ఆయుష్
azadi ka amrit mahotsav

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: దేశవ్యాప్త వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పౌరులకు ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు


100 ప్రముఖ ప్రదేశాల్లో వేడుకల ద్వారా దేశాన్ని ఏకం చేయనున్న ఐడీవై 2026


ఢిల్లీలో యోగాకు విశేష ప్రాధాన్యం.. 40 ప్రాంతాల్లో ఐడీవై వేడుకలు

प्रविष्टि तिथि: 20 JUN 2026 2:09PM by PIB Hyderabad

జూన్ 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై 2026) వేడుకలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో.. ఆరోగ్యకరమైన, సామరస్యపూర్వకమైన, భారతదేశ చిరకాల యోగా సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌ రావు జాదవ్ మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026  ప్రధాన కార్యక్రమం జూన్ 21న కోల్‌కతాలోని చారిత్రాత్మక ‘రెడ్ రోడ్’ వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతుంది. ఈ సందర్భంగా దేశమంతా ఏకమై ‘కామన్ యోగా ప్రోటోకాల్’ను ఆచరిస్తుంది. భారతదేశ యోగా సందేశాన్ని ప్రపంచంతో పంచుకుంటుంది’’ అని తెలిపారు.

 

పౌరులందరూ విస్తృతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ శ్రీ జాదవ్ మరో విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఈ సంవత్సరం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో ప్రత్యేక యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఇది భారతదేశ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రాత్మక కట్టడాలను, కాలాతీత యోగా సంప్రదాయాన్ని ఒకే చోట చేర్చుతుంది. ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక సందర్భంలో భాగస్వాములు కావాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ఒక చిరస్మరణీయమైన, విజయవంతమైన వేడుకగా మార్చడానికి ఉత్సాహంతో సహకరించాలని నేను కోరుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

 

ఈ సంవత్సరం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పురావస్తు సర్వేక్షణ విభాగం దేశంలోని 100 చారిత్రాత్మ ప్రదేశాల్లో ఈ యోగా వేడుకలను నిర్వహిస్తోంది. ఇది భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వానికి, చారిత్రాత్మక కట్టడాలకు, పురాతన యోగా సంప్రదాయానికి మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ప్రముఖంగా చాటిచెబుతుంది. 

 

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగే 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితా:

 

·       ఆంధ్రప్రదేశ్: లేపాక్షి, గండికోట, తిరుపతి, అమరావతి

·       అస్సాం: చరైడియో, గోల్పరా మరియు శివసాగర్

·       బీహార్: నలంద, విక్రమశిల. ముజఫర్‌పూర్

·       ఛత్తీస్‌గఢ్: సిర్పూర్

·       దాద్రా నగర్ హవేలీ, దామన్, డయ్యు: డామన్

·       ఢిల్లీ: హుమాయూన్ సమాధి, పురానా ఖిలా, కుతుబ్ మినార్, ఎర్రకోట, జంతర్ మంతర్, సఫ్దర్‌జంగ్ సమాధి

·       గుజరాత్: చంపానేర్, రాణి కి వావ్, ధోలావీరా, అహ్మదాబాద్ , మోధేరా

·       గోవా: పాత గోవా

·       హర్యానా: హన్సి

·       హిమాచల్ ప్రదేశ్: కాంగ్రా

·       జమ్మూ కాశ్మీర్,లడఖ్: రాంనగర్, శ్రీనగర్, లేహ్, అవంతిపుర

·       కర్ణాటక: ఐహోల్, బాదామి, బీజాపూర్, హళేబీడు, హంపి, పట్టడకల్, బెంగళూరు, శ్రీరంగపట్నం

·       కేరళ: బేకల్

·       మధ్యప్రదేశ్: అమర్‌కంటక్, భీంబేట్కా, భోపాల్, చందేరి, ఖజురహో, సాంచి, మండు

·       మహారాష్ట్ర: ఛత్రపతి సంభాజీనగర్, ఎలిఫెంటా, ముంబై, పూణే, జున్నార్, నాగ్‌పూర్‌(ఇతర ప్రాంతాలతో సహా)          

·       ఒడిశా: భువనేశ్వర్, మయూర్‌భంజ్, కోణార్క్ (ఇతర ప్రాంతాలతో సహా)

·       పంజాబ్: అమృత్‌సర్, బటాలా, భటిండా

·       రాజస్థాన్: చిత్తోర్‌గఢ్, కుంభాల్‌ఘర్, అంబర్, అజ్మీర్, అభనేరి, డీగ్

·       తమిళనాడు: వెల్లూరు, జింగీ, మహాబలిపురం, తంజావూరు, ఆదిచనల్లూరు

·       తెలంగాణ: హైదరాబాద్, వరంగల్ (ఇతర ప్రాంతాలతో సహా)

·       త్రిపుర: ఉనకోటి

·       ఉత్తరప్రదేశ్: లక్నో, అయోధ్య, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, లలిత్‌పూర్, ఝాన్సీ, చిత్రకూట్, కలైంజర్, మహోబా, హస్తినాపూర్, మీరట్, సారనాథ్, ప్రయాగ్‌రాజ్, కుషీనగర్

·       ఉత్తరాఖండ్: జగేశ్వర్, హనోల్ టియుని, గోపేశ్వర్ గుంట్, అల్మోరా

పశ్చిమ బెంగాల్: కూచ్ బెహార్, ముర్షిదాబాద్, కోల్‌కతా, బిష్ణుపూర్, కల్నా

 

 యోగాను పౌరులకు మరింత చేరువ చేసేందుకు.. ఢిల్లీ వ్యాప్తంగా ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలోని ప్రధాన పార్కులు, క్రీడా సముదాయాలు, వారసత్వ కట్టడాలు, కమ్యూనిటీ స్థలాలతో కూడిన కింద పేర్కొన్ననిర్ణీత వేదికల్లో ప్రజలు ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.  

·       శాంతిపథ్ లాన్

·       బాన్సెరా, సరాయ్ కాలే ఖాన్

·       యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్

·       లోధి గార్డెన్

·       లాల్ ఖిలా (ఎర్రకోట)

·       కర్తవ్య పథ్

·       న్యూ మోతీ బాగ్

·       పాలికా పార్క్, సిపి సెంట్రల్ పార్క్

·       పండారా పార్క్

 

***

 


(रिलीज़ आईडी: 2275718) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Kannada , Malayalam , English , Urdu , हिन्दी , Gujarati , Tamil