనలను పెట్టుబడితో అనుసంధానించాంపారిస్‌లో భారత ఆవిష్కరణలను అంతర్జాతీయంగా విస్తరించాంభారత్ కేవలం భవిష్యత్తు కోసం సిద్ధమవటమే కాక భవిష్యత్తును తీర్చిదిద్దటంలో సహాయపడుతోందని ప్రపంచం గుర్తిస్తోంది.

మిత్రులారా,

ఒకప్పుడు కేవలం వాణిజ్యం ద్వారా మాత్రమే దేశాల మధ్య సంబంధాలుండేవికానీ నేడు వాణిజ్యంతో పాటు విశ్వసనీయత కీలకంగా మారిందిప్రతి దేశం విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలనుస్థిరమైన భాగస్వామ్యాలను కోరుకుంటోందిదీర్ఘకాలంలో ఆధారపడగలిగే భాగస్వాముల కోసం దేశాలు అన్వేషిస్తున్నాయిఇలాంటి తరుణంలో ప్రపంచానికి విశ్వసనీయమైనస్థిరమైన భాగస్వామిగా భారత్ అవతరిస్తోంది.

ఏవియాన్‌లో జరిగిన జీసదస్సులో విశ్వసనీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని నేను స్పష్టం చేశానుగ్లోబల్ సౌత్‌తో సమాన భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చానుజీశిఖరాగ్ర సదస్సులో భారత్ ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉందిసమ్మిళిత ప్రపంచపాలన ప్రభావవంతంగా ఉంటుందిఅందరి భాగస్వామ్యం ద్వారానే ప్రపంచ వృద్ధి స్థిరంగా ఉంటుందివిశ్వసనీయ ప్రపంచ సాంకేతికత మానవాళికి నిజమైన సేవ చేయగలదు.

మిత్రులారా,

ప్రపంచంతో భారతదేశ వాణిజ్య సంబంధాల్లో నూతనోత్తేజం కనిపిస్తోందిభారత్ఫ్రాన్స్‌ మధ్య వాణిజ్యం స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉందిఇటీవలి సంవత్సరాల్లో పలు దేశాలుప్రాంతాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందియూరోపియన్ యూనియన్యూకేప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వాములతో వాణిజ్య ఒప్పందాల ద్వారా భారత్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తూసహకారాన్ని విస్తరిస్తోంది.

వచ్చే నెల నుంచి భారత్యూకే మధ్య వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందిఈ ఒప్పందం భారతదేశ రైతులుకార్మికులుఆవిష్కర్తలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందిఅదే సమయంలో ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

నేడు ప్రపంచంలో అనిశ్చితిఅస్థిరతలు నెలకొన్నాయిఇలాంటి సమయంలో భారత్ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యం విశ్వసనీయతకుస్థిరత్వానికిసహకారానికి మూలాధారంగా ఆవిర్భవిస్తోంది.

భారత్-ఫ్రాన్స్ సంబంధాలను ఈ ఏడాది ప్రపంచ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాంప్రపంచ సంక్షేమానికి మన భాగస్వామ్యం కీలక శక్తిగా ఎలా మారగలదనే అంశంపై నీస్ నగరంలో ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్నేను చర్చించాంరక్షణఅంతరిక్షంఅణుశక్తి నుంచి మొదలుకుని ఏఐకీలక ఖనిజాలుహై-స్పీడ్ రైలు వరకు అనేక వ్యూహాత్మక రంగాల్లో మనం కలిసి ముందుకు సాగుతూనే ఉంటాం.

మిత్రులారా,

సమస్త మానవాళికి ప్రయోజనం చేకూర్చే పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు సౌరశక్తిఏఐ రంగంలో భారత్ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయిగతేడాది పారిస్‌లోఈ ఏడాది న్యూఢిల్లీలో నిర్వహించిన ఏఐ సదస్సుకు మనం సహ-అధ్యక్షత వహించాం.

వచ్చే ఏడాది సంయుక్తంగా చేపట్టనున్న తృష్ణ ఉపగ్రహ ప్రయోగానికి మనం సిద్ధమవుతున్నాంఈ మిషన్ ప్రపంచ ఆహారనీటి భద్రతకు సహకారాన్ని అందిస్తుంది.

మిత్రులారా,

ప్రభుత్వ కార్యక్రమాలకు మీరందించే సహకారం ఎంతో ముఖ్యమైనదిభారత్యూరప్‌కు మధ్య మీరే అత్యంత బలమైన వారధిఇరుదేశాల ప్రజలనుమార్కెట్లను మీరు చక్కగా అర్థం చేసుకోగలరురాబోయే ఏళ్లలో ప్రతిభవాణిజ్యంసాంకేతికతపర్యాటకంపెట్టుబడుల రంగాల్లో సరికొత్త అవకాశాలను కల్పించటంలో మీ పాత్ర మరింత కీలకం కానుంది.

మిత్రులారా,

ఉమ్మడి చరిత్రపరస్పర విలువలువిశ్వసనీయత భారత్ఫ్రాన్స్ దేశాలను మరింత దగ్గర చేశాయిప్రపంచ యుద్ధాల సమయంలో ఫ్రాన్స్ గడ్డపై ప్రాణాలర్పించిన భారత సైనికుల స్మృతులు ఉభయదేశాల మధ్య శాశ్వతమైన బంధానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

న్యూవ్-చాపెల్ వద్ద వారికి నివాళులర్పించే భాగ్యాన్ని పొందానుగతేడాది అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించే అవకాశం నాకు లభించిందిఈ ప్రదేశాలు మన ఉమ్మడి వారసత్వానికి చిహ్నాలు.

