MIFF banner

ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 వేదికగా ఫిల్మ్ ఎడిటింగ్‌లోని నిగూఢ శక్తిని వివరించిన ప్రముఖ చిత్రరూపకర్త ఫెడెరికో అటెహోర్టువా సినిమా అంటేనే అనుసంధానాలు - ఫెడెరికో అటెహోర్టువా

ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్) – 2026 వేదికగా ఈ రోజు ‘ది ఫిలాసఫీ ఆఫ్ మాంటేజ్: అన్‌వీలింగ్ ది ఫోల్డ్స్’ పేరుతో ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల దర్శకులు ఫెడెరికో అటెహోర్టువా ఆర్టియాగా అత్యంత ఆసక్తికరమైన మాస్టర్‌క్లాస్‌ను నిర్వహించారు.

ఫిల్మ్ ఎడిటింగ్ గురించి ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని ఈ సమావేశం పూర్తిగా మార్చేసింది. 'పైరోటెక్నియా', 'ఫోరెన్సిక్స్వంటి ప్రశంసలు పొందినపలు పురస్కారాలు గెలుచుకున్న డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించిన తన అపార అనుభవంతో ఫెడెరికో మాట్లాడుతూ... సాంప్రదాయికంగా 'మాంటేజ్అని పిలిచే ఫిల్మ్ ఎడిటింగ్ కేవలం వీడియోలు, శబ్దాలను కత్తిరించే ఒక సాధారణ సాంకేతిక పని మాత్రమే కాదన్నారు. అది చరిత్రమానసిక సంఘర్షణలు, వాస్తవికతలను మనం అర్థం చేసుకునే విధానాన్ని తీర్చిదిద్దే ఒక అత్యంత అర్థవంతమైన చర్య అని ఆయన తెలిపారు.

ఈ మాస్టర్‌క్లాస్ సందర్భంగా పాతసాంప్రదాయిక చిత్రాలు ప్రతీ చర్యకు ఊహించదగిన ప్రతిచర్య ఉండే కఠినమైన 'కారణం-ఫలితంతర్కంపై ఎక్కువగా ఆధారపడేవని ఫెడెరికో వివరించారు. రెండో ప్రపంచ యుద్ధ వాస్తవ ప్రపంచ విషాదాల తర్వాతసినిమా మారిపోయింది. చిత్ర రూపకర్తలు పరిపూర్ణ కథానాయకులకు బదులుగా సాధారణ ప్రజలు, వాస్తవిక కథలపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.

ఈ మార్పు ఫిల్మ్ ఎడిటింగ్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. వాస్తవిక చిత్రాల నుంచి జాక్సన్ పొలాక్ చిత్రాల వంటి స్వేచ్ఛాయుతవాస్తవిక కళగా చిత్రలేఖనం ఎలా పరిణామం చెందిందో... అదేవిధంగా ఆధునిక ఫిల్మ్ ఎడిటింగ్ కవితాత్మకంగాకలలాగాకఠినమైన నియమాల నుంచి పూర్తిగా విముక్తి పొందింది. తెరపై ఉన్న ఒక చిత్రం అది కనిపించే తీరు వల్ల మాత్రమే శక్తిమంతమైనది కాలేదనీ... విభిన్న చిత్రాలుశబ్దాలు, ఆలోచనల మధ్య ఒక ఎడిటర్ సృష్టించే ఊహించనిలోతైన, సంక్లిష్టమైన అనుసంధానాల నుంచే అది నిజమైన శక్తిని పొందుతుందని ఆయన వివరించారు. సినిమా అంటేనే ఆ అనుసంధానాల సమ్మేళనమని ఫెడెరికో పేర్కొన్నారు.

యువ భారతీయ చిత్రరూపకర్తలువిద్యార్థులు, సినిమా ప్రేమికులు ఎడిటింగ్ కళను సరికొత్త కోణంలో చూసేలా ఈ మాస్టర్‌క్లాస్ స్ఫూర్తినిచ్చింది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275393   |   Visitor Counter: 8