ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 18 JUN 2026 11:39PM by PIB Hyderabad

ప్రధానమంత్రి 2026 జూన్ 18న ప్యారిస్‌లో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన భారీ సభను ఉద్దేశించి ప్రసంగించారుమాతృభూమి పట్ల అభిమానాన్ని ప్రతిబింబిస్తూ ప్రవాస భారతీయులు ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారుభారతీయ ఆవిష్కరణలనూఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూవారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారుఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులునిపుణులుపర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారుప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారుఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.

సమ్మిళిత వృద్ధిమహిళా నేతృత్వంలోని అభివృద్ధి నుంచి మానవ కేంద్రీకృత ఏఐఅత్యాధునిక సాంకేతిక రంగాల్లో పురోగతి వరకూ భారతదేశం సాధిస్తున్న పరివర్తన గురించి ప్రధానమంత్రి వివరించారుగడచిన 12 ఏళ్లలో భారతదేశం 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని ప్రధాని స్పష్టం చేశారుయూకేఈయూలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలతో భారతీయ కార్మికులురైతులుఆవిష్కర్తలుఇతరులకు కొత్త అవకాశాలను లభిస్తాయని ఆయన తెలియజేశారునైస్‌లో జరిగిన భారత్ ఇన్నోవేట్స్-2026, ప్యారిస్‌లో జరిగిన వివాటెక్-2026లో భారత్ భాగస్వామ్యం గురించి వివరించారుసాంకేతిక రంగంలో అంతర్జాతీయ సమాజానికి ప్రధాన భాగస్వామిగా భారత్ ఎదుగుతోందని తెలియజేశారుభారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమం సాధించిన విజయం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారుఆవిష్కరణల దౌత్యానికి ఈ వేదిక నమూనాగా నిలుస్తుందని తెలిపారుఏవియన్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో తాను పాల్గొనడం గురించి వివరిస్తూ.. గ్లోబల్ సౌత్‌ను సమాన భాగస్వామిగా పరిగణించే విశ్వాస ఆధారిత అంతర్జాతీయ భాగస్వామ్యాలను సృష్టించేందుకు భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారుడిజిటల్ యుగంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు ప్రతిభనైపుణ్యంఆవిష్కరణతో భారత్ ప్రపంచానికి సహాయపడుతోందని ప్రధానమంత్రి అన్నారుభారతదేశ ప్రగతికి తమ వంతు తోడ్పాటు అందించాలనీవికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగస్వామిగా మారాలని ప్రవాస భారతీయులను ఆహ్వానించారు.

భారత్ఫ్రాన్స్ మధ్య ఉన్న ప్రజా సంబంధాలను ఈ సమావేశం ప్రతిబింబించిందిఅలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమమూశ్రేయస్సూభాగస్వామ్యం పట్ల భారత దేశానికున్న చిత్తశుద్ధిని పునరుద్ఘాటించింది.

 

***


(रिलीज़ आईडी: 2275214) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Gujarati , Malayalam