భారతీయుల సహకారాన్ని ఫ్రాన్స్ పరిరక్షించటమే కాక అభినందిస్తుంది కూడాఫ్రెంచ్ ప్రతిఘటన కోసం ప్రాణాలను అర్పించిన నూర్ ఇనాయత్ ఖాన్మహారాజా రంజిత్ సింగ్‌తో కలిసి పనిచేసిన జీన్-ఫ్రాంకోయిస్ అలార్డ్.. వీరిద్దరూ భారత్ఫ్రాన్స్ దేశాల మధ్య ఉమ్మడి వారసత్వానికి శాశ్వత చిహ్నాలు.

భారత్‌లోని పుదుచ్చేరిలోనూ ఫ్రెంచ్ వారసత్వాన్ని స్పష్టంగా చూడవచ్చుఅక్కడి నిర్మాణశైలికళలుసంస్కృతివంటకాల వంటివి మన ఉమ్మడి చరిత్ర ప్రభావాన్ని.. భారత్ఫ్రాన్స్ మధ్యనున్న అత్యంత సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తాయి.

మిత్రులారా,

ఫ్రాన్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయిఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లో యోగాను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు కీలక పాత్ర పోషించిన శ్రీ మహేశ్ ఘట్రద్యాల్‌కు నేను గౌరవపూర్వక నివాళులు అర్పించాలనుకుంటున్నానువందేళ్ల వయసులోనూ యోగా ద్వారా ఫ్రాన్స్‌ను భారతదేశ వారసత్వంతో అనుసంధానించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి షార్లెట్ చోపిన్‌కు నా ప్రణామాలు. "యోగాజీవితానికి సంవత్సరాలను మాత్రమే జోడించదు.. ఆ సంవత్సరాలకు జీవం పోస్తుందిఅని ఆమె జీవితం నిరూపించింది.

మిత్రులారా,

నేను శ్రీ ఫ్రెడ్ నెగ్రిట్‌ను కూడా ఎంతో గౌరవపూర్వకంగాభక్తిశ్రద్ధలతో స్మరించుకుంటున్నానుభారతదేశ వారసత్వాన్ని కాపాడటంలో ఆయన అందించిన సహకారం ఎంతో అమూల్యమైనది.

మిత్రులారా,

భారత్ఫ్రాన్స్‌ను అనుసంధానించే మరో అంశం ఫుట్‌బాల్ప్రస్తుతం ఇక్కడ ఫుట్‌బాల్ క్రేజ్‌ పతాక స్థాయిలో ఉందిదీనిపై ఉన్న మక్కువ ఫ్రాన్స్ అంతటా స్పష్టంగా కనిపిస్తోందిభారత్‌లోనూ ఫుట్‌బాల్ పట్ల చాలా క్రేజ్ ఉంది.

ఫ్రెంచ్ జట్టుకు భారత్‌లోనూ పెద్దఎత్తున అభిమానులున్నారుఈ ప్రపంచ కప్ ప్రచారాన్ని ఫ్రాన్స్ ఘనంగా ప్రారంభించిందిఫ్రెంచ్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.

మిత్రులారా,

ప్రసంగం ముగించే ముందు మీకు కొన్ని శుభవార్తలు చెప్పాలిఇవి ప్రత్యేకంగా మీ కోసమేగతేడాది మార్సెయిల్‌లో దౌత్య కార్యాలయం ప్రారంభమైందిఇది పనులను మరింత సులభతరం చేసిందికేవలం కొన్ని వారాల క్రితమే భారత పౌరుల కోసం ఫ్రెంచ్ విమానాశ్రయాల్లో వీసా రహిత రవాణా సౌకర్యాన్ని ప్రవేశపెట్టాం.

విద్యార్థులునిపుణుల స్థానచలనంవిద్యా అర్హతల పరస్పర గుర్తింపును ముందుకు తీసుకెళ్లడంఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లను తెరిచేలా ప్రోత్సహించటం వంటి అన్ని రంగాల్లో మనం కలిసి ముందుకు సాగుతున్నాం.

ఫ్రాన్స్‌లో యూపీఐ వినియోగ పరిధి మరింత విస్తృతం కానుందిదీనిద్వారా భారత్‌-ఫ్రాన్స్ మధ్య అనుసంధానం వేగంగా జరుగుతుందిపరస్పర చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతాయి.

మిత్రులారా,

ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా భారత్ఫ్రాన్స్‌ మరింత చేరువవుతాయిఈ భాగస్వామ్యానికి ఆధారంఈ బంధానికి అసలైన బలం మీరేనని నేను మరోసారి స్పష్టం చేస్తున్నామీరంతా నా తోటి దేశస్థులు.

అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం దిశగా భారత్ వేగంగా దూసకెళ్తున్న తరుణంలో మీరంతా భారత్‌తో అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నేను కోరుతున్నాఇది భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి నూతనోత్తేజాన్ని ఇస్తుందిమీ పూర్వీకుల భూమికి సేవ చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తుంది.

మీ అందరి ఆప్యాయతకుఉత్సాహానికిఈ హృదయపూర్వక స్వాగతానికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

భారత్ మాతాకీ జై!

ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

***


(रिलीज़ आईडी: 2275798) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia